భ్రాంతి 2 177

పుస్తకం విషయం చెప్దామని హుషారుగా శైలు దగ్గరకు బయల్దేరాడు. డాబా మెట్లు ఎక్కుతుంటే నిక్కీ ఏడుపు, శైలు ఓదార్పు వినిపించి ఆగిపోయాడు. ‘అమ్మ పొలం అమ్మేసినా ఇంకా మూడువేలు తగ్గిందే. దానిపైన మళ్ళీ హాస్టల్, బుక్స్ ఖర్చులు. నా రికార్డ్ చూసి కాలేజీ వాళ్ళు ఈ ఇయర్ గ్యాప్ వచ్చినా నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చెయ్యనిస్తాను అన్నారు. కానీ ఆ మిగతా డబ్బులు ఎలా సర్దుబాటు చెయ్యాలో అర్ధం కావట్లేదు’ అంటూ నిక్కీ గొంతు, ‘ఎలాగో ఒకలాగా ఏర్పాటు అవుతుంది లేవే. మామ చాలా ప్రయత్నం చేశాడు. ఈ సంవత్సరం విత్తనాలు పాడైపోవడంతో ఇంకో బ్యాచ్ కొనడానికి చాలా డబ్బులు ఖర్చు అయ్యాయిట. దానికి తోడు ఆ పొలం సరిహద్దు తగాదాలొకటి. నేను కూడా ఏదన్నా వుద్యోగం వెదుక్కుంటా అని అడుగుతున్నా మామని’ అంటూ శైలు గొంతు వినిపించాయి.

‘పెద్దయ్యకి ఇప్పటికే చాలా ఋణపడ్డామే. ఆయన అండ లేకుంటే అసలు నాలాంటి ఆడపిల్ల ఊరు దాటి వెళ్ళి చదువుకోవటం అయ్యేదే కాదు’ అంటోంది నిక్కీ. కిరీటి ఇప్పుడు వాళ్లదగ్గరికి వెళ్లలేక తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు.

మర్నాడు కాలేజీలో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ గార్లు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లు ఇంగ్లిష్ లో struggle అవడం గురించి, దాని ఫలితంగా మిగతా సబ్జెక్టుల టెక్స్ట్ బుక్స్ చదివి అర్ధం చేసుకోలేక వాటిలో కూడా దెబ్బతినటం గురించి ఆందోళన పడటం, రాజావారికి ఏం చెప్పుకోవాలో అన్న దాని గురించి మాట్లాడుకోవడం విని వాడికొక ఆలోచన వచ్చింది.

ఆలోచన అయితే వచ్చింది గానీ దాన్ని అమలు చెయ్యాలంటే వాడి కాళ్ళు చేతులు చల్లబడిపోతున్నాయి. ముందు చాలాసార్లు చెప్పుకున్నట్టే కిరీటి పక్కా introvert. అలాంటి వాళ్ళకి మనసులో వెయ్యి మాటలు వుంటే ఒక్క మాట బయటకు తీసుకురావడమే గగనం. మిత్రులారా, ఆ మెంటల్ block అనేది ఎవరూ మాటల్లో చెప్పలేరు. Experience చేస్తే కానీ తెలీదు. తెలిసిన వాళ్ళ దగ్గరే నోరెత్తడు, అలాంటిది ఏకంగా ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్ళి మాట్లాడాలంటే ఊగిసలాడుతున్నాడు కిరీటి. చివరికి ఓ రోజు ధైర్యం చేశాడు. నిక్కీ మీద మనసులో ఎక్కడో వున్న ఇష్టం వాడి చేత ముందడుగు వెయ్యించింది.

అది సెప్టెంబర్ మాసం. half yearly పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ను యే రకంగా గట్టెక్కించాలో తెలీక అవస్థలో వున్న ప్రిన్సిపాల్ రూమ్ కి ఓ కుర్రాడు వచ్చాడు.

May I come in sir అంటూ ఆయన డోర్ పై knock చేశాడు. లోపలికి రమ్మని పిలిచిన ప్రిన్సిపాల్ ఆ కుర్రాడితో ఒక అరగంట మాట్లాడారు. అంతసేపూ మరీ ఎక్కువ తప్పులు లేకుండా చక్కటి ఇంగ్లిష్ లో మాట్లాడి ఆయన ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ suggest చేసి వెళ్ళాడు ఆ కుర్రాడు.

ఆ కుర్రాడు మన కిరీటి అని చెప్పనవసరం లేదనుకుంటా. ఒక రెండు రోజులు ఆలోచించి కిరీటి చెప్పినదానికి ఓకే అన్నారు ప్రిన్సిపాల్ గారు. ఆ సాయంత్రం నిక్కీ, శైలూలకు ఒక మంచి surprise ఇద్దామని వెళ్ళాడు కిరీటి.

ప్రెసిడెంటు గారి ఇంటి డాబా మీద నిక్కీ ఒక్కతే వుంది. ‘శైలు ఒక పది నిమిషాల్లో వచ్చేస్తుంది రారా’ అని పిలిచింది వాడ్ని పైకి. ఎంత ఇద్దరికీ ఒకే సారి చెబ్దాము అనుకున్నా వుండబట్టలేక నిక్కీతో మొదలెట్టాడు. ‘అక్కా’ అంటూ మొదలెట్టి ఇంతలోనే గతుక్కుమని ‘నిక్కీ, ఒక మాట చెప్పాలి’ అన్నాడు. ఇద్దరూ ఎదురెదురుగా కూర్చుని వున్నారు.

‘నేను ఇవాళ మా కాలేజీ ప్రిన్సిపాల్ గారితో మాట్లాడాను. నువ్వు వచ్చే ఆరు నెలలు డిగ్రీ ఫస్ట్ ఇయర్ పిల్లలకి ఇంగ్లిష్, మాథ్స్ స్పెషల్ క్లాసులు చెబితే వెయ్యి రూపాయలు జీతం ఇస్తాను అన్నారు. నీ మూలంగా మేము ఇంప్రూవ్ అయితే నిన్ను కాలేజీ కట్టించిన రాజా గారి దగ్గరికి తీసుకెళ్లి నీ ఫీజు గురించి మాట్లాడతాము అన్నారు. నీకు ఇష్టం లేకపోతే sorry’ అని గుక్క తిప్పుకోకుండా చెప్పేసి ఆమె రియాక్షన్ ఎలా వుంటుందా అని apprehensive గా చూస్తున్నాడు.

ఇవతల నిక్కీ మైండ్ లో ఒక వింత అనుభూతి కలుగుతోంది. మునిగిపోతున్న వాడికి నావ ఎదురైనట్లు అనే స్థితిలో వుంది. ఇక చదువు ఆగిపోయినట్లేనేమో అని దిగాలు పడుతుండగా కిరీటి ఓ దోవ చూపించేసరికి తన రియాక్షన్ ను కంట్రోల్ చేసుకోలేకపోయింది.

1 Comment

  1. Bro story superb ga undhi plzzz story madhyalo apakandi continue chyndi

Comments are closed.