అన్నయ్య 1742

అటువంటి సమయంలో నాకు నా భర్త కృష్ణ రాసుకున్న డైరీ సంగతులు గుర్తొచ్చాయి. దానితో పాటు తన నాకు ఒక బిడ్డను ఇవ్వలేని ఆయన బలహీనత గుర్తొచ్చింది. ఇటు నా భర్త తను కోరుకున్న విధంగా ఆడదానిగా మారిపోతే మా అన్నయ్యకి భార్యగా తనను చేయవచ్చు…. చిన్నపిల్లవాడైన నా మేనల్లుడికి ఒక అమ్మను ఇవ్వవచ్చు. అట్లాగే ఒంటరిగా మిగిలిపోయిన మా బావను నా భర్తగా పొందవచ్చు తద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చి గొడ్రాలి ముద్రను తొలగించుకోవచ్చు అనే ఆలోచన మొలకెత్తింది నాలో. మరి దీనికి కృష్ణ ఒప్పుకుంటాడా? ఏదేమైనా అన్ని సమస్యలకూ ఇదే పరిష్కారం.

ముందు అన్నయ్యతో మాట్లాడాను. అన్నయ్యా! వదిన మీద నీకు ప్రేమ ఉంది కాదనలేను కానీ నీ కొడుక్కి ఒక తల్లి కావాలి కదా … అహర్నిశలూ నువ్వు చూడలేవు కదా. కాబట్టి నీ కొడుక్కి ఇప్పుడు ఒక తల్లి కావాలి. నీ చెల్లిగా చెబుతున్నాను. వాడికోసమైనా నువ్వు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ నచ్చచెబితే వాడు అతి బలవంతం మీద సరే చెల్లీ నువ్వే చూడు వాడిని చూసుకోవడానికి ఒక తల్లిని అన్నాడు. అప్పుడు వాడికి మొత్తం కథ అంతా చెప్పాను … వాటితో పాటూ నా భర్త ఆడదాని ఆహార్యంలో ఉన్నప్పటి పొటోలు, తన డైరీలో వ్రాతలూ అన్నీ చూపించాను. తన వాళ్ళ నాకు పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదని చెప్పాను. ముందు నువ్వు ఒప్పుకుంటే విషయం నేను చూసుకుంటా అన్నాను. తను నేను చెప్పిన విషయాలన్నీ విని షాక్ అయిపోయాడు … కానీ రుజువులు తన ముందు పెట్టాను కదా చివరికి నమ్మాడు. ఒక గంట పాటు ఆలోచించి సరే చెల్లీ నీ భర్తను నా భార్యగా మారుస్తావు మరి నీ సంగతేమిటి అన్నాడు.

అప్పుడు నేను మా బావ కిరణ్ గురించి చెప్పాను .. తను నా గురించి మాత్రమె పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడనే విషయం చెప్పాను. “అన్నయ్యా! తను కూడా ఈ మధ్య మంచి ఉద్యోగంలో చేరాడు … అదీ గాక నా భర్త సంపాదించింది చాలా ఉంది … అమ్మా నాన్న మిగిల్చిన ఆస్తులు కూడా ఉన్నాయి. చివరికి అభ్యంతర పెట్టడానికి మన ఇరువైపులా పెద్దవాళ్ళూ లేరు. ఇక కిరణ్ తో నీవే మాట్లాడు. తను సంతోషంగా ఒప్పుకుంటాడు. అప్పుడు కృష్ణ కు నేను నచ్చ చెప్పి నేను ఒప్పిస్తాను. అందరూ సంతోషంగా ఉండొచ్చు.” అన్నాను మా అన్నయ్యతో. ఆరోజు సాయంత్రమే కిరణ్ ని పిల్చి విషయాలన్నీ వివరంగా చెప్పి నా ప్రతిపాదన కూడా చెప్పాడు మా అన్నయ్య ప్రమోద్. కిరణ్ కూడా త్వరగానే రెస్పాండ్ అయ్యాడు సరే అన్నాడు. అన్నయ్య నాతో నీ ఇష్టప్రకారమే జరిగాయి … ఇప్పటివరకూ ఇక మిగిలిన విషయాలన్నీ నువ్వే చూసుకోవాలి అన్నాడు.

2 Comments

  1. Waiting for aunty and girls

  2. Miru aunty ite naku reply ivvandi

Comments are closed.