టీచర్ కోసం 6 195

బిందు మేడం వీపుని నిమురుతూ ఏమైందే చెప్పు అని అంటుంది. కానీ మేడం రెస్పాన్స్ ఇవ్వకుండా అలాగే బిందు ను పట్టుకుని ఏడుస్తుంది. బిందు ఆంటీ, చి చి సిగ్గు లేదు ఏంటి చిన్న పిల్లలా అలా ఏడుస్తున్నావ్ ఏమైందే నీకు అని అంటూ తన బుజాలు పట్టుకుని అడిగింది, మేడం కళ్ళలో నీళ్ళు కారుస్తూ బిందు వంక చూస్తూంది. బిందు మేడం మొహం లోకి చూసి, ఎందుకు ఏడుస్తున్నవే, చూడు నీ మొహం ఏడ్చి ఏడ్చి ఎలా అయ్యిందో, అని మేడం కంట్లో నీటిని తన వేలుతో తుడుస్తూ అంది. అయినా ఇంకా మేడం కంట్లో నీళ్లు రావడం చూసి, షేమ్ షేమ్ చూడు నీ లవర్ నిన్ను ఎలా చూస్తున్నాడో షేమ్ అని అంది, మేడం నా వంక చూసింది, నేను తల కొంచెం పక్కకు తిప్పుకున్నా. ఇక బిందు, మేడం ఏడుస్తూ ఉంటే ముందు పద మనం ఇంటికి వెళదాం అని లేచి మేడం ను పైకి లేపింది. బిందు నా వంక చూసి, నీకు కార్ డ్రైవింగ్ వచ్చా అని అడిగింది, నేను హ వచ్చు అని చెప్పా. బిందు నా వైపు కీస్ విసిరి పోయి కార్ స్టార్ట్ చేయిపో అని అంది. నేను సరే అని అంటూ బయటకు వెళ్ళాను, అక్కడ ఒక కార్ ఉంది, ఫ్రంట్ మిర్రర్ మీద బిందు అని స్టైల్ గా రాసి ఉంది, దీనికి కార్ కూడా ఉందా అని అనుకుంటూ వెళ్లి కార్ స్టార్ట్ చేసి పెట్టా, అంతలో బిందు ఇంకా మేడం ఇద్దరు నడుచుకుంటూ కార్ వైపు వస్తున్నారు, మేడం చేతిని బిందు పట్టుకుని ఉంది, మేడం ఒక చేత్తో నాప్కిన్ తో కళ్ళలో వస్తున్న నీటిని తుడుచుకుంటూ నడుస్తుంది. ఇద్దరు కార్ దగ్గరకు వచ్చి, వెనుక సీట్స్ లో ఎక్కారు. బిందు బుజామ్ మీద మేడం తన తల పెట్టుకుని ఉంది.
బిందు మేడం తలను నిమురుతూ నా వంక చూసి, రేయ్ ఇంటికి పోనివ్వు అని అంది. నేను సరే అని అంటూ కార్ ని మా ఇంటి వైపు పోనించా. వెనుక బిందు మేడం ని నిమురుతూ ఓదారుస్తూ ఉంది. మేడం అలా ఏడుస్తూ ఉంటే, నాకు మనసులో చాలా బాధగా అనిపించింది నాకు మేడం మీద ఉన్న కోపం కొంచెము తగ్గి, పోతే పోనిలేరా తొక్కలోది మేడం ఇంకోరితో తిరుగుతుంది అంతేగా ఇంకేం లేదు, అయినా నా మేడం రా నేను ఓర్చుకోక పోతే ఇంకెవరు ఓర్చుకుంటారు, పోతే పోయింది కానీ మేడం కు సారి చెప్పి మేడం ని నా కౌగిలి లోకి ఒకసారి తీసుకుని మేడం కళ్ళలో నీటిని తుడచాలి అని మనసులో అనిపించింది. కానీ ఎందుకో ఆగిపోతున్నా, ఏదో అడ్డు వస్తుంది, ఇంతలో ఇల్లు వచ్చింది నేను కార్ పార్క్ చేశా బిందు మేడం ని తీసుకుని ఇంటి లోకి వెళ్ళింది, నేను కూడా వాళ్ళతో పాటు ఇంట్లోకి వెళ్ళా. బిందు మేడం ని మేడం బెడ్ రూమ్ లోకి తీసుకుని వెళ్ళింది. నేను నా బెడ్ రూమ్ లోకి వెళ్ళాను. అక్కడ ఆ జూనియర్ గాడు లేడు. ఎక్కడికి వెళ్లాడా అని ఆలోచించుకుంటు మేడం బెడ్ రూమ్ దగ్గరకు వెళ్ళాను. అక్కడ బెడ్ మీద బిందు కూర్చుంది, బిందు ఒడిలో తల పెట్టుకుని బిందు వైపు చూస్తూ ఉంది మేడం. వాడికి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదే, నన్ను అపార్థం చేసుకుంటున్నాడు, నన్ను ఒక సాని మాదిరిగా చూస్తున్నాడే, వాడు అలా చూస్తుంటే చచ్చిపోవాలని ఉందే నాకు అని అంటుంది బిందు వైపు చూస్తూ. బిందు మేడం తల మీద చిన్నగా కొట్టి, ఏంటే ఆ మాటలు అసలు ఏమైంది ఎందుకు వాడలా ఆలోచిస్తున్నాడు అని అంది. మేడం కళ్ళలో నీటిని తుడుచుకుంటూ ఇదంతా కాలేజ్ లో ఒకడి వల్ల స్టార్ట్ అయ్యిందే, నేను వాడిని తమ్ముడిలా ఇంకా ఒక మంచి స్టూడెంట్ లాగా భావించాను అంతే కాని, భరత్ గాడు అనుకున్నట్లుగా నేను వాడితో తప్పుగా ఎప్పుడూ ప్రవర్తించలేదు అంది. బిందు మేడం కంట్లో వస్తున్న నీటిని తుడుస్తూ మరి వాడేందుకు అలా అనుకుంటున్నాడు అంది. మేడం అంతా నా కర్మనే, అయినా ఇందులో భరత్ గాడి తప్పేం లేదు, అంతా నా వల్లనే జరిగింది, భరత్ గాడు ఆరోజు ఎక్కడికో వెళ్ళాడు, వాడు లేకపోవడం చూసి నేను కంగారు పడుతుంటే ఒక తమ్ముడిలా వాడు నన్ను ఓదార్చి నాలో ఉన్న కంగారుని పోగొట్టడానికి ట్ర్య్ చేసాడు, కానీ నాలో కంగారు తగ్గడం లేదు, భరత్ గాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, వాడికి ఏమైందో అని మెల్లిగా కాళ్ళు చేతులు వనకడం స్టార్ట్ అయ్యాయి, అంతలో భరత్ గాడు ఫోన్ లిఫ్ట్ చేసాడు, ఒక్కసారి నాకు ఎంత మనశాంతి గా అనిపించిందో తెలుసా, వాడు క్షేమంగా ఉన్నాడు అని తెలుసుకున్న తరువాత మనసు హాయిగా అనిపించింది, అయినా కూడా ఇంకా కాళ్ళు చేతులు ఆడడం లేదు, వాడిని చూస్తే గాని నాకు శరీరం సహకరించదు అని అర్థం అయ్యింది.

9 Comments

  1. Bro at part 6 page 14 story continues missed after వాయిస్ వినిపించింది

  2. Asal chadhavalana interest kuda poyindhi vere serials start cheyandi dhiniki rating 5 ki -10 ivali

  3. ఏంటే వాగుతున్నావ్ బయట వాడు వున్నాడు వినిపిస్తుంది అని అంది. ఇప్పుడు బిందు, వింటే విననీలే ఎంజాయ్ చేస్తాడు అయిన నేనేమైన అబద్ధం చెప్పానా, నిజమే కదా చెప్పా అంటూ వాయిస్ వినిపించింది.Some missing…….????

    పదరా ఇప్పుడే వెళ్లి ఆ ఆంటీ కోసం వెతుకుదాం అని అన్నా. వాడు ఎక్కడ వెతుకుదాం రా అని అన్నాడు.
    Missing

    1. Avunu akkada story miss aedi bro

  4. Part 14 story track thapidi bro

  5. Bossu tharuvatha part apudu

Comments are closed.