రాములు ఆటోగ్రాఫ్ – 41 107

రాము : ప్రెస్ కి న్యూస్ ఏమైనా లీక్ అయిందా….
యస్సై : లేదు సార్….ఎక్కడా లీక్ అవలేదు సార్….కాని D.I.G సార్ నుండి కాల్ వచ్చింది….
రాము : D.I.G నుండా….
యస్సై : అవును సార్….
రాము : అంత పెద్ద హీరోయినా….
యస్సై : ప్రస్తుతం లీడింగ్ లో ఉన్నది సార్….పేరు హంస….
అలా మాట్లాడుకుంటూ ముగ్గురూ లోపలికి వెళ్లారు.
రాము, ప్రసాద్ మర్డర్ స్పాట్ లోకి వెళ్లారు.
ఇద్దరూ చేతులకు గ్లౌస్ లు వేసుకుని అక్కడ అంతా క్లూస్ ఏమైన దొరుకుతాయేమో అని చూస్తున్నారు.
రాము మెట్లు ఎక్కుతూ అక్కడ ఒకతను మోర్ సిగిరెట్ పీకను తీసి కవర్ లో వేస్తుండటం చూడగానే రాముకి ఇంతకు ముందు జిమ్ ట్రైనర్ అశోక్ కూడా మోర్ సిగిరెట్ తాగడం గుర్తుకొచ్చింది.
దాంతో రాము ఆలోచిస్తూ చిన్నగా మెట్లు ఎక్కుతూ మర్డర్ జరిగిన రూమ్ లోకి వెళ్ళగానే అక్కడ గోడ మీద రక్తంతో చేతులు తుడిచినట్టు రక్తం మరకలు కనిపించాయి.
మళ్ళీ రాముకి ఇంతకు ముందు అశోక్ కూడా హత్య చేసి రక్తంతో తడిచిన తన చేతులను గోడకు తుడవడం గుర్తుకొచ్చింది.
ఆ హత్య కూడా దాదాపుగా అలాగే జరిగినట్టు అనిపించడంతో లోపలికి వచ్చిన రాముకి అక్కడ ఉన్న వస్తువులు చిందర వందరగా పడి ఉండటంతో ఏం జరిగిందో పూర్తిగా అర్ధమైపోయింది.

హంసని రేప్ చేసిన తరువాత అతను హత్య చేసి పారిపోవడంతో….ఆమె డెడ్ బాడీని చూసిన రాముకి కళ్ళు తిరగడం మొదలయింది.
ఇంతకు ముందు ఎన్నో కేసుల్లో ఇంతకంటే ఘోరమైన డెడ్ బాడీలను చూసినా చలించని రాము…తలకు దెబ్బ తగిలిన దగ్గర నుండీ డెడ్ బాడీని చూడగానే తల తిరుగుతున్నట్టు అనిపించి వెంటనే అక్కడ నుండి బయటకు వచ్చేసాడు.
దాంతో ప్రసాద్ అక్కడ ఉండి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయించాడు.
అక్కడ నుండి రాము తను అప్పుడప్పుడు రెస్ట్ తీసుకునే ఫ్లాట్ దగ్గరకు వచ్చి వాచ్‍మెన్ దగ్గర తన ఫ్లాట్ కీ తీసుకుని లోపలికి వెళ్ళి డ్రస్ మార్చుకుని కళ్ళు మూసుకుని పడుకున్నాడు.
అలా పడుకున్న కొద్దిసేపటికి కాలింగ్ బెల్ మోగిన సౌండ్ వినిపించడంతో రాము వెంటనే అలర్ట్ అయ్యి బెడ్ మీద నుండి కిందకు దిగి చిన్నగా మెయిన్ డోర్ దగ్గరకు వెళ్ళి తలుపు తీసి ఎవరా అని చూసాడు.
ఎదురుగా మానస నిల్చుని ఉండటంతో రాము నిజమా కాదా అన్నట్టు కళ్ళు నలుపుకుంటూ చూస్తున్నాడు.

దాంతో మానసకి రాము డౌట్ అర్ధమయ్యి, “అంతలా కళ్ళు నలుపుకుని చూడక్కర్లేదు…నిజంగానే వచ్చాను,” అంటూ చిన్నగా లోపలికి వస్తూ, “షాపింగ్ మాల్ దగ్గర నిన్ను చూసి ఫాలో అవుతూ ఇక్కడి దాకా వచ్చాను…” అన్నది.

కాని రాము మాత్రం మానస మాటలు లెక్కచేయకుండా లోపలికి వచ్చి తన యూనిఫామ్ వేసుకుని బయటకు వెళ్లడానికి రెడీ అవుతున్నాడు.
సర్టిఫికేట్ కోసం మానస దగ్గరకు ఆమె సర్టిఫికేట్ ఇవ్వలేదని రాముకి మానస మీద చాలా కోపంగా ఉన్నది.
అది గమనించిన మానస అతనికి సంజాయిషీ ఇవ్వడానికి రాము దగ్గరకు వెళ్తూ, “రామూ….నా మాట విను…నీకు ఇప్పుడు నా హెల్ప్ తప్పనిసరిగా కావాలి…” అంటూ రాము చెయ్యి పట్టుకుని ఆపడానికి ట్రై చేస్తున్నది.
కాని రాము ఆమె మాటలు వినే పొజిషన్‍లో లేకపోయే సరికి మానస చేతిని వదిలించుకుని లాగి చెంప మీద గట్టిగా కొట్టాడు.

దాంతో మానస రాము చేతిని వదిలి కింద పడిపోయింది.
అప్పుడే రాము కోసం వచ్చిన ప్రసాద్ మొదటిసారి రాము కోపంగా మానసని కొట్టడం చూసి బిత్తరపోయాడు.
ప్రసాద్ వెంటనే రాము దగ్గరకు వచ్చి, “సార్….సార్….ఏంటి…ఆ కోపం” అంటూ ఆపడానికి ట్రై చేసాడు.
కాని రాము మాత్రం ప్రసాద్ ని కూడా పట్టించుకోకుండా అక్కడ నుండి బయటకు వచ్చేసాడు.
మానస మాత్రం దెబ్బ గట్టిగా తగలడంతో కళ్ళెమ్మటి నీళ్ళు కారుతుండగా చేతిని చెంప మీద పెట్టుకుని రుద్దుకుంటూ రాము వైపు చూస్తున్నది.
ప్రసాద్ కూడా ఒక్కసారి మానస వైపు చూసి వెంటనే, “సార్…ఏమయింది సార్….ఆగండి….ఒక్కసారి ఆగండి సార్,” అంటూ రాము వెనకాలే నడుస్తున్నాడు.
రాము చాలా చిరాగ్గా….డిస్ట్రబ్‍డ్ గా ఉండే సరికి ఏమీ ఆలోచించలేకపోతున్నాడు.
ప్రసాద్ వేగంగా నడుచుకుంటూ రాము ముందుకు వచ్చి అతన్ని ఆపుతూ, “సార్…ప్లీజ్ సార్….అగండి…ఏమయింది,” అంటూ రాము కండీషన్ చూసి ఏదో అర్ధమయిన వాడిలా తల ఊపుతూ, “సార్…ప్రాబ్లం ఏం లేదు….మా ఇల్లు ఇక్కడ పక్కనే ఉన్నది…ఒక్క గంట రెస్ట్ తీసుకోండి…టెన్షన్ మొత్తం తీరిపోతుంది….బాగా అలసిపోయి కనిపిస్తున్నారు సార్,” అంటూ రాముకి సర్ది చెప్పి కారులో ఎక్కించుకుని తన ఇంటికి తీసుకెళ్ళాడు.
అలా రాము కారు ఎక్కి వెళ్తుంటే మానస కిందకు వచ్చి రాము వెళ్తున్న వైపే చూస్తు నిల్చున్నది.

ఇంటికి వెళ్ళిన తరువాత ప్రసాద్ కారు దిగి రాముని తన ఇంటి లోపలికి తీసుకెళ్ళాడు.
లోపలికి వెళ్లగానే తులసి వాళ్ళకు ఎదురువచ్చి రాముని పలకరిస్తూ, “రామూ….ఎలా ఉన్నారు,” అనడిగింది.
రాము సమాధానం చెప్పబోతుండగా ప్రసాద్ మధ్యలో కల్పించుకుని, “సరె…సరె….అవన్నీ తరువాత మాట్లాడుకుందాం ….సార్ కొంచెం రెస్ట్ తీసుకుంటారు,” అన్నాడు.
దాంతో తులసి కూడా కంగారుగా, “ఏమయింది రాముకి,” అంటూ దగ్గరకు వచ్చి రాము నుదురు మీద చెయ్యి పెట్టి చూస్తున్నది.
రాము చిన్నగా నవ్వుతూ, “అదేం లేదు తులసి…కొంచెం టెన్షన్‍గా ఉన్నది…తల తిరుగుతున్నట్టు ఉన్నది,” అన్నాడు.
“అయ్యో….సరె…నువ్వు రెస్ట్ తీసుకో….నేను టీ చేసి పంపిస్తాను,” అంటూ తులసి కంగారుగా రాము చెయ్యి పట్టుకుని బెడ్ రూమ్ లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టింది.
అంతలో ప్రసాద్ కూడా బెడ్‍రూమ్ లోకి వచ్చి రాము సరిగ్గా పడుకోవడంలో హెల్ప్ చేస్తున్నాడు.
రాము పడుకున్న తరువాత తులసి కాళ్ళ దగ్గరకు వచ్చి షూస్ విప్పేసి కింద పెట్టేసి దుప్పటి కప్పి, “రామూ…లెమన్ వాటర్ తీసుకువస్తాను….తల తిరగడం తగ్గుద్ది,” అంటూ అక్కడ నుండి బయటకు రాబోయింది.
కాని రాము వెంటనే తులసి చేయి పట్టుకుని ఆపుతూ, “వద్దు తులసి…ఒక్క గంట నిద్ర పోతే అదే తగ్గిపోతుంది… నువ్వు కంగారుపడకు,” అన్నాడు.
“సరె….రామూ….రెస్ట్ తీసుకో,” అంటూ తులసి ప్రసాద్ వైపు చూస్తూ, “మీరు కూడా బయటకు పదండి…” అంటూ బెడ్‍రూమ్ లోనుండి బయటకు వచ్చింది.

ప్రసాద్ కూడా తులసి వెనకాలే బయటకు వచ్చి తలుపు వేసి హాల్లోకి వచ్చి కూర్చున్నాడు.
వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తరువాత రాము కళ్ళు మూసుకుని పడుకుందామని ట్రై చేస్తున్నాడు.
కాని నిద్ర పట్టక అటూ ఇటూ దొర్లుతున్నాడు….కళ్ళ ముందు ఏవో దృశ్యాలు మసకమసకగా కనిపిస్తూ రాముని కుదురుగా ఉండనివ్వడం లేదు.
కింద తులసి వంట పనిలో పడిపోయింది.
ప్రసాద్ టీవి ఆన్ చేసి న్యూస్ పెట్టుకుని చూస్తున్నాడు.
పది నిముషాలు గడిచేసరికి కాలింగ్ బెల్ మోగడంతో ప్రసాద్ తన మనసులో, “ఈ టైంలో ఎవరు వచ్చారు,” అనుకుంటూ సోఫాలో నుండి లేచి డోర్ తీసాడు.
డోర్ తీయగానే ఎదురుగా నిల్చున్న మానసని చూసి ఆశ్చర్యపోయాడు.
ప్రసాద్ అలా చూస్తుండగానే మానస లోపలికి వచ్చి, “రాము ఎక్కడున్నాడు,” అనడిగింది.
ప్రసాద్ : ఆయన్ని డ్యూటీలో జాయిన్ అవద్దని చెప్పింది మీరే కదా….
మానస : అవును….నేను చెప్పింది కరెక్టే కదా….
ప్రసాద్ ఎవరితోనో మాట్లాడుతుండటం విన్న తులసి కూడా కిచెన్ లోనుండి హాల్లోకి వచ్చింది.
మానస : నేను చెప్పినట్టు వింటే….రాముకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా….
తులసి : ఇంతకు రాము గారికి ఏమయింది….(అంటూ కంగారుగా మానస వైపు చూసింది.)
ప్రసాద్ : తులసీ….నువ్వు ఒక్క నిముషం మెదలకుండా ఉండు….రాము సార్ కి ఏమీ అవలేదు…(అంటూ రాము పడుకున్న బెడ్ రూమ్ వైపు చూసి….మళ్ళీ మానస వైపు డౌట్ గా చూసాడు.)
ప్రసాద్ చూపుని బట్టి రాము ఎక్కడ ఉన్నాడో అర్ధమయిన మానస బెడ్ రూమ్ వైపు వెళ్ళబోయింది.
కాని ప్రసాద్ ఆమెని ఆపుతూ….

1 Comment

  1. Project Z cinema story bagane add Chesaavu Bayya

Comments are closed.