రాములు ఆటోగ్రాఫ్ – Part 19 124

రాము : మరి మధ్యాహ్నం భోజనం చెయ్యొద్దా…..
రవి : భోజనం తరువాత చేద్దాంరా…..నాకు మళ్ళీ ఆమెను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉన్నది….
రాము : కాని….ఆమె ఇప్పటి వరకు ఉంటుందంటావా…..ఒకవేళ ఉంటే ఇంత పెద్ద కాలేజీలో ఎక్కడ ఉంటుందో మనకు ఎలా తెలుస్తుంది.
మహేష్ : లంచ్ టైం కాబట్టి నాకు తెలిసి ఆమె స్టాఫ్ రూంలో భోజనం చేస్తుంటుంది…..
రవి : నువ్వు చెప్పింది నిజమేరా….స్టాఫ్ రూంకి వెళ్ళి చూద్దాం పదంది….స్టాఫ్ రూమ్ లో ఏదో లెక్చరర్ ని కలవడానికి వచ్చినట్టు ఏదో ఒక సాకు చెబుదాం………..
రవి చెప్పిన దానికి రాము కూడా సరె అనడంతో ముగ్గురు కలిసి స్టాఫ్ రూమ్ వైపు నడుస్తున్నారు.
అలా స్టాఫ్ రూమ్ దగ్గరకు వెళ్తున్న వాళ్ళకు మధ్యలో రాజన్న స్టాఫ్ రూం నుండి వస్తూ కనిపించాడు.
వాళ్ళు రాజన్నని ఆపి, “అరె…రాజన్న….నీ అందమైన గర్ల్ ఫ్రండ్ ఎక్కడ….స్టాఫ్ రూంలో ఉన్నదా….పద….నువ్వు, రవి చెప్పిన దాన్ని బట్టి ఆమె ఎంత అందంగా ఉంటుందో చూద్దాం పద….” అన్నారు.
రాజన్న : మీరు కొత్తగా జాయిన్ అయిన లెక్చరర్ జరీనా గురించేనా అడిగేది….ఆమె ఇప్పుడు స్టాఫ్ రూమ్ లో లేదు….నేను ఆమెను ప్రిన్స్ పాల్ రూమ్ లోకి వెళ్తుంటే చూసా…..
రవి : అబ్బా….ఇప్పుడు ఆమెను ఎలారా చూడటం….ప్రిన్స్ పాల్ రూంలో ఉన్నదంట…
మహేష్ : ఏం ఫరవాలేదు…ఆమె బయటకు వచ్చేవరకు మనం బయటే వెయిట్ చేద్దాం….కొద్దిసేపటికి అయినా ఆమె బయటకు రావాలి కదా…అప్పుడు చూద్దాం….
రాము : ఇదీ కరెక్టే …..పదండి వెళ్దాం….

వాళ్ళు ముగ్గురు ప్రిన్స్ పాల్ రూంకి బయట కొద్ది దూరంలో నిల్చున్నారు.
రాము, మహేష్ ఇద్దరు రాజన్న, రవి జరీనా గురించి, ఆమె అందాలను గురించి అంతగా వర్ణించడం విన్న తరువాత ఎలాగైనా ముంతాజ్ను చూడాలని బాగా తహతహ లాడుతున్నారు.
కాని వాళ్ళ ముగ్గురిలో ఎవరికీ ప్రిన్స్ పాల్ రూంలోకి తొంగి చూడటానికి ధైర్యం చాలడం లేదు.
రవి : ఇప్పుడేం చేద్దాంరా…..
రాము : నువ్వు వెళ్ళి లోపలికి తొంగి చూడు….ఆమె లోపల ఉన్నదో లేదో తెలిసిపోతుంది.
రవి : అబ్బా….ఏం చెబుతున్నావురా…ప్రిన్స్ పాల్ రూంలోకి తొంగి చూడమని ఎంత బాగా చెబుతున్నావురా….అదేదో నువ్వే చూడొచ్చుకదా…నేను ఆల్రెడీ అయన బ్లాక్ లిస్ట్ లో ఉన్నాను….నీమీద ఆయనకు చాలా మంచి ఒపీనియన్ ఉన్నది…అంత పని నేను చెయ్యలేను….
రాము : అంత భయపడే బదులు చక్కగా చదవొచ్చుకదా….
మహేష్ : అబ్బా….మీరు పోట్లాడుకోవడం ఆపండిరా…మనలో ఎవరూ లోపలికి తొంగి చూడాల్సిన అవసరం లేదు…ఆమె బయటకు వచ్చేవరకు ఇక్కడే వెయిట్ చేద్దాం….సరేనా….
రవి : కాని ఆమె ఇంకా లోపల ఉన్నదో లేదో మనకు ఎలా తెలుస్తుంది….ఎంత సేపని ఇక్కడే నిల్చుంటాం…
మహేష్ : సరె….ఒక పని చేద్దాం….నేను చిన్నగా ప్రిన్స్ పాల్ రూం దగ్గరకు క్యాసువల్ గా నడుచుకుంటూ వెళ్ళినట్టు వెళ్ళి లోపలికి తొంగి చూసి వస్తాను….సరెనా….
రాము : నేను అదే కదరా చెప్పేది…..
మహేష్ : ఇక ఆపరా బాబు…చెప్పిందే చెప్పి చంపుతున్నావు….నన్ను వెళ్ళి చూడనివ్వు…..
అని మహేష్ అక్కడ నుండి కదిలి చిన్నగా నడుస్తూ లోపలికి చూడటానికి ట్రై చేస్తున్నాడు.
అలా మహేష్ ఎప్పుడైతే ప్రిన్స్ పాల్ రూం దగ్గరకు వచ్చాడో అప్పుడే రాజేష్ రూంలో నుండి బయటకు వచ్చి మహేష్ ఎదురుగా నిల్చున్నాడు.
రాజేష్ : హేయ్ మహేష్….మీరు ముగ్గురు నాతో రండి….మీతో మాట్లాడాలి…స్టాఫ్ రూమ్ లోకి రండి….
అలా రాజేష్ అనగానే వాళ్ళు ముగ్గురూ మళ్ళీ నిరాశతో ఆయన వెనకాలే ఉసూరుమంటూ స్టాఫ్ రూంకి వెళ్లారు.
“కొత్త లెక్చరర్ ని చూడటానికి ఇన్ని ట్విస్ట్ లు ఏంటిరా బాబు….ఇంత టెన్షన్ ఎప్పుడు పడలేదురా బాబు,” అంటూ రాము చిన్నగా మిగతా ఇద్దరితో అన్నాడు.
అలా ముగ్గురూ స్టాఫ్ రూంలోకి రాజేష్ తో పాటు అడుగుపెట్టారు.
రాజేష్ తన చైర్ లో కూర్చుని వాళ్ల ముగ్గురి గురించి ప్రిన్స్ పాల్ చెప్పిన మాటలు వాళ్ళకు బ్రీఫ్ గా చెప్పాడు.
రాజేష్ : సరె….చెప్పింది విన్నారు కదా…ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి….రాము గురించి మాకెవ్వరికి భయం లేదు…మా ఆలోచనలు అన్నీ మీ ఇద్దరి(మహేష్, అనంద్) గురించే….కాబట్టి మీరు ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే మన కాలేజీకి చాలా చెడ్డ పేరు వస్తుంది….కాబట్టి మీ ఇద్దరు కొంచెం ఎక్కువ సేపు శ్రద్ధగా చదవాల్సిఉంటుంది.
రవి : లేదు సారు…మేము ఇద్దరం బాగానే చదువుతున్నాం….

రవి బాగా చదువుతున్నాం అనగానే అక్కడ అందరు ఒక్కసారిగా నవ్వారు….వాళ్ళందరితో పాటు రాము, మహేష్ కూడా వాళ్లకు వస్తున్న నవ్వు ఆపుకోలేక నవ్వారు.
రాజేష్ : హా….హా….మీ ఇద్దరు ఎంత బాగా చదువుతున్నారో ఇక్కడ అందరికి బాగా తెలుసు….అందుకని మీ ఇద్దరు బాగా చదువుతున్నారని మాకు కధలు చెప్పొద్దు…..
మహేష్ : ఇప్పుడు మమ్మల్ని ఏం చెయ్యమంటారు సార్……
రాజేష్ : అవును….ఇప్పుడు మీరు బాగా చదవాలి…మీ ఇద్దరు ఫెయిల్ అవడం వలన కాలేజీకి చెడ్డ పేరు వస్తుంది….మీ ఇద్దరి వల్ల మొత్తం కాలేజీకి చెడ్డ పేరు రావడం మాకెవ్వరికీ ఇష్టం లేదు….అర్ధం అయిందా……
రాము : నేను తప్పకుండా ప్రయత్నిస్తాను సార్…..
రాజేష్ : నీ గురించి మాకెవ్వరికి సందేహం లేదు రాము….నీ గురించి మా అందరికి బాగా తెలుసు….వీళ్లతో తిరిగి నువ్వు ఎక్కడ నీ future పాడు చేసుకుంటావో అని మా భయం….మన మేనేజ్ మెంట్ ఒక కొత్త లెక్చరర్ ని అపాయింట్ చేసారు….ఆమెతో మీరు మీ సమస్యల గురించి చెబితే….ఆమె తనకు చేతనయింత వరకు మీకు హెల్ప్ చేస్తుంది….
రాము : ఎవరు సార్ ఆమె కొత్తగా జాయిన్ అయ్యారా….
అని ధైర్యం చేసి రాజేష్ ని అడిగాడు.
రాజేష్ : అవును రాము….సైక్రియాటిస్ట్….ఆమె సైకాలజీలో చాలా తెలివైనది…ఆ లెక్చరర్ పేరు జరీనా….
ఆమె పేరు వినగానే ముగ్గురూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు….వాళ్ళ మనసులు ఆనందంతో నిండిపోయాయి.
రాజేష్ : అందుకని మీరు ముగ్గురు ఆమె తప్పకుండా ఆమె క్లాసులు అటెండ్ అవ్వాల్సిందె….రాముకి అవసరం లేదు…కాని మీ ఇద్దరు ఎప్పుడైనా అతని మనసు మార్చేస్తారు….అందుకని రాము కూడా మీతో పాటు క్లాసులు అటెండ్ అవ్వాల్సిందే…ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న పోర్షన్ మొత్తం కంప్లీట్ చేయాలి….అర్ధమయిందా…..
మహేష్ : అలాగే సార్….మీరు నిజంగా చాలా మంచి న్యూస్ చెప్పారు….మాక్కూడా చాలా ఆనందంగా ఉన్నది….మేము తప్పకుండా కొత్త లెక్చరర్ క్లాసులు అటెండ్ అవుతాము…..
రాము : అవును సార్….actual గా రాజన్న మాకు కొత్త లెక్చరర్ ఈ విషయమై జాయిన్ అయ్యారని చెప్పాడు….అందుకే ఆమెని ఒకసారి కలిసి విష్ చేద్దామని స్టాఫ్ రూం దగ్గరకు వచ్చాము….ఆమె వలన మాకు స్టడీస్ లో చాలా హెల్ప్ అవుతుంది సార్….
రవి : అవును సార్….స్పెషల్ క్లాసుకు అరగంట సేపు కాకుండా….రెండు గంటలకు పెంచండి సార్…అరగంట అనేది డౌట్లు తీర్చుకోవడానికి చాలా తక్కువ టైం సార్…..సరిపోదు.
ఆ మాట వినగానే పక్కనే ఉన్న మహేష్ వెంటనే రవి కాలు మీద తొక్కి, “ఎక్కువ మాట్లాడొద్దు,” అన్నట్టు సైగ చేసాడు.
అలా మహేష్ తన కాలు తొక్కగానే రవి బాధతో చిన్నగా అరిచాడు.
రాజేష్ : ఏమయింది…..ఎందుకలా అరిచావు…
రవి : ఏం లేదు సార్….నా కాలు టేబుల్ కి తగిలింది….అందుకే……

కాని రాజేష్ మాత్రం కొత్త లెక్చరర్ విషయంలో వీళ్ళు ముగ్గురు ఎందుకంత interest చూపిస్తున్నారో అర్ధం కావడం లేదు.
ఎప్పుడు చదువుకు దూరంగా ఉండే రవి, మహేష్ ఇప్పుడు చదవడానికి బాగా శ్రధ్ధ చూపిస్తుండటం అతనికి చాలా ఆశ్చర్యంగా ఉన్నది….కాని వాళ్ళు చదవడానికి బాగా ఇంట్రెస్ట్ చూపించేసరికి కొంచెం సంతోషంగా ఉన్నాడు.
రాజేష్ : సరె….మీరు చెప్పింది ఆలోచించి ఒక షెడ్యూల్ తయారు చేస్తాను….దాన్ని మీరు ఫాలో అవండి….కాని మీరు మాత్రం గట్టిగా చదవాలి….రాము గురించి మాకు భయం లేదు….మీ ఇద్దరు మాత్రం కనీసం ఫస్ట్ క్లాస్ తెచ్చుకోకపోయినా…..పాస్ మాత్రం కావాలి….
మహేష్ : తప్పకుండా సార్….
రాజేష్ : సరె….ఇక మీరు వెళ్ళండి….
దాంతో వాళ్ళు ముగ్గురూ స్టాఫ్ రూమ్ నుండి బయటకు వచ్చి….రేపటినుండి కొత్త లెక్చరర్ తో క్లాసులు మొదలవుతున్నాయన్న ఊహ రాగానే ఆనందంతో ముగ్గురు ఒకరితో ఒకరు హైఫై కొట్టుకున్నారు.
మహేష్ : ముందు ఆమె ఇంకా ప్రిన్స్ పాల్ రూంలోనే ఉన్నదా…లేదా చూద్దాం పదండి…
అనగానే ముగ్గురు ప్రిన్స్ పాల్ గది వైపు నడవడం మొదలుపెట్టారు.

Updated: June 16, 2021 — 3:18 am