నిన్ను చూడాలని ఉంది రా 196

శ్రావణ్ ఊరెళ్లి నాలుగు రోజులయ్యింది. రెండు రోజుల్లో తిరిగొస్తానన్నాడు, ఇంకా రాలేదు. ఇలా ఆలోచిస్తూ ఆ రాత్రికి నిద్రపోయాను. ఉదయాన్నే లేచి కాలేజికి రెడీ అయ్యి లంచ్ బాక్స్ తీసుకుని బస్సు ఎక్కేసాను. As usual గా విండో దగ్గర కూర్చున్నాను. బస్సు కాలేజిలోకి వచ్చేసింది. అందరు దిగేస్తున్నారు. సరిగ్గా నేను లేవబోతున్న సమయానికి నా మొబైల్ మోగింది. చూస్తే శ్రావణ్ కాలింగ్. నాకు చాలా కోపం వచ్చింది. కాల్ lift చేసి చడామడా అరిచేశాను.అటువైపు నుండి మౌనం. నేను కాసేపు గ్యాప్ ఇచ్చాను. అప్పటికీ తను ఇంకా ఏమి మాట్లాడలేదు. “హల్లో శ్రావణ్” అన్నాను.
“అయిపోయిందా?” అన్నాడు.
“అవ్వలేదు” అన్నాను కోపంగా.
“సరే కానీ” అన్నాడు వెటకారంగా.
నాకు కోంచెం నవ్వు వచ్చింది ఆ మాట వినగానే. కానీ ఆ నవ్వును ఆపుకుంటూ “నాతో మాట్లాడొద్దు” అన్నాను లేని కోపం నటిస్తూ.
“సరే కాల్ కట్ చేయమంటావా?” అన్నాడు.
“చంపేస్తాను కాల్ కట్ చేస్తే” అన్నాను.
“మాట్లాడనంటావు అంతలోనే కాల్ కట్ చేస్తే చంపుతానంటావు. ఇలా ఐతే నీతో కష్టం సమీర. నన్ను మర్చిపో. నేను కూడా నిన్ను మర్చిపోతాను” అన్నాడు.
“ఇదిగో ఈ మాటలే నాకు కోపం తెప్పించేవి” అన్నాను.
“అదంతా వదిలెయ్. ఎలా ఉనావ్ సమీరా?”
“నా గురించి పక్కనపెట్టు నువ్వెలా ఉన్నావ్ రా? వెళ్తే ఫోన్ కూడా చెయ్యవు నువ్వు. నేను చేస్తే ఎప్పుడూ స్విచ్ ఆఫ్ అని వస్తుంది”
“మన ఊరి గురించి తెలుసు కదా నీకు? అక్కడ network లేదు.సారీ రా” అన్నాడు.
“ఈ సారీలకేమీ తక్కువ లేదు” అన్నాను.
అటువైపు నుంచి మౌనం. “శ్రావణ్” అన్నాను.

1 Comment

  1. Super story plz continue.

Comments are closed.