కొద్దిసేపటికి బిందు క్లినిక్ దగ్గరకు వెళ్ళామ్. బైక్ పార్క్ చేసి, లోపలికి వెళ్ళా. అప్పటికే సాయంత్రం ఐదు నర అవుతుంది, నేను సిద్దు గాడు లోపలికి వెళ్ళి చూసామ్, రిసెప్షన్ లో ఎవ్వరూ లేరు, అప్పుడే లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తూ ఉన్నాడు అక్కడ ఉన్న ఒక అతను. అంతలో బిందు బాగ్ భుజాన వేసుకుని బయటకు వస్తుంది, మే బి క్లినిక్ క్లోస్ చేస్తున్నారేమో. అంతలో బిందు మమ్మల్ని చూసి, హే భరత్ ఏంటి ఇలా వచ్చావ్ అని అంది. నేను తన వంక చూసి నువ్వు గుర్తువస్తుంటే చూడడానికి వచ్చా అని చెప్పా. బిందు నవ్వుతూ అబ్బా ఛా, మేము ఎక్కడ గుర్తు వస్తాం మీకు, మీ లవర్ సంధ్యా అని అంటూ నా పక్కన ఉన్న సిద్దు గాడిని చూసి టక్కున ఆగిపోయింది. నేను చిన్నగా నవ్వుకుని, ఆంటీ వీడు ఇప్పుడే బైక్ మీద నుండి పడ్డాడు, మోచేయ్యి నొప్పిగా ఉంది అంట, చూడు అని వాడిని ముందుకు తోసి బిందు కు కనపడకుండా కన్ను కొట్టా. వాడు తప్పదు అన్నట్లుగా అవును ఆంటీ అని అన్నాడు. బిందు అయ్యో ఎలా పడ్డావ్ ముందు కూర్చుందురా అని సిద్దు గాడిని లోపలకు తీసుకు వెళ్ళింది. నేను రిసెప్షన్ దగ్గరకు వెళ్లి చూసా రిజిస్టర్ ఎం కనిపించలేదు. అక్కడ ఒక కంప్యూటర్ ఉంది, వెంటనే దాన్ని ఓపెన్ చేశా పాస్వర్డ్ అడిగింది. బిందు అని కొట్టి చూసా ఓపెన్ కాలేదు, ఏమై ఉంటుంది అని ఆలోచించి, ఒకసారి సంధ్య అని కొట్టి చూసా వెంటనే వెల్కమ్ అని వచ్చింది మనసులో నవ్వుకుని ఓపెన్ చేసి ఈరోజు కస్టమర్స్ లిస్ట్ ఓపెన్ చేస. అందులో నాకు ఎం అర్థం కాలేదు. కొద్దిసేపు బాగా చూస్తే అర్థం అయ్యింది, కొత్త కస్టమర్స్ లిస్ట్ వేరేగా ఉంది. నేను వెంటనే దాన్ని ఫోటో తీసుకున్నా. అందులో ఎవరు ఎప్పుడు వచ్చారు ఏ రోజు ఏ టైం అని అన్నీ వివరాలు ఉన్నాయ్. నేను దాని పిక్ తీసి జోబులో పెట్టుకుని కంప్యూటర్ ఆఫ్ చేసి బిందు రూమ్ లోకి వెళ్ళా. సిద్దు గాడు నా వంక చూసాడు, నేను ఒకే అని కళ్ళతో చెప్పా. తరువాత కొద్దిసేపు అక్కడే ఉండి బిందు ఎం కాలేదు రేపటి లోపల తగ్గిపోయింది అని చెప్తే అక్కడ నుండి బయలుదేరాం. దారిలో బైక్ ఆపి, సెల్ ఓపెన్ చేసి వాడికి చూపించా. వాడు ఆతృతగా చూస్తున్నాడు. ఆ పిక్ లో ఇవ్వాళ జాయిన్ అయిన వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయ్. ఇవ్వాళ కొత్తగా అడ్మిట్ అయ్యింది ఒక్కరే అది కూడా మధ్యాహ్నం అయ్యాడు. అది చూసిన మాకు ఆటో మాటిక్ గా మొహం లో వెలుగు ప్రకాశించింది. వెంటనే అందులో ఉన్న అడ్రస్ వైపు బండి పోనించా. కొద్దిసేపు కష్టపడ్డాక ఆ ఇల్లు వచ్చింది, బండి ఆపి ఆ ఇంటి వైపు ఆశ్చర్యంగా చూసా. సిద్దు గాడు ఏంట్రా ఇక్కడకు తీసుకువచ్చావ్ అని అన్నాడు. నేను ముందు ఉన్న ఇల్లు చూసి ఆశ్చర్యంగా ఏమొర ఇందులో ఇదే అడ్రస్ ఉంది అని అన్నా. మేము ఇంకా ఆశ్చర్యం లో ఉండగా ఆ ఇంటి పై అంతస్తు నుండి, ఎవరో సిద్దు అని పిలిస్తే పైకి చూసాం, హారిక అక్కడ నిలబడి స్మైల్ ఇస్తూ ఏంటి ఇలా అని అంది. మేము ఇద్దరం అలాగే ఆలోచిస్తూ ఉండగా తను పరిగెత్తుకుంటు కిందికి వచ్చేసింది. కిందకు దిగి మా దగ్గరకు వచ్చి ఏంటి సిద్దు సడెన్ గా ఇలా అని అంది. అంతలో డోర్ తెరుచుకుని ఒకామె ఎవరు హారిక అని బయటకు వచ్చింది. చూస్తే తను బస్ లో ఉన్న ఆంటీ, సేమ్ మా అమ్మ లాగే ఉంది, కవల పిల్లల్లా ఉన్నారు సేమ్ బాడీ స్ట్రక్చర్ సేమ్ కలర్, సేమ్ సారీ నేను నోరు తెరిచి అలాగే చూస్తూ ఉండిపోయా. అంతలో హారిక ఆ ఆంటీ తో నా ఫ్రెండ్స్ అమ్మ, అని అంది. నేను ఇంకా ఆశ్చర్యంగా చూస్తున్నా. హారిక నన్ను సిద్దు గాడిని లోపలకు రమ్మంది. మేము వెళ్లాం. లోపల తన రూం లోకి తీసుకుకెళ్తు ఉండగా హాల్ లో హారిక వాళ్ళ నాన్న కూర్చుని ఉన్నాడు. చేతికి కట్టు కట్టి ఉంది, బట్టతల కూడా ఉంది, బనిగిన్ వేసుకుని ఉన్నడు. మమ్మల్ని హారిక అతనికి పరిచయం చేసింది. అతను నవ్వుతూ మమ్మల్ని పలకరించి, హారిక తో కాసేపు పడుకుకుంట అని చెప్పి తన రూం లోకి వెళ్ళాడు..
Bro at part 6 page 14 story continues missed after వాయిస్ వినిపించింది
Asal chadhavalana interest kuda poyindhi vere serials start cheyandi dhiniki rating 5 ki -10 ivali
ఏంటే వాగుతున్నావ్ బయట వాడు వున్నాడు వినిపిస్తుంది అని అంది. ఇప్పుడు బిందు, వింటే విననీలే ఎంజాయ్ చేస్తాడు అయిన నేనేమైన అబద్ధం చెప్పానా, నిజమే కదా చెప్పా అంటూ వాయిస్ వినిపించింది.Some missing…….????
పదరా ఇప్పుడే వెళ్లి ఆ ఆంటీ కోసం వెతుకుదాం అని అన్నా. వాడు ఎక్కడ వెతుకుదాం రా అని అన్నాడు.
Missing
Avunu akkada story miss aedi bro
Part 14 story track thapidi bro
Nice story
Bossu tharuvatha part apudu
Next part bro
Plz Next part