డూప్లికేట్ 2 123

అప్పుడు వినయ్ నీ చూసిన విజయ్ “అన్నయ్య నువ్వు ఏంటి ఇక్కడ సరే మంచి టైమ్ కీ వచ్చావ్ ఇదిగో మన ఇంటికి కాబోయే చిన్న కోడలు పేరు కీర్తన మేమిద్దరం 1 ఇయర్ నుంచి ఫేస్బుక్ లో లవ్ చేసుకున్నాం ఈ రోజే తను ముంబయి నుంచి వచ్చింది” అని చెప్పాడు విజయ్, దాంతో వినయ్ కీ అసలు ఏమీ జరుగుతుందో అర్థం అయ్యే లోపే వాళ్లు ఇద్దరు వెళ్లిపోయారు, దాంతో వందనా ప్రవర్తన నీ చూసి తన తమ్ముడు చెప్పింది విన్న వినయ్ ఎందుకో డౌట్ వచ్చి అబ్దుల్ కీ ఫోన్ చేశాడు” హా మామ చెప్పు ఏంటి విషయం “అని అడిగాడు అబ్దుల్,”మామ ఎక్కడ ఉన్నావ్” అని అడిగాడు వినయ్ “మెల్బోర్న్ లో ఇక్కడ ఒక హోటల్ లో జాబ్ వచ్చింది 2 నెలల క్రితం ఇక్కడికి shift అయ్యా ఏ ఏమైంది” అని అడిగాడు అబ్దుల్, దాంతో వినయ్ కీ వందనా గురించి వాడికి తెలిసినట్టు లేదు అని అర్థం అయ్యి” మళ్లీ చేస్తా మామ” అని ఫోన్ పెట్టేసాడు వినయ్.

కార్ లో రెస్టారెంట్ కీ వెళుతున్న వినయ్ కీ తల నిండా సమాదానం చిక్కని ప్రశ్నలు తలెత్తుతున్నాయి, అలా రెస్టారెంట్ కీ చెరుకున్న వినయ్, కార్ దిగగానే ఎదురుగా పోలీస్ లు ఉండటం చూసి ఏమీ జరిగిందా అని లోపలికి వెళ్ళాడు అక్కడ సిటీ కమిషనర్ మోహన్ కూర్చుని ఉన్నాడు, వినయ్ రాగానే అతని కీ షేక్ హ్యాండ్ ఇచ్చి పరిచయం చేసుకున్నాడు మోహన్ “చెప్పండి సార్ ఏమైనా ప్రాబ్లమ్ ఆ” అని అడిగాడు వినయ్ “అలాంటిది ఏమీ లేదు బాబు మీ రెస్టారెంట్ గురించి విన్నాను ఇంకో రెండు నెలల లో నా రిటైర్మెంట్ దాంతో పాటు నా కొలీగ్స్ కొంతమంది ట్రాన్స్ఫర్ అవుతూన్నారు అందుకే ఒకేసారి అందరం కలిసి send-off పార్టీ చేసుకుందాం అని అనుకుంటున్నాం అందుకే మేము మీ రెస్టారెంట్ నీ రేపు రాత్రికి బుక్ చేసుకుందాం అని అడగడం కోసం వచ్చాను ” అని చెప్పాడు, దానికి వినయ్” అయ్యో సార్ ఈ మాత్రం దానికి ఇంతలా అడగ్గాలిసిన అవసరం ఏమీ ఉంది ఎమ్ ప్రాబ్లమ్ లేదు రేపు మీరు పార్టీ చేసుకోవచ్చు “అని చెప్పాడు వినయ్,” నీ గురించి చాలా విన్నాను నువు రామ్మూర్తి గారి అబ్బాయి వీ కదా “అని అడిగాడు మోహన్” అవును సార్ “అని చెప్పాడు వినయ్, “గ్రేట్ మీ జేనాన్న అంతా సంపాదించిన కూడా నువ్వు ఆ అస్తి మీద ఆశ పడకుండా నీ సొంత కాలు పైన నిలబడి సక్సెస్ అయ్యావు చూడు గ్రేట్” అని వినయ్ నీ పొగడ్తలతో ముంచేతాడు తరువాత కమిషనర్ వెళ్లిపోయాడు కానీ వినయ్ ఇంకా కీర్తన గురించి ఆలోచించడం మన లేదు ఆ తర్వాత వందనా నెంబర్ కీ ఎన్ని సార్లు ఫోన్ చేసినా నెంబర్ పనిచేయడం లేదు అని రెస్పాన్స్ వస్తోంది.

1 Comment

  1. Super excelent story bro idhe story peti movie theste blockbuster pakka.@@@

Comments are closed.