నిన్ను చూడాలని ఉంది రా 196

నేను వాడిని వదిలి నవ్వుతూ వాడితో పాటు వెళ్లి కూర్చున్నాను. మేము అలా వెళ్లి కుర్చోగానే “బాబు రూము లాక్ చెయ్యాలి” అంటూ వచ్చాడు వాచ్ మేన్.
ఇక తప్పదు అన్నట్లు ఇద్దరం లేచి బయటకు వచ్చాం.
“కాఫీ తాగుదామా?” అని అడిగాడు బావ.
(మొదట్లో నాకు కాఫీ అలవాటు లేదు. కానీ బావ కోసం అలవాటు చేసుకున్నా)
“పద వెళ్దాం” అన్నాను.
ఇద్దరం ఒకరి చేయి ఒకరం పట్టుకుని కెఫెటేరియా వైపు నడుచుకుంటూ వెళ్లాం. అక్కడ కాఫీ ఆర్డర్ చేసి, తీసుకుని వచ్చి టేబుల్ దగ్గర ఎదురెదురు కుర్చీలలో కూర్చుని కాఫీ తాగేసాం. బాగా లేట్ అయినందువల్ల క్యాంటీన్ లో పెద్దగా ఎవరూలేరు. ఇద్దరం బయటకి వచ్చి బస్ స్టాప్ లో నిల్చున్నాం. బస్సు రాగానే ఖాళీగా ఉండటంతో ఎక్కేసాం. ఎక్కికూర్చోగానే నాకు నిద్ర వెచ్చేసింది. మేము దిగాల్సిన చోటు రాగానే బావ నన్ను లేపి “పద వెళ్దాం” అన్నాడు.
ఇద్దరం బస్సు దిగి “బై” చెప్పుకుని అక్కడి నుండి వెళ్లిపోయాం.
ఇక ఆ రోజు బావతో జరిగిన విషయాలన్ని గుర్తు తెచ్చుకుని హాయిగా నిద్ర పోయాను.

నెక్స్ట్ డే సండే కావడం వల్ల అలాగే పడుకుండిపోయాను. పొద్దున్నే ఒక ఫోన్ కాల్ తో మేల్కున్నాను. “ఎవరా?” అని చూస్తే అన్నయ్య.
(అన్నయ్య పేరు శివ. మేం ఇద్దరం కవల పిల్లలం. వీడు నాకంటే కొన్ని సెకండ్లు పెద్ద. వాడు తిరుపతిలో చదువుకుంటున్నాడు నాలాగే బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. నాకు తెలిసిన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే అది అన్నయ్య, బావలే)
ఫోన్ లిఫ్ట్ చేసి “ఎలా ఉన్నావ్ రా?” అని అడిగాను.
“నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావ్?” అని అడిగాడు.
“ఏదో మీ దయ” అన్నాను.
“మాదేముందిలే” అన్నాడు.
“ఇంకేంటి రా?” అని అడిగాను.
“అమ్మా నాన్నా ఎలా ఉన్నారో తెలుసా? ఫోన్ ఏమైనా చేశారా?” అని అడిగాడు.
“ఏమో బావ ఊరెళ్లి నిన్నే వచ్చాడు. వాడిని అడిగి కనుక్కో” అన్నాను.
“వాడు మొన్నటిదాకా నా దగ్గరే ఉన్నాడు. ఊరెప్పుడు వెళ్లాడు?” అని అడిగాడు. “ఏం మాట్లాడుతున్నావ్ రా?” అర్థం కాక అడిగాను.
“ఐతే వాడు నీకేం చెప్పలేదా?” అన్నాడు.
“ఏం జరిగిందీ?” అని అడిగాను
“మొన్నటిదాకా వాడికి హెల్త్ సరిగా లేదు. నాలుగు రోజులు నా దగ్గరే ఉండి, ఇక్కడే ట్రీట్మెంట్ చేయించుకుని మొన్న నేను వద్దంటున్నా వినకుండా బయల్దేరాడు. ఈ విషయం నీకు ఫోన్ చేసి చెప్పమంటే బాధ పడతావని చెప్పొద్దు అన్నాడు” అంటూ టూకీగా మొత్తం జరిగిందంతా చెప్పాడు.
ఇదంతా వినగానే నాకు బావను చూడాలనిపించింది.
“హల్లో” అన్నాడు అన్నయ్య.
“హా…” అన్నాను.
“ఏంటే ఏమైందీ?” అని అడిగాడు.
“ఏం లేదు?” అన్నాను.

1 Comment

  1. Super story plz continue.

Comments are closed.