చాలా లక్కీ 1 475

మోహనను అలా చేయి పట్టుకొని వెళ్ళడం దూరం నుండి ఒకరిద్దరు చూసారు గాని పెద్దగా పట్టించుకోలేదు.
కారులో బయలు దేరిన రెండు మూడు గంటల వరకూ ఎక్కడా కారు నాపలేదు. ఒక్క మాట మాటాడుకోలేదు ఇద్దరూ. ఎదురుగా కనిపిస్తున్న పెద్ద రిసార్ట్ హోటెల్ లోనికి తీసుకెళ్ళి కారునాపాడు.
మోహన ప్రశ్నార్థకంగా చూస్తుంటే .. .దా. . . అని ఆమె చేతిని పట్టుకొని హోటెల్ లోనికి తీసుకెళ్ళి ఏం కావాలి అన్నట్టుగా కళ్ళెగరేసాడు.
ఏం చెప్పను అన్నట్టుగా బేలగా చూసింది.
గగన్ చిన్నగా నవ్వి రెండు ప్లేట్లు పొంగల్ రెండు ప్లేట్ల ఉద్దిపప్పు వడ, ఉప్మా పెసరట్లు ఆర్డరిచ్చాడు.
అంత పెద్ద రిసార్ట్ ఎప్పుడూ చూడని మోహన తన పెద్ద పెద్ద కళ్ళతో చుట్టూ ఆసక్తిగా చూస్తూ ఉంటే ప్రక్కనే జంటగా వచ్చిన అబ్బాయిలు దొంగ చూపులు చూస్తుంటే ఫ్యాషన్ అమ్మాయిలు ఈర్ష్యగా చూసారు.
టిఫిన్ రాగానే పెసరట్ ప్లేట్లోనికి రెండు ప్లేట్ల్ వడలు పొంగల్ మొత్తం అన్నీ వేసేసుకొని ఒక దానితో ఒకటి నంజుకొని తిన సాగింది.
వెయిటర్ వింతగా చూస్తుంటే గగన్ ఇంకో రవుండ్ వాటినే ఆర్డర్ చేసాడు.
కడుపరా టిఫిన్ లాగించేసి తనే ఒక కాఫీ ఆర్డర్ చేసి తాగుతూ కూచొంది.
గగన్ ఆమె తిండి చూసి ముచ్చటపడ్డాడు.
మళ్ళీ ప్రయాణం మొదలు కాంగానె చిన్నగా కూనిరాగాలు తీస్తూ తండ్రి దగ్గర చనువున్న చంటి దానిలా అతడి భుజం పై తల వాల్చింది..
సిటీ ఇంకా వంద కిలో మీటర్లు ఉందనగానే ఫారెస్ట్ రోడ్ మొదలయ్యింది.మెయిన్ రోడ్డులో కాకుండా తనకు తెలిసిన డొంక దార్ల గుండా కారును తిప్పాడు గగన్.
వంక దార్ల గుండా ఓ ఇరువై మైళ్ళు పోంగానే జల జలా దుముకుతున జలపాతం ఒకటి కనిపించింది.దానిని దాటుకొని రెండు మూడు మైళ్ళు పోంగానే జలపాతం లోని నీళ్ళు మోకాలెత్తులో వంకలాగా ప్రవహించే చోట కారునాపాడు.

ఇద్దరూ చేయి చేయి పట్టుకొని మౌనంగా ఆ వాగులో అటూ ఇటూ తిరిగి వాగుకు పక్కనే వంగి వున్న చెట్టు నీడలో కూచొన్నారు.

ఇద్దరి మధ్యా మాటలే లేవు కాని ఒకరి మనసు ఒకరికి తెలిసిపోతోంది.
స్థిరంగా పట్టుకొన్న గగన్ చేయిని మరింత గట్టిగా పట్టుకొని కూచొని అతడి తొడల మీద తలపెట్టి పడుకొంది.గగన్ తన్ చేతిని ఆమె తల మీద వేస్తూ మోహనా మనం పెళ్ళి చేసుకొందాం అన్నాడు.
పక్కున నవ్వేసింది అతడి మాటలకు. . .ఎవరైనా వింటే నవ్వి పోతారు బావా
గగన్:- ఏం
నేనెక్కడ నీవెక్కడ. . .నేను భోగం సానిని. . .తల్లెవరో ,తండ్రేవరో తెలియని అనామకురాలిని . . .ఎక్కడ పుట్టానో. . . ఎవ్వరికి పుట్టానో . . .అసలెందుకు పుట్టానో . . .ఏవీ తెలియనిదాన్ని.. . .అంటూ అతడి తొడమీద నుంచి కాస్త ఒత్తిగిల్లి సర్దుకొంది.
గగన్:- ఐతే ఏం మనసు నీకు తెలిసిపోయిందిగా
అది వేరు బావా. . . నన్ను నీదానిగ జీవితాంతం ఉంచేసుకో . . .కంటికి రెప్పలా ఉంటాను.. . .అంతే కాని నాతో పెళ్ళి అనే ఆలోచన మాత్రం వద్దు.
గగన్ ప్రశాంతంగా చూస్తూ. . . నీవు ఎవ్వరివో ఎక్కడ ఎవ్వరికి పుట్టావో నాకు అనవసరం . . నా కోసమే పుట్టావు. అది చాలదూ. . .ఎవరి మనసు ఎవరి కోసం ఎదురు చూస్తుందో కాని మనం మాత్రం ఒకరి కోసం ఒకరు పుట్టాం. . కాదంటావా. . .
బావా మన పరిచయం ఎంతనీ మనం ఒకరి కోసం ఒకరు తహ తహ లాడడానికి . . .రెండు రోజుల క్రిందటే గా. . అంతలోనే. . .ఆపై మాటలు రాలేక గమ్మున ఉండి పోయింది.
వారి సంభాషణ నామ మాత్రమేనని ఇద్దరికీ తెలిసిపోతూనే ఉంది.