నిన్ను చూడాలని ఉంది రా 196

ముందు లేడీస్ వేర్ లోకి వెళ్లి నాకు చీర సెలెక్ట్ తీసుకున్నాం. అది సెలెక్ట్ చేయడానికి బావకి ఒక గంట టైం పట్టింది. తరువాత జెంట్స్ సెక్షన్ లోకి వెళ్లాం. అక్కడ బావకు ఒక ప్యాంట్ అండ్ షర్ట్ సెలెక్ట్ చేశాను. ఇది మాత్రం అరగంటలో అయిపోయింది. బయటికి వచ్చి చూస్తే చీకటి పడుతోంది. ఇక వెళ్లాలా అన్నట్లుగా చూసాను బావ వైపు.
బావ నన్ను చూసి “నెక్స్ట్” అన్నాడు.
“ఇంకేం లేదు బావ. నీకేమైనా కావాలా?” అని అడిగాను.
“నాకేమొద్దు” అన్నాడు.
ఇద్దరం అలా నడుచుకుంటూ వస్తున్నాం. దారిలో ఐస్ క్రీం పార్లర్ కనిపించింది.
“బావా ఐస్ క్రీం తిందామా?” అని అడిగాను.
“పద” అంటూ నడిచాడు.
లోపలికి వెళ్లి కూర్చున్నాం.
“ఏం తింటావు?” అని అడిగాడు.
“అదేంటి నువ్వు తినవా?” అని అడిగాను.
“ఐస్ క్రీం తిన్నందుకే తిరుపతిలో నాలుగు రోజులు మంచం మీద ఉండాల్సివచ్చింది” అన్నాడు.
“మరి అన్నయ్యకు జ్వరం రాలేదే?” అని అడిగాను.
“వాడు రాలేదు” అన్నాడు.
“మరి ఎవరితో వెళ్లావ్?” అని అడిగాను.
“చరణితో” అన్నాడు నవ్వుతూ.
“దానితో ఎందుకు వెళ్లావ్?” అని అడిగాను.
“పిలిస్తే వెళ్లాను” అన్నాడు.
“మరి అన్నయ్యను పిలవలేదా?” అన్నాను.
“పిలిచింది. కానీ వాడు ఏదో పని ఉందని రాలేదు” అన్నాడు నవ్వుతూ.
“నవ్వు ఎందుకొస్తోంది నీకు?” అని అడిగాను.
“నిన్ను చూస్తుంటే నవ్వు వస్తోంది” అన్నాడు.
“నవ్వింది చాల్లే. నాకు కాలుతోంది” అన్నాను.
“ఎక్కడ?” అన్నాడు.
“ఎక్కడైతే నీకెందుకు రా?” అన్నాను కోపంగా.
“ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేద్దామని” అన్నాడు.
“నిన్ను కొట్టడం లో తప్పులేదు” అంటూ వాడిని కొడుతున్నాను.
ఇంతలో వెయిటర్ వచ్చాడు.
“ఒక హనీమూన్ డిలైట్” అని చెప్పాను.
“మీకు సర్” అని బావను అడిగాడు వెయిటర్.
“నాకొద్దు. మేడం గారికి మాత్రమే” అన్నాడు నన్ను చూసి నవ్వుతూ.
నేను విసురుగా చూపుని వాడి వైపు నుండి పక్కకు తిప్పాను. కాసేపటికి ఆర్డర్ చేసిన ఐస్ క్రీం వచ్చింది. నేను ఏమి మాట్లాడకుండా తింటున్నాను. బావ నన్ను అలాగే చూస్తూ ఉన్నాడు.
“అలా చూడకు దిష్టి తగులుతుంది” అన్నాను.
దాంతో బావ నావైపు నుండి చూపుని పక్కకు తప్పించాడు. నేను చిన్నగా నవ్వుకుని తింటున్నాను. కాసేపటికి తినేసి ఇద్దరం బయటికి వచ్చేశాం. అలా నడుచుకుంటూ నేనుండే హాస్టల్ దాకా వచ్చేశాం.
“సరే బై సమీర” అన్నాడు బావ.

1 Comment

  1. Super story plz continue.

Comments are closed.