డూప్లికేట్ 2 123

ఆ తర్వాత వందనా కార్ స్టార్ట్ చేసి రివర్స్ చేసి బయటకు తెచ్చింది వినయ్ మెల్లగా ఆ ముసలాడి గొంతు మీద నుంచి కత్తి తీసి వాడిని తోసి పరిగెత్తుకుంటు వెళ్లి కార్ ఎక్కాడు ఆ తర్వాత వందనా కార్ నీ సరాసరి వినయ్ ఫ్లాట్ కీ తీసుకు వెళ్లింది, ఆ తర్వాత అందరూ ఇంట్లోకి వెళ్లారు అబ్దుల్, సోఫియా ఇద్దరూ వినయ్ థాంక్స్ చెప్తున్నారు కానీ వందనా కీ అది నచ్చలేదు ఎందుకంటే అలా ఇంట్లో వాళ్లను బాధ పెట్టి పెళ్లి చేసుకున్నారు అని వందనా ఫీలింగ్ అదే మాట బయటకు చెప్పింది, దాంతో సోఫియా “చూడు మా అమ్మ నాన్న కీ పరువు ముఖ్యం నా సంతోషం కాదు వాళ్ళకి ఎప్పుడు నేను వాళ్లు చెప్పింది చేస్తేనే నచ్చుతుంది తప్ప నేను ఎలా ఉండాలి ఏమీ చేయాలి అని నాకూ అంటూ ఒక స్వేచ్ఛ లేదు” అని బాధ పడుతూ చెప్పింది, అప్పుడు వినయ్ లేచి సోఫియా నీ ఓదారుస్తు “వందనా మేము మొన్న వీళ్ల ఇంటికి వెళ్లి మాట్లాడటం జరిగింది వాళ్లు కనీసం మా మాట కూడా వినకుండా బయటికి తీసేసారు ఇలా జరుగుతుందని ముందే అనుకున్నా కానీ ఇంత తొందరగా అవుతుంది అని అనుకోలేదు “అని చెప్పాడు, “సరే ఇప్పుడు హ్యాపీగా ఉండాలి ఎందుకు అందరూ డల్ గా ఉన్నారు రేయి మామ ఎప్పటి నుంచో నా రూమ్ కావాలి అంటున్నావు కదా ఈ రోజు నుంచి అది నీదే ఎంజాయ్ “అని చెప్పి వందనా తో కలిసి బయటకు వచ్చాడు వినయ్.

తరువాత వందనా తో” ఈ కార్ ఇక్కడే వదిలేయి ఎందుకు అంటే దీని నెంబర్ పట్టుకొని వాళ్లు మీ ఇంటి దాకా రావచ్చు దీని నా ఫ్రెండ్ గ్యారేజ్ లో కొంచెం పేయింట్ అని మార్చి తెచ్చి ఇస్తాను పద నా బైక్ లో నిన్ను ఇంట్లో దింపుతా “అని వందనా తో అన్నాడు వినయ్, సరే అన్నట్లు తల ఉప్పింది వందనా “ఇంతకీ మీ ఇల్లు ఎక్కడ “అని అడిగాడు వినయ్” డౌన్ టౌన్ “అని చెప్పింది వందనా,” కార్ లేక పోతే అంత దూరం కష్టం కదా “అని ఆలోచనలో పడ్డాడు వినయ్” పర్లేదు నను మెట్రో లో దింపు నేను వెళ్లిపోతా “అని చెప్పింది వందనా, ఆ తర్వాత ఇద్దరూ ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నారు అప్పుడే మొన్న మాల్ లో గోడవ పడిన గ్యాంగ్ వచ్చారు వాళ్లు వినయ్ వైపు బిర్రుగా,

1 Comment

  1. Super excelent story bro idhe story peti movie theste blockbuster pakka.@@@

Comments are closed.