రాములు ఆటోగ్రాఫ్ – 41 107

ప్రసాద్ : సరె…ఆ విషయం వదిలేయండి సార్….నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు…ఆ సర్టిఫికేట్ ఇప్పుడే తెప్పిస్తాను…(అంటూ ఎవరికో ఫోన్ చేసి రాము వివరాలు మొత్తం చెప్పి సర్టిఫికేట్ ఆఫీస్ కి పంపించమని చెప్పి ఫోన్ పెట్టేసి…రాము వైపు చూసి) సార్….గంటలో సర్టిఫికేట్ వచ్చేసుద్ది….మీరు ఫ్రీ అవండి…
రాము : థాంక్స్ ప్రసాద్….
ప్రసాద్ : అవన్నీ మన మధ్య ఎందుకు సార్….మనం కేసు చూద్దాం పదండి….
*******
తరువాత రోజు మానస ఒక షాపింగ్ మాల్ లో తనకు కావలసినవి తీసుకుని బిల్ వేయిస్తున్నది.
అంతలో ఒకతను వచ్చి తను తీసుకున్నవాటికి బిల్ వేయిస్తున్నాడు.
ఇద్దరూ ఒకేసారి బిల్ పేచేసి వస్తుంటే….అతను మానస వైపు చూసి, “మిమ్మల్ని ఎక్కడో చూసినట్టున్నది…మీరు స్టూడెంటా,” అనడిగాడు.
దాంతో మానస రొటీన్ డైలాగ్ వినీ వినీ బోర్ కొట్టినట్టు అతని వైపు చూసింది.

మానస చూపు లోని భావం అర్ధమయిన ఆయన వెంటనే, “ఓహ్…నన్ను తప్పుగా అనుకోవద్దు…నిజంగానే చూసినట్టు అనిపించింది…అందుకే అడిగాను…” అన్నాడు.
ఆయన ఆమాట అనగానే మానస చిన్నగా నవ్వుతూ, “థాంక్స్….కాని నేను డాక్టర్ ని….సైక్రియాటిస్ట్ ని,” అన్నది.
“అవునా…నేను కూడా సైకాలజీ చదివాను…దాని తరువాత బిజినెస్ మేనేజ్ మెంట్….బిజినెస్ అంటూ లైఫ్ గడిచిపోతున్నది,” అంటూ అతను తన జేబులోని విజిటింగ్ కార్డ్ తీస్తూ, “నా పేరు సతీష్…..” అంటూ ఇంకా ఏదో చెప్పబోతుండగా….మానస అతన్ని మధ్యలోనే ఆపుతూ….
మానస : తెలుసు…మీరు ఎవరో కూడా నాకు తెలుసు…మీరు మోటివేషనల్ స్పీచెస్ ఇస్తుంటారు కదా….
సతీష్ : అవునా….నేను పరిచయం చేసుకోకుండానే…నేను ఎదుటి వాళ్ళకు పాపులర్ అయ్యేంత ఎదిగానని నాకు అసలు తెలియదు….(అంటూ సంతోషంగా నవ్వాడు.)

మానస : కాని నేను చెప్పిన దాన్ని బట్టి అలా అనుకోకండి…నేను కూడా రిలేటడ్ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి…మీ గురించి తెలుసుకున్నాను….

సతీష్ : కరెక్ట్ చెబుతున్నారు….మరి నా క్లాసుకి ఒకసారి రావచ్చు కదా….
మానస : ఒకసారి వచ్చాను…కాని మీ క్లాసుల మీద నాకు నమ్మకం లేదు…స్పీచెస్ అనేవి బూస్ట్ లాగా పని చేస్తాయి…అంతే కాని లైఫ్ ని మార్చేయవని నా నమ్మకం….
సతీష్ : అవునా….సరె….మీ నమ్మకం మీద….నేను వస్తాను…(అంటూ అక్కడ నుండి బయలుదేరాడు.)
మానస : సార్….ఒక్క నిముషం….(అంటూ అతని దగ్గరకు వచ్చి) సారీ….అఫెండ్ అవకండి…నేను నా అభిప్రాయం చెప్పాను అంతే….అది తప్పు కూడా అయి ఉండొచ్చు….

సతీష్ ఒక్కసారి మానస వైపు కింద నుండి పైదాకా చూసి, “సరె….బై,” అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
మానస చిన్నగా నవ్వుకుంటూ షాపింగ్ మాల్ లోనుండి బయటకు వచ్చింది.
అప్పుడే రాము ఒక క్రిమినల్ ని పట్టుకుని కొడుతూ కాలర్ పట్టుకుని తన కార్ దగ్గరకు తీసుకెళ్తున్నాడు.
రాము అతన్ని కార్లోకి తోసి డోర్ వేసాడు….ఆ క్రిమినల్ కి రెండు వైపులా ఇద్దరు కానిస్టేబుల్స్ కూర్చున్నారు.
కాని అప్పుడే షాపింగ్ మాల్ లోనుండి బయటకు వచ్చి తనను చూస్తున్న మానసను మాత్రం రాము చూడలేదు.
రాము కార్లో కూర్చోగానే డ్రైవర్ కార్ అక్కడ నుండి పోనిచ్చాడు.
రాము డ్యూటీలో జాయిన్ అవడం గమనించిన మానస తన కారు తీసుకుని రాము కారుని ఫాలో అవడం మొదలుపెట్టింది.
రాము కారు వెళ్తుంటే లోపల ఉన్న క్రిమినల్ రాముని బ్రతిమలాడుతూ….
క్రిమినల్ : సార్….ఆరోజు నా వెంటబడ్డారు…వేరే ఎవరో మిమ్మల్ని చంపాలని ట్రై చేసారు….
వాడు ఆ మాట అనగానే రాము నీకెలా తెలుసురా అన్నట్టు అతని వైపు చూసాడు.
క్రిమినల్ : సార్ తరువాత మీ వాళ్ళు నన్ను పట్టుకుని నాలుగు రోజులు కుమ్మేసారు…అప్పుడు తెలిసింది సార్…అది మనసులో పెట్టుకుని నన్ను ఎన్ కౌంటర్ చేయకండిసార్…..
ప్రసాద్ : అబ్బా….నిన్ను అంత ఈజిగా ఎలా వదిలేస్తాంరా….ఈ సారి నీ కోటింగ్ తగ్గిస్తాలే….సార్ కోటా సారే ఇస్తారు….
ప్రసాద్ అలా అనగానే రాము చిన్నగా నవ్వుతూ ఏదో చెప్పబోతుండగా తన ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేసి….
రాము : సార్….చెప్పండి….(ఫోన్ లొ కమీషనర్ చెప్పింది వింటూ….) అలాగే సార్….నేను ఇప్పుడే వెళ్తాను….(అంటూ డ్రైవర్ వైపు తిరిగి వెళ్ళాల్సిన అడ్రస్ చెప్పాడు.)

వాళ్ళు అక్కడకు చేరుకునే సరికి పది నిముషాలు పట్టింది.
పెద్ద బంగళా ముందు పోలీసులు తమ పని తాము చేసుకుంటున్నారు.
రాము, ప్రసాద్ ఇద్దరూ కారు దిగి బంగళా లోకి వెళ్ళారు.
అక్కడ ఉన్న SI వీళ్ళిద్దరూ రావడం చూసి దగ్గరకు వచ్చి సెల్యూట్ చేసాడు.
రాము : మర్డరే కదా….suiside లాంటి confuse ఏం లేదు కదా….
యస్సై : లేదు సార్….మర్డరే….మర్డర్ అయింది టీవి సీరియల్ ఆర్టిస్ట్….షూటింగ్ అయిపోయిన తరువాత బాగా లేట్ నైట్ వచ్చింది….ఆమెతో పాటు పర్సనల్ మేకప్ మేన్ మాత్రమే ఉన్నారు…ఫింగర్ ప్రింట్లని టెస్ట్ కోసం లేబ్ కి పంపించాము…కాని ఇప్పుడు అతని నెంబర్ నాట్ రీచబుల్ వస్తుంది….రేప్ చేసినట్టు ఎవిడెన్స్ లు ఉన్నాయి సార్….

1 Comment

  1. Project Z cinema story bagane add Chesaavu Bayya

Comments are closed.