బిందు మాట్లాడుతూ అవునా అంటూ ఉండగా ఫోన్లో అవతల వైపు నుండి ఎవరో మాట్లాడుతూ ఆ చెత్త వెధవ ఇలా చేస్తాడు అనుకోలేదు ఆంటీ అని అనగానే ఇక్కడ బిందు మాట్లాడుతూ అలా కాదు హారిక కొంచెం ఏం అయ్యిందో మొదటి నుండి చెప్పు అని అంది. దాంతో అవతల నుండి హారిక…
హారిక : నాకూ ముందు నుండి తెలీదు ఆంటీ, సిద్దు గాడు చెప్పాడు ఇదంతా.. మీరు మేడం ఎదో నిన్న ఫోన్ లో మాట్లాడుకున్నారు అంట కదా..
బిందు : అవును
హారిక : అప్పుడు మీరు మాట్లాడుకునేది వీడు విన్నాడంట,
బిందు : హా
హారిక : విని ఏదేదో ఊహించుకుని మేడంతో గొడవ పడ్డాడంట..
మేడం ఎంత చెప్తున్నా వినకుండా తనది దొంగ ప్రేమ అని మోసం చేస్తున్నావ్ అని ఏదేదో అంటూ మేడం ను ఏడిపించాడు అంట..
బిందు : హా
హారిక : కానీ వీడంత ఏడిపించినా కూడా మేడమే మళ్ళీ వాడి దగ్గరకు నచ్చజెప్పడానికి వెళ్ళింది అంట..
కానీ వీడేమో అప్పుడే సిద్దు గాడితో కలిసి మందు తాగుతూ కనిపింఛాడంటా..
బిందు : ఓహ్
హారిక : మీకు తెలుసుగా మేడం కు మందు అంటే అస్సలు పడదు అని..
బిందు : అవును
హారిక : ఇక సిద్దు గాడు వీడు ఇద్దరూ తాగుతూ కనిపించేసరికి సిద్దు గాడి మీద అరుస్తూ వాణ్ణి బయటకు పంపించి డోర్ వేసేసింది అంట ఆ తరువాత లోపల ఎం జరిగిందో వాడికి కూడా సరిగ్గా తెలీదు అని చెప్పాడు కానీ బయట నుండి వాళ్ళ మాటలు విన్న దాని ప్రకారం అయితే ఈ భరత్ గాడు మేడం ఇద్దరూ ఎదో విషయం లో పొట్లాడుకున్నారంట.
మేడం ఎంత చెప్తున్నా వినకుండా తనని దొంగ ప్రేమ అని ఇంతవరకు తనతో తిరిగింది అంతా వాడి మీద మోజు తో అని ఇంకా నువ్వు మోసం చేశావ్ అని ఇలా ఏవేవో కూతలు కూసి మేడం ను ఇంకా ఎక్కువ ఏడిపించాడంట..
బిందు : హా
హారిక : చివరికి మేడం ఎంత చెప్తున్నా అర్దం చేసుకోకుండా నీది దొంగ ప్రేమ కాకపోతే ఇప్పుడే నా తొలి అనుభవం తీర్చు అని అన్నాడంట. పాపం మేడం తనది నిజమైన ప్రేమ అని నిరూపించుకోవడానికి వాడు తాగి ఉన్నా కూడా వాడితో పడుకుంది అంట…
Super ,daily update cheyandi
Bro the story is so emotional.good
Excellent story , please tondaraga update ivvandi , next part
Bro stroy lo em undi bore koduthundi anta kala ఈ ga
West స్టోరీ
Eppudu kalala gurunchena meeru rasedi boring undi
Suspense lekunda thondarga rayochu kada ra
Anna super gaa vundhi meeru continue cheyyandi…anna
Chetta story ilantivi petti time waste cheyavaddu