నిన్ను చూడాలని ఉంది రా 196

“అదేం కుదరదు” అంటూ అన్నం కలిపి నా నోటి దగ్గర పెట్టాడు. నేను నా కన్నీళ్లు తుడుచుకుని నోరు తెరిచాను. వాడు నాకు తినిపించడం ప్రారంభించాడు.
“ఇలా అలుగుతూ ఉంటే మా అన్నయ్యా కష్టపడిపోతాడు” అన్నాడు.
“అన్నయ్య ఎవరూ?” అని అడిగాను అనుమానంగా.
“నీకు కాబోయే మొగుడు” అన్నాడు.
“ఇదిగో ఇలా వాగావంటే వెళ్లిపోతాను” అంటూ లేవబోయాను.
“అన్నం తింటూ మధ్యలో ఆపితే పాపం” అంటూ నా చేయి పట్టుకుని గుంజి కూర్చోబెట్టాడు.
“తిరుపతిలో నాకు చరణి కనిపించింది” అన్నాడు.
(చరణి మా బాబాయ్ కూతురు. అది బయట పడదు కానీ దానిక్కూడా బావంటే ఇష్టమే. ఈ విషయం వాడికి తెలిసి కూడా నన్ను ఏడిపించడానికి దానితో క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటాడు)
దాని పేరు వినగానే ఒళ్లంతా కంపరంగా అనిపించింది.
“దానికి అక్కడేం పని?” అని అడిగాను.
“చిన్న మావయ్యకి అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యిందంటా. ఇప్పుడు వాళ్ల ఫ్యామిలీ అంతా తిరుపతికి షిఫ్ట్ అయ్యారు” అన్నాడు.
“అవునా…ఏం మాట్లాడింది?” అని అడిగాను.
“నన్ను, మీ అన్నయ్యను ఇంటికి భోజానికి పిలిచింది” అన్నాడు.
“అప్పుడు పక్కన అన్నయ్య కూడా వున్నాడా?” అని అడిగాను.
“హా…” అన్నాడు.
“పిలవగానే ఎగేసుకుంటూ వెళ్లిపోయారా?” అని అడిగాను.
“వాళ్లేమి పరాయి వాళ్లు కాదు కదా? అందులోనూ ఊరు కాని ఊళ్లో మన వాళ్లు ఉంటే కలవకపోతే బాగోదుగా?” అన్నాడు.
“వెళ్లి సుబ్బరంగా తిన్నారా?” అన్నాను.
“తను అంత “ప్రేమ” గా వడ్డిస్తే తినకుండా ఎలా ఉంటాం” అన్నాడు నవ్వుతూ.
“నవ్వకు నాకు మండుతోంది” అన్నాను.
వాడు ముసిముసిగా నవ్వుకుంటున్నాడు.
“ఇంకేం మాట్లాడలేదా?” అని అడిగాను.
“తినేసి, కాసేపు మాట్లాడి వెళ్లిపోయాం” అన్నాడు.
“అందుకేనేమో ఆరొగ్యం బాగలేక ఉండిపోయావు” అన్నాను.
“ఎంతైనా మీకు మీరే శత్రువులు” అన్నాడు.
ఇలా మాట్లాడుతూ తినేశాను. మధ్యమధ్యలో నేను కూడా బావకు తినిపిస్తున్నాను. ఇలా తినడం ముగించుకుని చేతులు కడుక్కుని నేను బెడ్ పై నడుం వాల్చగానే నిద్రొచ్చేసింది.

సాయంత్రం లేచి టైం చూస్తే 5 గంటలు అవుతోంది. బావ కోసం చూశాను. కనిపించలేదు. లేచి వెళ్లి ముఖం కడుక్కుని హాల్లోకి రాగానే వంటింట్లో ఏదో చప్పుడైనట్లు అనిపించింది. అటుగా వెళ్లి చూస్తే బావ అప్పుడే రెండు కప్పుల్లో కాఫీ పోస్తున్నాడు.
“నీకెందుకు బావా? నేను చేసేదాన్ని కదా” అన్నాను.
“నువ్వు నిద్రపోతున్నావని నేను చేశాను లేవే. అయినా ఈరోజు నువ్వు చేస్తావు, రేపటి నుంచి నేనే చేసుకోవాలిగా” అన్నాడు కప్పులు తీసుకుని నా వైపు నడుస్తూ.
“ఒకప్పుడు కష్టమే తెలీకుండా పెరిగావు. ఇప్పుడేంటి బావా ఇలా?” అన్నాను బాధగా బావ చేతిలోని ఒక కప్పు తీసుకుంటూ.
“నిజమేనే….! అమ్మా, నాన్నా నాకు కష్టమే తెలీకుండా పెంచారు. ఇప్పుడు వాళ్లు లేరు. ఎందుకో ఒంటరిని అన్న ఫీలింగ్ వస్తోంది” అన్నాడు చెమ్మగిల్లిన గొంతుతో.
“అదేంటి బావా అలా అంటావ్? నీకు మేమంతా ఉన్నాం కదా” అన్నాను ఓదారుస్తున్నట్లు.
“నీకు తెలీదు సమీర నేను పడే బాధ. పైకి నవ్వుతున్నా లోపల ఏదో తెలియని ఫీలింగ్” అన్నాడు.
అది చెబుతుంటే వాడి కళ్లలో చిన్నగా కన్నీరు.
“ఏంటి బావా ఇది చిన్నపిల్లాడిలాగ?” అన్నాను వాడి కళ్లు తుడుస్తూ.
“అత్తయ్యలో అమ్మను, మావయ్యలో నాన్నను చూసుకుంటున్నాను, మీరు మాత్రం నన్ను దూరం చెయకండి సమీరా” అన్నాడు.

1 Comment

  1. Super story plz continue.

Comments are closed.