యవ్వనం 2 222

” ఏమమ్మా ఇప్పుడు బాగానే ఉన్నావా?” అని అడిగారు. “ఐ యాం ఆల్ రైట్ అంకుల్” అంటూ సమాధానం ఇచ్చింది. ఆయన తల ఊపి ఊరుకున్నారు. నాకు కోపం వచ్చింది. నన్ను కనీసం ఏమీ పట్టించుకోకుండా ఆమెని కుశలం అడుగుతున్నారు ఏమిటి ఈయన? మా నాన్నగారు ఫ్రంట్ సీట్ లో కూర్చున్నారు. మేము వెనక సీట్ లో కూర్చున్నాము. కావ్య నెమ్మదిగా నా చెయ్యి పట్టుకొని ఆప్యాయంగా టచ్ చేసింది. నేను ఆమె చేతిని గిట్టిగా పట్టుకొని ఐ యాం ఆల్సో ఆల్ రైట్ అన్నట్లు తల ఆడించాను. కావ్య నవ్వింది. ఆ నవ్వు చూసి నా బాధంతా ఎగిరిపోయినట్లు అనిపించింది. కావ్య ఇంటి దగ్గర కారు ఆగింది. కావ్య దిగిపోయి “థాంక్స్ అంకుల్, ఇందులో హరి తప్పు ఏమీ లేదు. తను చాలా మంచివాడు. అందుకే నన్ను కాపాడడానికి మధ్యలో కలిగించుకున్నాడు. తను లేకపోతె నేను రేపటి నుండి కాలేజి కి వెళ్ళే పరిస్తితి ఉండేది కాదు. తనకి కూడా నా థాంక్స్ అంకుల్.” అన్నది. మా నాన్నగారి ముఖం అప్పుడు కొంచెం ప్రశాంతంగా కనబడింది. ఇంత వరకు నేనే గొడవ పడ్డానేమో అని ఆయన అనుకోని ఉండవచ్చు. తరువాత మేము హాస్పిటల్ దగ్గరకు వెళ్ళాము. అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తరువాత నేను బయటకు వచ్చాను. మా నాన్నగారు ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఎవరా అని వింటుంటే వినీష్ వాళ్ళ నాన్న ఉన్న పార్టీ జనరల్ సెక్రెటరీ అని అర్ధం అయ్యింది. సోమరాజుని వెంటనే పార్టీ నుండి సస్పెండు చేస్తున్నట్లు ఆ జనరల్ సెక్రెటరీ చెప్పాడు. మేము మళ్ళీ కారులో కూర్చున్నాము. “హరీ, ఎలా ఉంది ఇప్పుడు?” నాన్న అడిగారు. “పరవాలేదు నాన్నా. ప్రాబ్లెం లేదు.” అన్నాను. అయినా నా దెబ్బలు నొప్పి పెడుతున్నాయి. వళ్ళంతా హూనం అయినట్లు ఉంది. ఎముకలు నలిగిపోయాయి. పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు. బహుసా ఒక రెండు గంటల తర్వాత కొంచెం రిలీఫ్ ఉండవచ్చు. కారులో వెళుతుండగా “చూడు హరీ, మనం శత్రువులను పెంచుకోకూడదు. అప్పుడే మనం ఈ ప్రాంతంలో అజమాయిషీ చెయ్యగలం. ఒక్కో సారి చిన్న పాము కూడా మనిషిని చంపగలదు. అందువల్ల మనం చాలా జాగ్రతగా ఉండాలి. ఈ సారి ఏమైనా ప్రాబ్లెం వస్తే నాకు చెప్పు. నేను చూసుకుంటాను. నువ్వు చిన్న పిల్లవాడివి. కొన్ని విషయాలు అర్ధం అయ్యి అర్ధం కానట్లు ఉంటాయి. అర్ధం అయ్యాయని మాత్రం అనుకోవద్దు. ఆ సోమరాజు చాలా డేంజరస్. వాడి సంగతి నేను చూసుకుంటాను. రేపటి నుండి నువ్వు కారులోనే వెళ్ళు. నీతో పాటు సూరీడు రోజు వస్తాడు. అర్ధం అయ్యిందా?” అన్నారు. జరిగినదంతా చాలా పెద్ద గొడవ కావడం తో నేను వద్దనకుండా “అలాగే నాన్నా” అన్నాను. ఆయన ఆప్యాయంగా నా తలను రుద్దారు. ఆయన కళ్ళల్లో చిన్న కన్నీరు. కొడుకుని ఆ పరిస్తితిలో ఆయన ఎప్పుడు చూడలేదు మరి.

ఇంటికి వచ్చిన తరువాత అమ్మ చాలా కంగారు పడింది నా పరిస్తితి చూసి. నేను “పరవాలేదు అమ్మా నువ్వు కంగారు పడక. చిన్న దెబ్బెనులే” అన్నాను. సుందరి కూడా చాలా బాధ పడింది. జరిగిన విషయం మీడియాలో రాకుండా మా నాన్నగారు జాగ్రత పడ్డారు. నేను నా రూం కి వెళ్లాను. అమ్మ, సుందరి నా రూం కి వచ్చారు. సుందరి వేడి నీళ్ళు తెచ్చింది. “హరీ, సుందరి నీకు కాపడం పెడుతుంది. కొంచెం నొప్పి ఉంటుంది కానీ వెంటనే నీ దెబ్బలు తగ్గుతాయి” అన్నది అమ్మ. “సరేనమ్మా” అన్నాను.

8 Comments

  1. Awesome bro story mathram eager wait chestunna next part kosam thondara ga upload chyndi plzzz

  2. Very very nice. Pls keep continue.
    Donot break. Do not stop.
    Very sexy. I love it.

  3. Next part please

  4. Story s ni madyalo apadam maha papam bro

  5. Update next part broo it’s so sexy…..

  6. Bro your so smart bro,,,storie is so great and super…please bro next part write fastly

Comments are closed.