డూప్లికేట్ 2 123

ఇది అంత నా చెల్లి కోసం చేసి నీతో ఎందుకు శారీరకంగా దెగ్గర అయ్యాను అనుకున్నావా నువ్వు నాకూ దూరం అయ్యే కొద్ది నా ప్రాణం నా నుంచి వేరు అవుతున్నటు ఉంది ఎప్పుడు నీ గురించే నా ఆలోచన నా ధ్యాస, నా లోకమంతా నువ్వే అలాంటిది నిన్ను త్యాగం చేయలేక నిన్ను సగం నా సొంతం చేసుకున్న అర్థం కాలేద ” అంటూ తన కడుపు పైన తన చెయ్యి తో రుదుతు” నిన్ను నా జ్ఞాపకం గా దాచుకుంటా నీ ప్రతిరూపం నాలో పెరిగి బయటకి వస్తే అదే నాకూ నీ జ్ఞాపకం అన్న అంటే అమ్మ నాన్న లో సగం అంటారు కానీ అక్క అంటే అమ్మకు ప్రతిరూపం అలాంటిది నా కూతురు లాంటి చెల్లి కీ ఎలా అన్యాయం చేస్తా బేబి నువ్వు నేను ఉన్నంత వరకు కీర్తన ప్రేమ నీ తెలుసుకోవు అందుకే నీకు దూరం గా వెళ్లిపోతున్న దయచేసి నా కోసం ఆలోచించకు అయినా వినయ్ చనిపోయాడు కదా విజయ్ కీ వందనా ఎవరో తెలీదు సో గుడ్ బై విజయ్ “అని కళ్లు తుడుచుకొని వినయ్ విజయ్ నీ చంపిన వీడియో నీ delete చేసి ఆ వీడియో recording ఆప్పెసి వెళ్లి పోయింది వందనా.

మొత్తం అంతా చూసిన వినయ్ తన పర్స్ లో ఉన్న తన ఆధార్ కార్డు, లైసెన్సు, ఇంకా అని కాల్చి వినయ్ అనే తన identity నీ వదిలేసి తన ప్రేయసి కోరికున్నటు మిగిలిన జీవితం విజయ్ లా బ్రతకడానికీ నిర్ణయం తీసుకున్నాడు, అలా ఇండియా వెళ్లి కీర్తన నీ కంటికిరెప్పలా చూసుకున్నాడు అలా ఒక 9 నెలలు గడిచిన తరువాత కీర్తన ఒక పాప కీ జన్మనిచ్చింది ఆ తర్వాత పాప కీ నామకరణం ఫంక్షన్ జరుగుతుంది అప్పుడు వినయ్ ఫోన్ కీ ఒక మెసేజ్ వచ్చింది అది చూసి షాక్ అయ్యాడు వినయ్ కానీ తరువాత నవ్వుకొన్నాడు

అసలు ఆ మెసేజ్ లో ఏమి ఉంది అంటే వందనా కీ కవలలు పుట్టారు.

The end

1 Comment

  1. Super excelent story bro idhe story peti movie theste blockbuster pakka.@@@

Comments are closed.