గగన్:- ఏం . . ఈ రెండు రోజుల్లో నాకోసం నీవు ఎంత ఎదురు చూసావో . . .నాకు తెలియదనుకొన్నావా . . .ఉదయం నన్ను చూడగానే ఎగిరి గంతేసినట్టు నా వెంట రాలా . . .నా గుండెల మీద ఏడ్వలేదూ. . . అంతెందుకు కట్టుబట్టలతో . .. నేను ఎందుకు రమ్మన్నానో ఎక్కడి రమ్మన్నానో ఒక్క మాట కూడా అడగకుండా రాలా? అవన్నీ ఎలా తెలిసాయంటావు?
అతడి చేతిని మరింత దగ్గరికి లాక్కొంటూ మురిపెంగా అతడి చెక్కిళ్ళను ముద్దాడి. . బావా ఈ మానసికం నాకు మాత్రమే అనుకొన్నా. . .నీవు కూడా ఇదే స్థితిలో ఉన్నావని నేను ఊహించలేదు. . . ఐనా నేను వెలయాలిని బావా. . .ఎవరు కూడు పెడతారో వారి పంచన బ్రతకవలసిన దానిని . . నీవు ధైర్యం చెసి నన్ను మనువాడినా ఈ లోకం మన బంధాన్ని అర్థం చేసుకోదు బావా
ఆమె పెదాల మీద వేలునుంచుతూ . . .మోహనా నా మనసూ నీ మనసూ ఒకే రకంగ ఆలోచిస్తునప్పుడు ఈ లోకంతో మనకు నిమిత్తం లేదు.. . అదే విధంగా నీ గతం తో నాకు పని లేదు.
అది కాదు బావా అంటూ ఏదో చెప్పబోతున్న మోహన పెదాలను తన పెదాలతో మూసేసాడు.
మోహన ఆ ముద్దును చాలా సేపు ఆస్వాదించింది. గగన్ తలపైకెత్తబోతూ ఉంటే మళ్ళీ తనే లాక్కొని పెదాలను అందించింది. నిండుగ ఉన్న పెదాలను ముద్దాడుతూ ఆమె బుగ్గలను నుదుటిని ముద్దులతో నింపేసాడు.
కళ్ళలో నీళ్ళు చిప్పిల్లుతుంటే అతడి మెడ మీద చేతులేసి . . .మరి మధ్యలో నన్ను వదిలేసి వెళ్లవుగా బావా అంది.
గగన్:- నీవు వదులుకోగలవా
అమ్మో నిన్ను వదులుకోవడం అంటే నా ప్రాణాన్ని వదులుకోవడమే . .
గగన్:- నేనూ అంతేగా . . .
మరి మీ అమ్మా నాన్నల మాటేంటి. . .నీ మీద ఎన్నో ఆశలుపెట్టుకొనుంటారుగా. .
అమ్మతో ఇబ్బందేం లేదు. . .నాన్నతోనే కొంత ఇబ్బంది. . .అ ఇబ్బందులేవో పడతాను గాని. . .నాకు ఓ మాట చెబుతా మోహనా
అడుగు బావా
గగన్:- మనల్ని ఇలా ఏ బందం కలిపి ఉంటుందంటావ్?
ఇలా రా అని అతడి తలను దగ్గరికి తీసుకొని మీ భాషలో ప్రేమ అంటారు అని అతడి రెండు చెక్కిళ్ళను పట్టుకొని పిండింది.
గగన్:- మరి మీ భాషలో . . . అని మోహన ముక్కు పిండాడు.
పిచ్చి అంటారు అని లేచి అతడి గడ్డం కొరికింది.
అలా ఇద్దరూ తుళ్ళుతూ నవ్వుకొంటూ చాలా సేపు గడిపేసారు.మధ్యాహ్న సమయానికి మోహనకు ఆకలి గుర్తుకొచ్చింది.
ఒళ్ళంతా తడిపేసుకొంటూ నీళ్ళలో గగన్ తో పాటు ఆడుతూ పాడుతూ ఉన్న మోహన చటుక్కున నిలబడిపోతూ ఆకలేస్తోంది బావా అంది.
గగన్ కూడా అప్పటికే బాగా అలసిపోయాడు.సరే పదా అని ఉదయం వెళ్ళిన రిసార్ట్ కే బండిని తిప్పాడు.
ఆమెకు ఫుడ్ ఆర్డర్ చేసి క్యాష్ కౌంటరులోని అమ్మాయి దగ్గరికెళ్ళి చాలా సేపు ఏదో మాట్లాడి వచ్చాడు.
గగన్ టేబల్ దగ్గరికొచ్చేసరికి టేబల్ మొత్తం రకరకాల ఫుడ్ ఐటం లతో నింపేసుంది. వాటన్నిటినీ శుభ్రంగా లాగించేస్తూ తిను బావా అంది.
గగన్ కూడా ఏమాత్రం మొహమాటపడకుండా మోహనతో పాటుగా తనూ వాటి మీద దాడి చేసి ఇద్దరూ ఓ పట్టు పట్టారు.
కడుపారా ఫుడ్ లాగించేసి తనకు అలాట్ చేసిన సూట్లోనికి మోహనను తీసుకెళ్ళాడు.
అప్పటికే క్యాష్ కౌంటరులోని అమ్మాయి మోహన కోసం ఓ నాలుగు జతల బట్తలు లోదుస్తులు రూములోనికి చేర్పించింది. . . .
