చాలా సార్లే చేశాను ఇప్పటి వరకు 196

“మా సేల్స్ వైస్ ప్రెసిడెంట్ పర్సనల్ గా జినో కార్ప్ ఎకౌంటు కి ఇన్ ఛార్జ్ గా పెట్టారు. ఆయన మన ఇద్దరి కంపెనీల రిలేషన్స్ బావుండటానికి, పరస్పరలాభం కలిగేలా బిజినెస్ ఇంప్రూవ్ చెయ్యటానికి కట్టుబడి వున్నారు.”

గోట్లే ముఖం లో వెలుగు తగ్గింది.. “సో.. ప్రియా.. మాకు ఇప్పటినించి నిన్ను చూసే అదృష్టం లేదన్న మాట”.

నేను అసలు విషయాన్ని వివరంగా చెప్పటానికి ప్రయత్నించబోయాను. నా మాటలు డామినేట్ చేస్తూ ఉదయ్ మళ్ళి మాట్లాడటం మొదలెట్టాడు.

“ప్రియ నాకు రిపోర్ట్ చేస్తుంది. మీ కంపెనీ విషయం లో ప్రియ అన్ని రకాలు గా మీకు కావలసినట్టు సహకరించే పూచీ నాది. దానికి మా వి. పి. గారి సపోర్ట్ పూర్తి గా వుంది నాకు. సో.. ప్రియా ఎకౌంటు లో వుంటుంది, కానీ, నాకు రిపోర్ట్ చేస్తూ, నా కింద పని చేస్తుంది అన్న మాట.” అన్నాడు “నా కింద” అన్న మాట ని నొక్కి పలుకుతూ.

నాకు చిర్రెత్తుకొచ్చింది.. ఏమిటి వీడి ధైర్యం.. నన్ను ఇంత లాగా కించ పరుస్తాడా.. నేను అసహనం గా కదలటం చూసి ఉదయ్ నా భుజం మీద మెల్లిగా చేత్తో తట్టాడు, ఏదో ఎంకరేజ్ చేస్తున్న ఫీలింగ్ ఇస్తూ.

“గుడ్.. గుడ్..” అంటూ గోట్లే మళ్ళీ నా గుండెల వైపు చూడటం లో బిజీ అయ్యాడు. “ప్రియ అన్నా, మీ ప్రోడక్ట్ అన్నా మాకిష్టమే. అయితే, మీ రేట్లే చాలా ఎక్కువ. మీ డెలివరీ టైం మాకు సరి పోదు.”

“ఇది నిజమేనా?” ఏదో నన్ను అజమాయిషీ చేస్తున్నట్టు ఉదయ్ గొంతు కఠినం గా వినిపించింది. “మనం వీళ్ళకి ఎందుకు అంత రేట్లు చెబుతున్నాం? సర్వీసు స్లో గా ఎందుకు వుంది?”

ఉదయ్ లో ఈ మార్పు చూస్తున్న నాకు నోటి మాట రాలేదు. తన గొంతులోని చార్మ్ అంత పోయి, ఒక కఠినమైన బాస్ లాగా గదమాయిస్తున్నాడు. వీడు నాకు బాస్ కూడా కాదు!!! వయసు లోనూ, సీనియారిటీ లోను నేనే ఎక్కువ. కస్టమర్ ఎదురుకుండా ఎందుకు వివాదం అని కోపం గొంతు దిగమింగుకున్నాను.

“జినో కార్ప్ కి కావలసినట్టు డెలివరీ చేయ్యాలంటే, మనకి అంత కాస్ట్ అవుతుంది.” అన్నాను, మామూలుగా మాట్లాడటానికి ప్రయత్నిస్తూ.

“కధలు చెప్పకు. ప్రియ..” అంటూ ఉదయ్ గోట్లే వైపు తిరిగాడు. “మీరు ప్రియ ని క్షమించాలి. జినో కార్ప్ బిజినెస్ మా కంపెనీ కి, ఇండియా కి ఎంత ముఖ్యమో తనకి అర్ధం అవుతున్నట్టు లేదు.”

“మీరు మా రేట్ కి ఒప్పుకున్నట్టైతే, మనం ఇంక బిజినెస్ మొదలెట్టచ్చు”.. గోట్లే ఉదయ్ నా మీద ఆధిపత్యం చూపించటం ఎంజాయ్ చేసినట్టున్నాడు. నాకు మాత్రం ఉదయ్ ని లాగి ఒక లెంపకాయ కొట్టాలని బాగా వుంది. లోపల కోపం తో బుసలు కొడుతున్నాను.

“షూర్.. గోట్లేజీ”. సడన్ గా గోట్లే సంబోధనలో “జీ” చేరటం నేను గమనించక పోలేదు. “మనం కొంచం తీరిగ్గా మాట్లాడుకుందాం మానో-ఈ-మానో. ఇవ్వాళ మిమ్మలిని కలిసి పరిచయం పెంచుకోవటం మాత్రమె మా ఉద్దేశం.”

“గ్రేట్…చాయ్ తెప్పించామంటారా?” గోట్లే ఉదయ్ వైపు అభినందన గా చూస్తూ.

“తప్పకుండా సర్” అంటూ ఉదయ్ నా వేపు తిరిగాడు. “ప్రియా.. నేను గోట్లేజీ తో కొంచం పర్సనల్ గా మాట్లాడాలి. నువ్వు వెళ్లి లాబీ లో వెయిట్ చెయ్యి”…

హహ్.. ఒక గౌరవం లేదు, ఒక ప్లీజ్ లేదు.. ఆర్డర్ల మీద ఆర్డర్లు.. ఉదయ్ వైపు చాలా తీక్షణం గా చూసాను. తన చూపు లో మార్పేమీ లేదు. ఒక జీవం లేని చూపు. “పద.. బయట వెయిట్ చెయ్యి” అంటూ నన్ను కుర్చీ లోంచి తోసేసినంత పని చేసాడు.

ఎప్పుడూ లేనంత సహనం ప్రదర్శిస్తూ, బయటికి నడిచాను. “వెడుతూ తలుపు మూసేయ్యి” వెనకాల ఉదయ్ గొంతు వినిపిస్తోంది.

====================