రాములు ఆటోగ్రాఫ్ – 41 107

లోపల రాము నిద్ర పోకుండా బెడ్ మీద కూర్చుని తల వెనక్కు గోడకు చిన్నగా కొడుతూ రెండు చేతుల వేళ్ళతో తలకు రెండు వైపులా కణతలు నొక్కుకోవడం చూసి ప్రసాద్, తులసి ఇద్దరూ బిత్తరపోయారు.

అంతలో మానస కూడా పైకి రావడంతో ప్రసాద్ వెనక్కు తిరిగి మానస వైపు చూసి, “రాము సార్…చాలా మంచివాడు… డిపార్ట్మెంట్లో కొత్తగా చేరారు….చాలా తెలివైనవారు మేడమ్….కొంచెం జాగ్రత్తగా చూడండి మేడమ్,” అంటూ మానస బెడ్రూమ్ లోకి వెళ్లడానికి దారి ఇచ్చాడు.
దాంతో మాసన అలాగే అన్నట్టు తల ఊపుతూ బెడ్రూమ్ తలుపు తీసుకుని లోపలికి వచ్చి తిరిగి తలుపు వేస్తూ ప్రసాద్ వైపు చూసి, “ఒక్క గంట వరకు రాముని డిస్ట్రబ్ చెయ్యొద్దు,” అంటూ తలుపు వేసింది.

ప్రసాద్, తులసి ఇద్దరూ సరె అని అక్కడ నుండి కిందకు వచ్చారు.
కిందకు వచ్చిన ప్రసాద్ టీవి చూస్తుంటే ఫోన్ మోగింది.
ప్రసాద్ చిరాగ్గా ఫోన్ తీసుకుంటూ, “ఈ టైంలో ఎవరు ఫోన్ చేసి ఉంటారు,” అని అనుకుంటూ కమీషనర్ ఫోన్ చేస్తుండే సరికి వెంటనే లిఫ్ట్ చేసి, “హలో సార్…” అన్నాడు.
కమీషనర్ : ప్రసాద్….ఎక్కడున్నావు….
ప్రసాద్ : ఇక్కడే స్టేషన్ దగ్గరలో ఉన్నాను సార్….రాము సార్ ఒక లీడ్ ఇచ్చి ఎంక్వైరీ చెయ్యమంటే చేస్తున్నా….
కమీషనర్ : సరె….అది అయిపోయిన తరువాత నా ఆఫీస్‍కి వచ్చేయ్….
ప్రసాద్ : అలాగే సార్…ఇప్పుడే బయలుదేరుతున్నా….(అంటూ ఫోన్ కట్ చేసి కిచెన్లో పని చేసుకుంటున్న తులసిని పిలిచి) తులసీ…నేను బయటకు వెళ్తున్నా,” అన్నాడు.
తులసి : అదేంటి రాము గారు లోపల ఉన్నారు కదా….ఎలా….
ప్రసాద్ : కమీషనర్ గారు ఫోన్ చేసారు….అర్జంట్గా వెళ్ళాలి…రాము సార్తో పాటు డాక్టర్ మానస కూడా ఉన్నారు కదా…భయం లేదులే….ఏమైనా అవసరం అయితే పిలుస్తారు….జాగ్రత్తగా చూసుకో…..
తులసి : సరె….నీకు ఎప్పుడూ కమీషనర్ గారు ఫోన్ చేయరు కదా…ఇప్పుడేంటి కొత్తగా….
ప్రసాద్ : నేను రాము సార్ సబార్డినేట్గా ఉంటున్నా కదా….అప్పుడు నేను రాము సార్‍కి, కమీషనర్ గారికి రిపోర్ట్ చేయాలి….అంటే ఎవరు అందుబాటులో ఉంటే వాళ్లకు….
తులసి : సరె….తొందరగా వచ్చేయండి….

ప్రసాద్ అలాగే అని తల ఊపి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
(ఇక్కడ బెడ్‍రూమ్‍లో)
మానస తలుపు గడి వేస్తూ వెనక్కు తిరిగి రాము వైపు చూసింది.
అప్పటికే రాము ఆమె వైపు ఎందుకు వచ్చింది అన్నట్టు చూస్తున్నాడు.
మానస చిన్నగా రాము దగ్గరకు వచ్చి తన హ్యాండ్‍బ్యాగ్‍ని అక్కడ టీపాయ్ మీద పెట్టి బెడ్ మీద రాము పక్కనే కూర్చున్నది.
రాము : ఏంటి….ఇక్కడకు వచ్చావు…..
మానస : చూడు రాము….నీ కండీషన్ నీకు అర్ధం కావడం లేదు…
రాము : నాకు బాగానే ఉన్నది…కాకపోతే కొంచెం మైకంగా ఉన్నది….
మానస : అదే నేనూ చెబుతున్నది….నువ్వు ట్రీట్మెంట్ తీసుకోపోతే ఈ స్ట్రెస్ ఇలాగే ఎక్కువయ్యి బ్రెయిన్లో నరాలు దెబ్బ తింటాయి….
రాము : నాకు ట్రీట్మెంట్ ఏమీ అవసరం లేదు….
ఆ మాట వినగానే మానసకు ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చింది.

దాంతో మానస కోపంగా రాము వైపు చూసి అతని చెంప మీద గట్టిగా చేత్తో చాచి కొట్టింది.
మానస అలా కొడుతుందని ఊహించకపోయే సరికి రాము ఆమె వైపు ఎందుకు కొట్టావు అన్నట్టు చూసాడు.
రాము అలా తన వైపు చూడగానే మానసకు వెంటనే జాలి వేసి దగ్గరకు లాక్కుని కొట్టిన చెంప మీద ముద్దు పెట్టుకుని చేత్తో నిమురుతూ పక్కనే ఉన్న హ్యాండ్బ్యాగ్ లోనుండి ఏదో మెడిసన్ తీసుకుని సిరెంజ్ లోకి ఎక్కించి, “రామూ…ముందు ఈ ఇంజక్షన్ వేయనివ్వు….తరువాత ప్రశాంతంగా మాట్లాడుకుందాం….మూర్ఖంగా ప్రవర్తించకు…నా మాట విను,” అంటూ రాము చెయ్యి పట్టుకుని లాగి మోచేయికి కొద్దిగా పైన ఇంజక్షన్ చేసింది.
ఇంజక్షన్ చేసిన తరువాత మానస బెడ్ మీద నుండి లేచి రాముని వెనక్కు వంచుతూ బెడ్ మీద పడుకోబెట్టింది.
రాము అలాగే కళ్ళు మూసుకుని పడుకున్నాడు.
మానస తన చేతిలో ఉన్న సిరెంజ్‍ని పక్కన డస్ట్ బిన్‍లో పడేసి రాము వైపు చూసి నవ్వుతూ దగ్గరకు వచ్చి పక్కనే పడుకుని ఛాతీ మీద తల పెట్టి చేత్తో షర్ట్ బటన్స్ విప్పేసి ఛాతీ మీద పొట్ట మీద నిమురుతూ ఉన్నది.
ఐదు నిముషాలకు రాము చిన్నగా కళ్ళు తెరిచి మానస వైపు చూసి తన చేతిని వీపు మీదగా వేసి దగ్గరకు లాక్కున్నాడు.
రాము చేతి తన మీద పడగానే మానస తల ఎత్తి అతని వైపు చూసి చిన్నగా నవ్వింది.

మానస : ఇప్పుడు ఎలా ఉన్నది…..
రాము : పర్లేదు….

1 Comment

  1. Project Z cinema story bagane add Chesaavu Bayya

Comments are closed.