అన్నయ్య 1742

భర్త చెప్పిన కథ:

సులోచన నన్ను అర్ధం చేసుకుని నాకు సహకరించి నేను చీర కట్టుకున్నా, నైటీ వేసుకున్నా అభ్యంతర పెట్టకపోవడంతో నాలో ఉన్న ఊహలు, కోరికలూ రెక్కలు విప్పుకోవడం మొదలుపెట్టాయి. ఒకసారి ఆఫీసు పని మీద ముంబై వెళ్ళినప్పుడు తనకు తెలీకుండా బాడీ మీద హెయిర్ పెరగకుండా థెరపీ చేయించుకున్నాను …. అట్లానే తను నాకోసం ఎన్నో బంగారు నగలు కూడా కొనిపెట్టింది. క్రమేపీ ఈ క్రాస్ డ్రెస్సింగ్ మీదనే దృష్టి పెట్టడం తో సెక్స్ టైములో నాకు ఉద్రేకం తగ్గటం మొదలైంది. తను నన్ను అర్ధం చేసుకునేది … కానీ నాకే ఏదో గిల్టీ గా ఉండేది. ఒక రోజైతే నేను చీర కట్టుకుని ఉన్న సమయంలో ప్రక్కింటి ఆవిడ ఏదో పని ఉండి ఇంటికి వచ్చింది … తను బాత్రూంలో ఉంది … చేసేదిలేక నేనే వెళ్లి తలుపు తీసాను …. కానీ ఆమె నన్ను గుర్తు పట్టలేదు. దానితో తను నన్ను బలవంతం చేసి ఒక్కోసారి ఈవెనింగ్ టైమ్స్ లో గుడికీ, పార్క్ కీ తీసుకెళ్ళేది. అట్లాంటి సమయంలో టీవీలో అమెరికాలో సెక్స్ చేంజ్ చేయించుకున్న ఒక భర్త గురించి ఒక ప్రోగ్రాం వచ్చింది. మేమిద్దరమూ చూసాము. అప్పుడు మొదలయ్యింది సగం మగా, సగం ఆడా జీవితం ఏమిటి పూర్తిగా స్త్రీ రూపం సంతరించుకుంటే యెట్లా ఉంటుంది అని. కానీ పైకి చెప్పే ధైర్యం లేక అట్లానే మిన్నకుండి పోయాను. అప్పుడు జరిగింది మా జీవితంలో ఒక ఊహించని సంఘటన!

భార్య చెప్పిన కథ:

తను నా సమక్షంలో క్రాస్ డ్రెస్సింగ్ మొదలుపెట్టిన తరువాత నేను తనకు సహకరిస్తున్నానన్న ధీమా ఏమో లేక ఏదైనా కారణం కావచ్చు తను ఇంటిలో ధైర్యంగా నాముందే చీరలోకి మారిపోయి నేను చెయ్యాల్సిన పనులు కూడా తనే చేయడం లాంటివి చేస్తూ నాకు భర్తగా కాక ఒక స్నేహితురాలిలా మొదలుపెట్టాడు. ఒక రోజు తన డైరీ నాకు దొరికింది. అందులో నేను తనకు ఇస్తున్న సహకారం మరువలేనిదనీ, నాకు ఒక భర్తగా కంటే ఒక స్నేహితురాలిలా ఉండటమే బాగుందనీ, నాకు తెలీకుండా హెయిర్ పెరగకుండా థెరపీ చేయించుకున్నట్లు, సెక్స్ లో ఇదివరకటిలా పెర్ఫార్మ్ చెయ్యలేకపోతున్నాననీ, అంతకంటే తనకు ఒక స్త్రీగా మారిపోవాలని ఉందనీ కానీ ఈ జన్మకు ఇంతకంటే ముందుకు పోలేననీ, బయట మగాడిలా ఇంటిలో ఆడదానిలా ఉండటం వరకే చేస్తూ ఈ జీవితాన్ని అసంపూర్తిగా ముగించడమే అంటూ తన అసంపూర్ణ జీవితం గురించీ వివరంగా రాసుకున్నాడు.

ఇది చదివిన నాకు తనలో ఉన్న బలీయమైన కోరికలన్నీ తెలిశాయి. ఇది చదివినా నాకు ఏమీ తెలీనట్లే తనతో ప్రవర్తించాను. తనను ఇంకా నిశితంగా పరిశీలించడం మొదలుపెట్టాను. తన కంప్యూటర్ లో ఇంటర్నెట్ హిస్టరీ లో “సెక్స్ చేంజ్ చేయించుకున్న మగాళ్ళ గురించి పేర్కొన్న ఆర్టికల్స్ ” ఎక్కువగా కనిపించాయి. అటువంటి సమయంలో అనుకోని ఒక సంఘటన నా ఆలోచనా ధోరణిని మార్చింది.

తీర్ధ యాత్రలకు అంటూ ఉత్తరాఖండ్ వెళ్ళిన మా అమ్మ నాన్నలు, మా మేనత్త అక్కడ సంభవించిన భారీ వరదల్లో గల్లంతయిపోయారు. కనీసం డెడ్ బాడీస్ కూడా దొరకలేదు. మా ఇంటిలో మా అన్నయ్య, మా మేనత్త ఇంటిలో తన ఏకైక కుమారుడూ, మా బావ ఒంటరిగా మిగిలిపోయారు. ఒక వేళ మా ప్రేమ ఫలించి ఉంటె నేను ఎంతగానో ఇష్టపడ్డ మా బావ ఒంటరి కాకపోవునేమో అనే ఆలోచన మొదలయ్యింది. ఇటు అన్నయ్య తన మూడేళ్ళ కొడుకుతో ఏకాకి అయిపోయాడు. వాళ్ళిద్దరినీ సాకాల్సిన పరిస్థితి నాది. ఈ సమస్యకు పరిష్కారం కూడా నేనే చూపించాల్సిన పరిస్థితి.

2 Comments

  1. Waiting for aunty and girls

  2. Miru aunty ite naku reply ivvandi

Comments are closed.