ఏంటీ, ఇదంతా కలా? 115

“ఇంతకీ సర్ప్రైస్ అన్నావ్, ఏంటే అది?” అని అడిగింది ఆశ.
“ఒక్క నిమిషం ఆగవే, చెప్తా” అంటూ బెడ్ రూమ్ లోకి వెళ్ళి ఒక డైరీ తీసుకొచ్చింది సరిత.
ఆశాకు దాన్ని చూడగానే తెలిసిపోయింది అది ఏంటో కాదు, వారిద్దరి విష్ లిస్ట్ డైరీ / ఆశల చిట్టా అని. వారిద్దరూ స్కూల్ లో ఉన్నప్పటి నుండీ ఈ డైరీలో వారు ఎప్పటికైనా తీర్చుకోవాలనుకుంటున్న ఆశలు లేదా కోరికలు నోట్ చేసి, వాటిలో నెరవేరిన కోరికలను రెడ్ పెన్ తో టిక్ చేస్తారు. చిన్నప్పుడైతే కాస్త చిన్న చిన్న ఆశలుండేవి, వయసు పెరుగుతున్నాకొద్దీ వారి ఆశలు కూడా పెద్దవయ్యాయి.
“ఓహో విష్ లిస్ట్ డైరీ తీసుకోస్తున్నావంటే ఈ రోజు మన అన్ ఫుల్ఫిల్డ్ విష్ ఏదో నెరవేరబోతోంది. ఏంటే అది?” అని అడిగింది ఆశ.
“విష్ నెంబర్ 99, మనం ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు నోట్ చేసాం” అని చెప్పింది సరిత.
“వావ్, విష్ నెంబర్ 99..! అది ఎలా మరిచిపోతాను, ఎలా సంపాదించావే, ఎక్కడ దొరికింది?” అంటూ చాలా ఆత్రుతగా అడిగింది ఆశ.
“లాస్ట్ వీక్ డాడీ వాళ్ళు పార్టీ చేసుకున్నారు. అప్పుడు హాఫ్ మిగిలిన ఒక బాటిల్ దాచిపెట్టా” అంటూ కప్ బోర్డ్ నుండి ఒక జానీ వాకర్ స్కాచ్ విస్కీ బాటిల్ బయటికి తీసింది సరిత.
రెండు గ్లాసులలో విస్కీ మిక్స్ చేసి టీపాయ్ పైన ఉంచి “కమాన్ ఆశ, స్టార్ట్ చెయ్” అని చెప్పింది.
ఇద్దరూ చెరో గ్లాసు తీసుకొని, చాలా సినిమాల్లో చూసిన అనుభవంతో గ్లాసుకు గ్లాసు తగిలించి ఛీర్స్ చెప్పుకొని విస్కీ టేస్ట్ చేసారు.
“ఇంత చేదుగా ఉంది, ఎలా తాగుతారే దీన్ని?” అంటూ సందేహంగా అడిగింది ఆశ.
“అలా చేదుగా ఉంటుందనే నంచుకోదడానికీ రెస్టారెంట్ నుండి చికెన్ రోస్ట్ తెప్పించా” అంటూ సమాదానం చెప్పింది సరిత.
చికెన్ రోస్ట్ తింటూ చాలా కష్టంగానే అరగంటలో ఇద్దరూ మెదటి పెగ్గు పూర్తిచేసారు. ఒక్క పెగ్గే అయినా మెదటిసారి కాబట్టి ఇద్దరికీ బాగానే కిక్కు ఎక్కేసింది. మందు తాగితే నిజాలు బయటికొస్తాయి అనే మాటను నిజం చేస్తూ, ఆశ ఇందాక సాయంత్రం నిద్రలో జరిగిన తన స్వప్న శ్రుంగారం గురించి సరితకు చెప్పడం ప్రారంభించింది. మామూలుగానైతే వారి మధ్య పెద్దగా రహస్యాలు ఏమీ ఉండవు కానీ వాళ్ళిద్దరూ ఇటువంటి హాట్ హాట్ విషయాలు ఇంత డీటేల్డ్ గా ఎపుడూ మాట్లాడుకోలేదు.

1 Comment

Comments are closed.