నిన్ను చూడాలని ఉంది రా 196

“ఈ విషయాలన్ని నీతో చెప్పలేదా?” అని అడిగాడు.
“అస్సలు చెప్పలేదు రా” అన్నాను కాస్త బాధగా.
“ఐతే నువ్వు కూడా ఏమి తెలియనట్లే ఉండు. లేకపోతే వాడు నన్ను చంపేస్తాడు” అన్నాడు.
“సరే” అన్నాను.
“సరే ఐతే ఉంటాను రా” అన్నాడు.
“బై” అని చెప్పి ఫోన్ పెట్టేశాను.
(ఈ విషయాలన్ని నాతో చెప్పనందుకు బావ మీద పీకల దాకా కోపం వచ్చింది. అదే సమయంలో నేను బాధ పడతానని వాడు దాచినందుకు అంత కంటే ఎక్కువ సంతోషమేసింది)
వెంటనే బావకి కాల్ చేశాను.”ఏంటే ఇంత పొద్దున్నే కాల్ చేశావు?” అన్నాడు.
వాడు చెప్పిన విధానం బట్టి ఇంకా నిద్ర లేచినట్లు లేడు.
“ఏంట్రా ఇంకా తెల్లవారలేదా?” అన్నాను.
“ఇది అడగడానికి కాల్ చేశావా? బయట చూడవే తెలుస్తుంది” అన్నాడు అదే టోన్ తో.
“ఈ వెటకారానికి ఏం తక్కువలేదు. నేను ఇంకో పది నిమిషాలలో నీ రూంలో ఉంటా. లేచి రెడీగా ఉండు” అన్నాను.
“అబ్బా పొద్దున్నే నా ప్రాణం తీయడానికి కంకణం కట్టుకున్నావా?” అన్నాడు.
“నూవ్వు ఏమైనా అనుకో నేను వస్తున్నా అంతే” అని కాల్ కట్ చేశాను.
అరగంటలో అన్ని కార్యక్రమాలు ముగించుకుని వాడి రూం కాలింగ్ బెల్ కొట్టాను. చాలాసేపటి తరువాత వచ్చి డోర్ తీశాడు. వాడి వాలకం చూస్తే ఇప్పటిదాకా ఇంకా పడుకునే ఉన్నట్లు ఉన్నాడు.
“ఏంట్రా నేనేం చెప్పాను?” అని అడిగాను.
“ఏమో గుర్తులేదు. గుర్తొస్తే చెప్తా” అంటూ మళ్లీ బెడ్ పై వాలాడు.
“ఏం అవసరం లేదు వెళ్లి ఫ్రెష్ అవ్వు” అంటూ వాడి భుజం పై చిన్నగా కొట్టాను.
“అబ్బా పడుకోనీవే” అన్నాడు వాడి పైకి దుప్పటి లాక్కుంటూ.
“ఏయ్ చెప్తే వినాలి” అంటూ దుప్పటి లాగేశాను.
“రాక్షసీ” అంటూ బాత్ రూంలోకి దూరాడు.
నేను నవ్వుకుంటూ బయట వెయిట్ చేయసాగాను. సరిగ్గా అరగంట తరువాత వచ్చాడు ఒంటి మీద టవల్ తో. వాడిని అలా చూస్తుంటే నాకు మా బాల్యం గుర్తుకొచ్చింది.
“చిన్నప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడూ అలాగే ఉన్నావ్ రా” అన్నాను వాన్ని చూస్తూ.
“అవును నేను ఎప్పుడూ ఒకేలా ఉంటాను” అన్నడు తల మీది జుట్టుని స్టైల్ గా దువ్వుకుంటూ.
“చాల్లే వెళ్లి భట్టలు వేసుకుని రా” అన్నాను.
“నిన్నెవడు చేసుకుంటాడో గానీ నరకం చూస్తాడు” అంటూ బెడ్ రూం లోకి నడిచాడు.
“పొద్దున్నే నన్ను ఏడిపించకుండా నీకు రొజు స్టార్ట్ అవ్వదా?” అన్నాను కోపంగా.
“అవునవును ఎవరు ఎవర్ని ఏడిపిస్తున్నారో తెలుస్తూనే ఉంది” అన్నాడు వెటకారంగా.
“అంటే ఏంట్రా ఇప్పుడు నేను నిన్ను ఏడిపిస్తున్నానా?” అని అడిగాను కాస్త బుంగ మూతి పెట్టుకుని.
“ఈ అలకలకు ఏం తక్కువలేదు గానీ, టిఫిన్ తిన్నావా?” అని అడిగాడు.
“లేదు. బయట తిందాం పద” అన్నాను.
“సరే పద” అంటూ బయటికి వచ్చాడు.

1 Comment

  1. Super story plz continue.

Comments are closed.