నిన్ను చూడాలని ఉంది రా 196

“ఏంట్రా ఆ మాటలు? కాఫీ తాగు చల్లారిపోతుంది” అన్నాను.
వాడు కాఫీ తాగడం మొదలుపెట్టాడు.
“మా అమ్మానాన్నలని నీ అమ్మానాన్నలుగా అనుకుంటే అనుకున్నావ్ గానీ, నన్ను మాత్రం నీ చెల్లెలి లాగా అనుకోవద్దు. చంపేస్తాను” అన్నాను వాడి వైపు అదోలా చూస్తూ.
వాడు నన్ను చూసి గట్టిగా నవ్వేశాడు. అలా నవ్వుకుంటూ ఇద్దరం కాఫీ తాగేశాం. నేను కప్పులు తీయబోతుంటే “కాఫీ ఎలా ఉంది?” అని అడిగాడు బావ.
“టానిక్ లాగ ఉంది” అన్నాను నవ్వుతూ.
“అంటే” అన్నాడు అనుమానంగా.
“ఇప్పటిదాక పడ్డ బాధనంతా మర్చిపోయేలా చేసింది” అన్నాను వంటింట్లోకి నడుస్తూ.
“సమీరా” అన్నాడు.
“ఏంటి బావా?” అన్నాను వెనక్కి తిరిగి.
“నన్నెప్పుడు విడిచి వెళ్లకే. పిచ్చోడిని అయిపోతాను” అన్నాడు నా చేతిని వాడిచేతిలోకి తీసుకుంటూ.
“ఇది నా డైలాగ్ నువ్వు చెప్పావేంటి?” అన్నాను.
“పడతాయ్ నీకు” అంటూ లేచాడు బావా.
నేను పరుగెత్తుకుంటూ వంటింట్లోకి దూరిపోయాను. కప్పులు కడిగి హాల్లోకి రాగానే బావా ఏదో ఆలోచిస్తున్నట్లు ఉన్నాడు.
“ఏంటి బావా ఆలోచిస్తున్నావ్?” అన్నాను.
“రేపు నువ్వు నన్ను వదిలేస్తే నా పరిస్థితి ఏంటా? అని” అన్నాడు.
బావ దగ్గరికి వెళ్లి నుదుటిమీద ముద్దు పెట్టుకుంటూ “నువ్వు వదిలినా, నేను వదలను బావా” అన్నాను. దాంతో బావ నన్ను గట్టిగా హగ్ చేసుకున్నాడు. నేను కూడ బావ వీపు పై చేతులు వేసాను. వాడి కౌగిలి నాకు ఊపిరి ఆడనివ్వట్లేదు కానీ బావ నాతో అలాగే ఉండిపోతే బాగుంటుంది అనిపించింది. కాసేపటికి బావే విడిపడి నన్ను చూస్తున్నాడు. వీడు ఇలాగే ఉంటే ఏడుస్తుంటాడు, లేదా నన్ను ఏడిపిస్తాడు అని అనిపించింది.
“బావా బయటికి వెళ్దామా?” అని అడిగాను.
“ఎక్కడికీ” అని అడిగాడు.
“రేపు ఫ్రెషర్స్ పార్టి ఉంది తెలుసా?” అని అడిగాను.
“అరే మర్చిపోయాను. ఐతే ఇప్పుడేంటి?” అని అడిగాడు.
“షాపింగ్ చేద్దాం” అన్నాను.
“సరే పద” అన్నాడు.
ఇద్దరం రెడీ అయ్యి ఒక అరగంటలో షాపింగ్ మాల్ కు చేరుకున్నాం.
“ముందు ఏం కొందాం?” అని అడిగాడు.
“నేను రేపు చీర కట్టుకుంటాను బావా” అన్నాను.
“నీకు బుద్ధుందా?” అని అడిగాడు బావ.
“అదేంటి, అలా అన్నావ్?” అని అడిగాను.
“లేకపోతే చీర లేడీస్ వేసుకుంటరు. నీకెందుకు?” అన్నాడు నవ్వుతూ.
“నిన్నూ….” అంటూ వాడి పైకి చెయ్యెత్తాను.
“ఓకే….ఓకే…పద” అంటూ నన్ను కొట్టకుండా ఆపి లోపలికి నడిచాడు.
నేను బావ వెనకే చిన్నగా నవ్వుకుంటూ మాల్ లోకి నడిచాను.

1 Comment

  1. Super story plz continue.

Comments are closed.