చాలా లక్కీ 1 475

ఇంత జరుగుతున్నా గగన్ ఒక్క మాట మాటాడలేదు.మోహన మాత్రం ఇంకేం జరుగుతుందో అన్నట్టుగా కంగారుపడిపోతోంది.
చారిలో ఆవేశం చల్లబడ్డాక గభాలున లోపలకెళ్ళి రెండు మూడు సూట్ కేసులలో గగన్ బట్టలు డబ్బూ దస్కం పెట్టుకొని వచ్చి హాల్లో గిరాటేస్తూ. . .ఒరేయ్ తల్లిదండ్రులం మేమున్నామని మరచి పోయి పెళ్ళి చేసుకొని వచ్చిన నీకు నా ఇంట్లో స్థానం లేదు.కొడుకనే వాడు తల్లి దండ్రుల గౌరవాన్ని నిలబెట్టేవాడిగా ఉండాలి . . .వారి ఆశలను ఆశయాలను అర్థం చేసుకొని ఉండాలి . నీలా నీ స్వార్థాన్ని ఆలోచించుకొనే వాడు బ్రతికినా చచ్చినట్టే లెక్క. అలాంటి వాడికి నా ఇంట్లో స్థానం లేదు.

గగన్ స్నేహితులు కలగజేసుకోవాడానికి ప్రయత్నిస్తే అందరి మీదా పులిలా గర్జించి చెదరగొట్టేసాడు.

గగన్ అక్కడున్న సూట్ కేసులను తీసుకొమ్మని తన స్నేహితులతో చెప్పి కన్నీళ్ళతో అమ్మ వంక జూస్తూ వెనుతిరిగాడు.
అహన దీనంగా చూసిందే కాని ఆపడానికి ప్రయత్నించలేదు..
గగన్ స్నేహితులు కలగజేసుకోవాడానికి ప్రయత్నిస్తే అందరి మీదా పులిలా గర్జించి చెదరగొట్టేసాడు.
గగన్ అక్కడున్న సూట్ కేసులను తీసుకొమ్మని తన స్నేహితులతో చెప్పి కన్నీళ్ళతో అమ్మ వంక జూస్తూ వెనుతిరిగాడు.
అహన దీనంగా చూసిందే కాని ఆపడానికి ప్రయత్నించలేదు.

అట్నుండి నేరుగా మళ్ళీ ఫాం హౌస్ లోనికే వచ్చారు. అయోమయంగా చూస్తున్న సెక్యూరిటీని దగ్గరకు పిలిచి చూడు బాబాయ్ నన్ను చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నావు. నేనెలాంటి వాడినో నీకు తెలీదా. .
అయ్యో అదేం మాట బాబూ అలా అంటావు. ఈ చేతుల్తో నిన్ను పెంచాను. . ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఇలా చెప్పాపెట్టకుండా పెళ్ళి చేసుకోవడం పెద్దయ్య గారికి కోపం తెప్పించి ఉండవచ్చు అంతే . .అన్నీ సర్దుకొంటాయి మీరేం కంగారు పడవలసిన అవసరం లేదు. అమ్మాయి ఎంత బెదిరిపోతోందో చూడు. . . మీరెళ్ళి మీ పనులు చూసుకోండి. మిగతావి నేను చూసుకొంటాను అని గేట్లు బార్లా తెరచి పెట్టి కార్లను లోపలకు పంపాడు.
వాళ్ళ శోభనానికి స్నేహితులు ఏర్పాట్లు చేస్తుంటే అదురు తున్న గుండెలతో ఒకరిప్రక్కన ఒకరు కూచొని బిక్క చూపులు చూస్తున్నారు.
ఈలోగా సెక్యూరిటీ అహనకు ఫోన్ చేసి ఉప్పందించాడు.
ఆ రోజు రాత్రే శోభనం అని తెలిసి కుత కుతా ఉడికిపోయింది అహన . . .అలా అని తను ఇప్పుడు ఏం చేసినా అసలుకే మోసం వస్తుందని తెలిసి గమ్మున ఉండిపోయింది. గరుడాచారి గంభీరంగా మారిపోయాడు. ఆఫీసుకెళ్ళకుండా తాగుతూ కూచొన్నాడు.