నా పాచిక పారింది 279

మెల్లగా శ్వాస అందుతోంది, తన గుండె చప్పుడు తనకే సన్నగా వినిపిస్తోంది లాబ్ డబ్ మని… ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు సూర్య , కటిక అమావాస్యపు చీకటి పక్కనే అలల హోరు. సముద్రపు ఒడ్డున ఉన్నాను అని లీలగా అర్థం అయింది కానీ ఒంటినిండా గాయాలు ఎటూ కదల లేని స్థితిలో అచేతనంగా అలాగే పడుకుండుపోయాడు.
సుర్రుమని సముద్రపు ఉప్పు నీరు గాయాలకి తగిలి మండటంలో మెలకువ వచ్చింది తనకి. తెల్లవారింది మెల్లగా కళ్ళుతెరచి చుట్టూ చూసాడు సూర్య, ఒకవైపు భారీ అలలతో విరుచుకు పడుతున్న మహాసముద్రం మరోవైపు దూరంగా కొండలు మరియు అడవి లాంటి ప్రాంతం మధ్య బీచ్ లో తను.ఎక్కడున్నాను కానీ ఆలోచించే స్థితిలో లేడు… విపరీతమైన దాహం గాయాల వల్ల కలిగిన నిస్సత్తువ, వీటికి తోడు మొదలైన ఎండ. టైం చూసుకున్నాడు సూర్య రోలెక్స్ వాచ్ ఉదయం పది గంటలైంది.

స్వతహాగా మొండిగటం అవడం మూలన ముందు దాహం తీర్చుకుని ఆలోచించొచ్చు అని తనకు తానే ధైర్యం తెచ్చుకుని చెట్ల వైపు దారితీసాడు సూర్య.చాలా దట్టమైన పొదలు, మడ చెట్లుతో నిండి అడుగు వేయడమే భారం గా ఉంది ఆ ప్రాంతం. తనకి చిన్నతనం లో స్కూల్లో n.c.c మరియు టూర్లలో చేసిన ట్రెక్కింగ్ ఇప్పుడు బాగా ఉపయోగ పడుతుంది.మడ చెట్లు ఉండే ప్రాంతం లో నీరు దొరకటం కష్టమనిపించి, ఆ ఆలోచన మానుకుని నడవడం స్టార్ట్ చేసాడు. మధ్యాహ్నం 3గంటలైంది ఎంతదూరం నడిచాడో తెలియదు కాని దూరం గా మళ్ళీ సముద్రపు అలల శబ్దం వినిపించింది. అంతే ఎదో తెలియని శక్తి అవహించినట్లుగా వడి వడి గా అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు…. మళ్ళీ సముద్రపు తీరం, ఓహ్ మై గాడ్ అనుకుంటుండగా దూరం గా కొన్ని కొబ్బరిచెట్లు.
మెల్లగా వాటిని చేరుకున్నాడు సూర్య ఎత్తు తక్కువ ఉన్నాసరే చాలా తక్కువ కాయలు ఉన్నాయి. ఆత్రంగా చెట్ల కింద వెతక సాగాడు…. దొరికింది రాలిన ఒక ఎండు కొబ్బరి కాయ. ప్రాణం లేచి వచ్చి దానిని అందుకుని ఎట్లా దానిని ఓపెన్ చెయ్యాలా అని ఆలోచిస్తుంటే బీచ్ కి ఒక పక్క అనేక రాళ్లు కనిపించాయి. వెంటనే ఒక పెద్ద రాయి మీద దానిని పెట్టి చిన్న రాయి తో దబి దబి రెండు దెబ్బలు వేసాడు… వెంటనే అది పగలడం సగం నీరు నేలపాలు కావడం

2 Comments

  1. Nice bro story continue chyndi

  2. Comeon comeon bebyyy I’m waiting

Comments are closed.