అన్నయ్య 1742

నేనూ తనతో ఆఫీసు కి వెళ్ళేదాన్ని. తన ఛాంబర్ లో ఒక వైపు నాకోసం కూడా టేబుల్ అరేంజ్ చేసాడు నా భర్త. ఆఫీసు కి వెళ్ళడం మొదలుపెట్టి 3 నెలలు అవుతోంది. నేను డిగ్రీ లో అకౌంట్స్ చెయ్యడంతో చాలా త్వరగానే ఆఫీసు విషయాలలో పట్టు సాధించాను. కృష్ణ ఒక సారి ఆఫీసు పనిమీద పూణే వెళ్ళాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆఫీసు మొత్తం నేను చూడసాగాను. తన పర్సనల్ కంప్యూటర్ బయోమెట్రిక్ ప్లాట్ఫార్మ్ మీద పనిచేయ్యడంతో తన నాకు ఆ సిస్టం ఆక్సెస్ పర్మిషన్ ఇచ్చి వెళ్ళాడు. ఒక సాయంత్రం ఇంటికి వెళ్ళాక ఏదో పని ఉంది ఒక ఫైల్ కోసం చూస్తూ ఉంటే ఒక ఫోల్డర్ “పర్సనల్” అని ఉంది .. అది హిడెన్ ప్రాపర్టీ పెట్టి ఉంది. నా పని అయిపోయాక ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి చూస్తే కొన్ని ఫోటోలు ఉన్నాయి. వాటిని పరీక్షగా చూసి నేను షాక్ అయిపోయాను. అవన్నీ నా భర్త కృష్ణ ఆడవేషంలో ఉన్నప్పటి ఫోటోలు. కొన్నింటిలో కృష్ణ చీరలో ఉన్నాడు … కొన్నింటిలో సల్వార్, పంజాబీ డ్రెస్సెస్ లో ఉన్నాడు. పూర్తి మేకప్ లో ఉన్నాడేమో అచ్చు ఆడదానిలా ఉన్నాడు. ఆడదాన్నైన నాకే అసూయ పుట్టేలా ఉన్నాడు. అయితే ఈ విషయాన్ని తను వచ్చాక తనతోనే చెప్పించాలని మనసులో ఉంచుకున్నాను.

కృష్ణ పూణే లో తన పని ముగించుకు వచ్చేసరికి ఒక వారం పట్టింది. ఈ మధ్యలో ఆఫీసు పని అయిపోయిన తరువాత ఇంటికి వచ్చిన వెంటనే కృష్ణ కంప్యూటర్ లో దాచుకున్న తన ఆడతనాన్ని చూసేదాన్ని. కృష్ణ వచ్చాక ఏమీ తెలియనట్లు తనతో మామూలుగానే ప్రవర్తించసాగాను.

2 Comments

  1. Waiting for aunty and girls

  2. Miru aunty ite naku reply ivvandi

Comments are closed.