ప్రేమ కథలు – Climax 91

ఆ డాక్టర్ నీ వినయ్ తో చూసిన తరువాత ముగ్గురికి పై ప్రాణాలు పైనే పోయాయి ఆ తర్వాత ఆ డాక్టర్ కీ ఎమర్జెన్సీ ఫోన్ రావడంతో తను వెళ్లిపోయాడు ఆ తర్వాత వినయ్ రామ్ దగ్గరికి వచ్చి విద్య పక్క రూమ్ లో ఉన్న వేరే అమ్మాయిని చూసి తను డాక్టర్ గర్ల్ ఫ్రెండ్ ఏమో అనుకోని “రేయ్ బావ చాలా లక్కీ రా ఆ ముసలోడు ఈ వయసులో కూడా గర్ల్ ఫ్రెండ్ నీ ఉంచుకున్నాడు” అని చెప్పి తన చేతిలో ఉన్న స్నాక్స్ ట్రే రామ్ చేతిలో పెట్టి విద్య నీ చూడడానికి లోపలికి వెళ్ళాడు అప్పుడు బయట ముగ్గురు ఊపిరి పీల్చుకున్నారు కాకపోతే అటం బాంబ్ లోపలే ఉంది అని వాళ్ళకి తెలియదు విద్య హ్యాండ్ బ్యాగ్ అక్కడ టేబుల్ మీద పెట్టారు దాంట్లో ఉన్న డైరీ వినయ్ నీ ఆకర్షించింది దాంతో వినయ్ ఆ డైరీ చేతిలోకి తీసుకుని చూశాడు అందులో వినయ్ బొమ్మ కనిపించింది అది చూసి షాక్ అయ్యాడు వినయ్ దాని పక్కన ఇలా రాసి ఉంది “నేస్తం కావు, ప్రియుడివి కాదు కానీ గుండెల్లో కూర్చుని ఉన్నావు ఎప్పుడు ఎలా నాలోకి వచ్చావో తెలియదు నువ్వు ఎవరైనా సరే నేను నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటా” దాంతో వినయ్ కీ ఒక విషయం అర్థం అయ్యింది వాళ్ళకి పెళ్లి అవ్వడానికి ముందు నుంచే విద్యకి తను ఎవరో తెలుసు కాబట్టి తనని పెళ్ళి చేసుకుంది అనితరువాత డైరీ లో చదవడం మొదలు పెట్టాడు.

“ఎంత దెగ్గర అవుదాం అని చూసిన నువ్వు నాకూ దూరం గానే ఉంటున్నావు అందుకే నిన్నే నా వైపు తిప్పుకుందాం అని నిర్ణయించుకున్న” అని రాసి ఉంది దాంతో వినయ్ ఆలోచిస్తూ విద్య వైపు చూసి “నువ్వు నను చాలా తక్కువ అంచనా వేశావు నేను అంత తేలికగా పడిపోను” అని చెప్పాడు.

ఆ రోజు ఉదయం పొద్దునే లేచి వినయ్ కీ ఇష్టం అయిన పింక్ కలర్ చీర కట్టుకుని కాఫీ చేసుకొని తీసుకోని వెళ్లింది అప్పుడు వినయ్ అక్కడ లేకపోయే సరికి కొంచెం నిరాశ పడింది దాంతో వినయ్ ఎక్కడికి వెళ్లి ఉంటాడు అని ఆలోచిస్తూ ఉంటే తనని వదిలేసి వెళ్లిపోయాడు అని తెలుసుకుని చాలా బాధ పడింది ఆ తర్వాత ఊరికి తిరిగి వెళ్లింది ఈ సారి తన సొంత ఇంట్లోనే తనకు ఏదో తేడా కొడుతూ ఉంది ఎప్పుడు తను కిచెన్ లోకి వెళ్ళిన పనులు చెప్పే తన అత్త, పిన్ని ఇప్పుడు తను కూరగాయలు కోస్తూన్న కూడా పక్కకు పంపించే వాళ్లు, మెల్లగా ఇంట్లో అందరూ తనను దూరం పెడుతున్నారని తెలుసుకుంది విద్య ఇలా ఒక వారం రోజులుగా తన ఇంట్లో తన వాళ్లతో ఉంటే దైర్యం ఉంటుంది అనుకుంటే వాళ్లే తనని దూరం పెట్టడం విద్య కీ ఆశ్చర్యంగా ఉంది, ఒక రోజు సాయంత్రం ఇంటి మిద్దె పైన కూర్చుని ఫోన్ లో పాటలు వింటూ ఉంది అప్పుడు కింద రూమ్ లో వాళ్ల బాబాయ్, నాన్న మాట్లాడుతూ ఉండటం వినింది.