నిన్ను చూడాలని ఉంది రా 196

“శ్రావణ్ లాంటి వాడు నీకు బావైనందుకు” అంది.
నాకు కొంచెం గర్వంగా అనిపించింది.
“నువ్వెలా చెప్తున్నావే నా అదృష్టం గురించి?” అని అడిగాను.
“ఏం లేదు. నువ్వంటే శ్రావణ్ కి చాలా ఇష్టం కదా అందుకే” అని అంది.
ఆ మాట వినగానే నాకు చాలా ఆనందమేసి సడన్ గా బావ వైపు చూశాను. వాడు వాడి ఫ్రెండ్స్ తో నవ్వుకుంటూ మాట్లాడుతున్నాడు. ఇక ఆ రోజుకి క్లాసెస్ అయిపోయిన తరువాత నేను బావ సెల్ కు “నీతో మాట్లాడాలి కాసేపు ఆగు” అని మెసేజ్ పెట్టాను. అందరూ వెళ్లిపోయారు. క్లాస్ లో నేను బావ మాత్రమే ఉన్నాం.
“ఎందుకే ఆగమన్నావు?” అన్నాడు బావ.
“నీతో మాట్లాడాలని”
“ఏంటో చెప్పు”
నేను వెళ్లి బావ పక్కన కూర్చున్నాను. వాడి ఎడమ చేయి చంక కిందుగా నా చేతిని పోనిచ్చి, వాడి ఎడమ చేతిని పట్టుకున్నాను. నా తలను వాడి భుజంపై చిన్నగా వాల్చి “బావా” అన్నాను.
“మ్మ్” అన్నాడు.
“నా మీద కావ్యకి జెలసీగా ఉందంటా”
“ఎందుకు?”
“నీ వల్లే”
“నేనేం చేశాను” అన్నాడు లేవబోతూ.
“అబ్బా కూర్చో బావా” అన్నాను నా చేతిని ఇంకా గట్టిగా బిగిస్తూ.
“నేనేం చేసానో చెప్పు” అన్నాడు నన్ను చూస్తూ.
“నువ్వు దొరకడం నా అదృష్టం అంట. నీలాంటి బావ తనకి లేడని నేనంటే జెలసీ” అన్నాను.
“ఈ విషయం అందరికీ తెలుసు. కానీ అందరూ నాతో ఏమని అంటున్నారో తెలుసా?” అన్నాడు.
“ఏం అంటున్నారు?” అన్నాను అత్రుతగా.
“నీ టేస్ట్ ఎందుకు రా ఇంత బాడ్ గా ఉంది అని అంటున్నారు” అని అన్నాడు.
“నిన్నూ….. చంపేస్తాను” అంటూ బావ భుజంపై చిన్నగా కొరికాను.
“ఎందుకు కొరికావే రాక్షసీ?” అన్నాడు భుజంపై రుద్దుకుంటూ.
“వాళ్లలా అంటుంటే నువ్వేం మాట్లాడనందుకు” అన్నాను నా చేతులు వాన్ని వదిలేస్తూ.
“నేనేం మాట్లాడకుండా ఉండలేదు” అన్నాడు.
“ఏం అన్నావు?” అడిగాను ఇంకా ఆత్రుతతో.
బావ చిన్నగా జరిగి నా చెవిలో “విధి చేసే పనుల నుండి ఎవరూ తప్పించుకోలేరు అని చెప్పాను” అన్నాడు.
ఆ మాట వినగానే నేను వాన్ని కొట్టబోయాను. వాడు లేచి పరిగెత్తాడు. నేను లేచి వాడి వెనుక పరుగెత్తబోతూ నా మోకాలికి బెంచ్ తగలడంతో “అమ్మా” అని అరిచి అక్కడే కూర్చున్నాను. నా అరుపుతో వెనక్కి తిరిగి చూశాడు. నేను నా మోకాలు పట్టుకుని కూర్చున్నాను. నా దగ్గరికి పరుగెత్తుకు వచ్చి కింద రెండు కాళ్ల మీద క్కొర్చుని నా మోకాలిని తాకాడు. నేను వెంటనే బావ చెవిని పట్టుకుని పిండేస్తూ “ఇప్పుడు చెప్పు ఏమన్నావో….విధి….ఇంకా ఏదేదో వాగావు?” అన్నాను.

1 Comment

  1. Super story plz continue.

Comments are closed.