భ్రాంతి 3 145

మధ్యాహ్నం అందరితో కలిసి గుడిలో పంక్తి భోజనాలు చేసి ఇంటికి వచ్చి పడుకున్నాడు కిరీటి. లేచాక స్నేహితులతో కలిసి సంతకి వెళ్దామని అనుకున్నాడు. మంచి నిద్ర పట్టింది వాడికి. కళ్ళు తెరిచి చూసేసరికి తను శైలు ఒళ్ళో పడుకుని వున్నాడు. ఇది కలో నిజమో అర్ధం కాలేదు వాడికి. లేవబోతుంటే శైలు వాడ్ని ఆపేసి ‘ఏరా, ఎప్పుడూ ఇలాగే మొద్దు నిద్ర పోతుంటావా?’ అని అడిగింది. ‘శైలూ, మీరిక్కడ…’ అంటే ‘నిక్కీ కోసం వచ్చాను. కానీ అది వాళ్ళ నాన్నతో కలిసి వెళ్లిందిట సంతకి. ఈ సారి వాళ్ళు కూడా చిన్న అంగడి పెడుతున్నారు అక్కడ’ అంది.

‘నిన్ను నా కూడా తీసుకుపోదామని వచ్చాను. చూస్తే ఇదిగో నువ్వు ఒళ్ళు తెలియని నిద్రలో వున్నావు.’

కిరీటికి గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డం పడ్డట్టయ్యింది. ఈ సారి కూడా సునయన వచ్చిందేమో చూద్దాం అని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాడు. కానీ ఇప్పుడు శైలుతో వెళ్తే తనని వదలదు. వీడి బాధ ఏమీ పట్టట్లేదు శైలుకి. తన మానాన తను ఒక ట్రాక్ లో వెళ్లిపోతోంది. ‘పొద్దున ముద్దు పెట్టానని కోపం వచ్చిందా’ అని వాడి గడ్డం పట్టుకొని అడిగింది. కిరీటి ఒక్కసారిగా ఆలోచనలోనుంచి తేరుకొని ‘అదేమీ లేదండీ’ అన్నాడు కంగారుగా. ‘అయితే ఇంకొకటి కావాలా’ అని చిలిపిగా అడిగింది. షాక్ తిని గబుక్కున లేచి కూర్చున్నాడు.

‘కొత్త పెళ్లికొడుకులా వున్నావని ముద్దొచ్చి అలా చేశాను. ఇంక ఏడిపించనులే నిన్ను. నాతో రావడం నీకు ఇబ్బంది ఐతే చెప్పు పర్వాలేదు. నీ ఫ్రెండ్స్ తో కలిసి వెళ్దామనుకున్నావా?’ అంది. శైలు కంపెనీని ఎప్పుడూ ఇబ్బందిగా ఫీల్ అవడు కిరీటి. తనని చూసినప్పుడల్లా ఒక మంచి అనుభూతే తప్ప మరొక ఫీలింగ్ రాదు మనసులోకి. మొదట్లో ఆమెని కనులెత్తి చూడాలంటే ఇబ్బంది పడేవాడు. చూస్తే ఆమె నగ్నరూపం వాడి మనసులోకి చొచ్చుకొచ్చేది. పోనుపోనూ మెల్లిగా ఆమెను ఒక మామూలు అమ్మాయిలా చూడ్డం అలవాటు చేసుకున్నాడు. ఇలా పరధ్యానంగా వెళ్తే తను ఏమన్నా ఫీల్ అవుతుంది అనుకొని మామూలుగా వుండటానికి ప్రయత్నం చేస్తున్నాడు.

‘అదేం లేదండీ, కాస్త ముఖం కడుక్కుని వస్తాను, మీరు హాల్లో వుంటారా?’ అని అడిగితే ‘పర్వాలేదు నువ్వు పోయి రా, నేను ఇక్కడ వుంటాను’ అని వాడి రూమ్ లో వున్న పుస్తకాలు చూస్తూ వుంది. ఎంత తొందరగా బయల్దేరితే అంత మంచిది అనుకొని గబగబా తయారయ్యి వచ్చాడు. వచ్చేసరికి శైలు వాడి Misdirection పుస్తకం తిరగేస్తోంది.

‘వెళ్దామండీ’ అంటే ‘నన్ను అండీ, గిండీ అని పిలవటం ఆపేసి శైలు అని పిలువు’ అంది. ఆ మాట విని కిరీటి ఆశ్చర్యపోయాడు. ‘మీరు నాకంటే కనీసం నాలుగేళ్ళు పెద్ద. అదీకాక మిమ్మల్ని పేరు పెట్టి పిలిస్తే మీ మామ నన్ను చంపేస్తాడు’ అన్నాడు నవ్వుతూ. ‘పోనీ మనమిద్దరం వున్నప్పుడు ఈ బహువచనాలు ఆపేసెయ్యి’ అంది. ‘అలాగే శైలూ’ అన్నాడు కొంచెం hesitate చేస్తూ.

‘ఇంతకీ లాస్ట్ టైమ్ సంతలో ఏం జరిగిందో చెప్పలేదు నాకు’ అంది తన చేతిలోని పుస్తకాన్ని ఊపుతూ. ‘అదీ..అదీ..’ అంటూ నీళ్ళు నములుతుంటే ‘ప్లీజ్ చెప్పరా, ఇలాంటి ఇంటరెస్టింగ్ విషయాలు విని చాలా కాలం అయ్యింది. అదీ కాక ఈ విషయం నిక్కీ నిన్ను అడగదు, నువ్వు దానికి చెప్పవు. ఏంటి మేమప్పుడు చూసిన ఆ లవ్ సింబల్ కార్డ్ కథ’ అంటూ వాడి చెయ్యి పట్టుకుని మళ్ళీ మంచం మీదకు లాగి కూర్చోబెట్టింది.

‘సరే సరే చెప్తాను’ అంటూ మెల్లిగా చెయ్యి విడిపించుకొని చాలా డీటైల్స్ వదిలేసి సునయనని ఆమె విచిత్రమైన షాపులో మీట్ అయిన విషయం, ఆమె చేసిన మ్యాజిక్ ట్రిక్ గురించి చెప్పి ‘అదుగో అప్పుడు కొన్నాను ఆ పుస్తకం. ఆ కార్డ్ ఆ అమ్మాయి చేసిన మ్యాజిక్ ట్రిక్ గుర్తుగా తీసుకున్నాను’ అని టూకీగా చెప్పాడు. శైలు చాలా తెలివైన అమ్మాయి. వాడు కనీసం జరిగిన దాంట్లో సగం కూడా చెప్పలేదు అని ఫిక్స్ అయ్యి అదే విషయం వాడ్ని అడిగింది.

3 Comments

  1. Superb bro story ilane continue chyndi manchi flow lo undhi madhyalo apakandi dayachesi

  2. Ilanti vedavapooku stories ni continue ga post chestaru.

    1. Indhulo vedapuku em undhi Andi.. ante story motham sex untene adhi story na Ila unte story avadha Andi … Dengudu stories kavali ante xossipy site undhi andhulo adhi visit chyndi…. Ayina istam lekapothe silent ga undochu ga endhuku comment petti mari gelukovadam… Sorry emina athiga matldithe ?…

Comments are closed.