భ్రాంతి 4 100

నైనిటాల్ ఘాట్ రోడ్… సమయం రాత్రి 2 గంటలు.

సుందర్ చాలా జాగ్రత్తగా తన కార్ డ్రైవ్ చేస్తున్నాడు ఘాట్ రోడ్డు మీద. అతని అపాయింట్మెంట్ ఉదయం 8 గంటలకు. ఇంకాస్సేపట్లో గమ్యాన్ని చేరుకుని ఒక మూడు నాలుగు గంటలు విశ్రాంతి తీసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే ముందు గమ్యాన్ని చేరడం ముఖ్యం కాబట్టి చీకటిలో మలుపుల రోడ్డు మీద పూర్తి జాగరూకతతో వెళ్తున్నాడు.

ఒక మలుపు తిరగగానే నాలుగైదొందల గజాల దూరంలో ఒక జీప్ రోడ్డు పక్కన ఆగి వుండటం చూశాడు. ఇంకా కనీసం మూడు కిలోమీటర్లు దూరం వుంది hilltop villas చేరుకోవటానికి. ‘పూర్ ఫెలోస్… Hope they made it’ అనుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు. ఒక అర కిలోమీటర్ ముందుకు వెళ్ళాక ఉన్నట్టుండి అతని కళ్ళు రోడ్డు పక్కన ఉన్న ఒక ఆకారంపై పడ్డాయి. ఒక అమ్మాయి పెద్ద suitcase మోసుకుంటూ నడుస్తోంది. అప్పుడప్పుడూ బరువుకి తాళలేక అనుకుంటా దాన్ని రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్తోంది.

సుందర్ కారు శబ్దం విని వెనక్కు తిరిగి చూసింది. Headlights వెలుగులో పిల్లికళ్లలా మెరిసిన ఆమె కనులు చూసి ఆటోమేటిక్ గా కారు ఆమె పక్కన ఆపాడు. మనిషిని చూస్తే ఆంగ్లో-ఇండియన్ లా వుంది. భుజాలదాకా పెరిగిన ఒత్తైన జుత్తు, Europeans కి వుండే ముఖకవళికలు, ఇండియన్స్ లో అత్యంత అరుదుగా కనిపించే నీలి కనులు ఇవన్నీ ఒక్క చూపులో అతని మనసులో ముద్ర పడిపోయాయి.

సంభాషణ ఆంగ్లంలో కొనసాగింది. మనం అనువాదం చూద్దాం.

‘హలో మిస్, ఏదో కష్టంలో వున్నట్టున్నారు. ఏమన్నా సహాయం కావాలా?’ అని అడిగాడు. ఆమె కొంచెం పరికించి చూసింది. సుందర్ నడుపుతున్న కారు కొత్తదిలాగా వుంది. మనిషి సూటు బూటు వేసుకొని వున్నాడు. నమ్మతగిన వాడే అనుకుందేమో “లా విల్లా బ్లూ” కి వెళ్ళాలి. లిఫ్ట్ ఇవ్వగలరా అని అడిగింది.

సుందర్ ముఖంలోని చిరునవ్వు కొంచెం చెదిరింది. అతను వెళుతోంది కూడా అక్కడికే. కానీ అతనున్న ప్రొఫెషన్ లో coincidence అనే పదానికి చోటు లేదు. ఆమె వైపు వెళ్దామనుకుంటున్న వాడు కాస్తా కారుకి ఇటు పక్కనే వుండి ‘మీరు ఎవరు?’ అని అడిగాడు.

‘మీరెవరో చెప్పకుండా నా పేరడగడం కొంచెం రూడ్ గా లేదూ?’ అంది ఆమె. ‘మీ యూరోపియన్ సెంటిమెంటాలిటీస్ నా దగ్గర పని చెయ్యవు. గుడ్ బై’ అని చెప్పి కారు ఎక్కి వెళ్లిపోబోతున్నాడు సుందర్. ‘ఐ యామ్ నీనా డిసౌజా’ అందామె. Desperate గా వున్నట్టుంది కొంచెం దీనంగా చూస్తోంది సుందర్ వంక.

అతని మస్తిష్కంలోని ఒక భాగం వెళ్లిపో వెళ్లిపో అని అరుస్తోంది. కానీ ఆమె పేరు వినగానే ఆగిపోయాడు. ‘మీరు ఫ్రాన్సిస్ కి ఏమౌతారు’ అన్నాడు. ఆమె చిరాగ్గా ముఖం పెట్టి ‘నా దగ్గర అంటే అన్నారు, అలా మా బ్రదర్ ఎదురుగా పిలవకండి. హిస్ నేమ్ ఈస్ ఫ్రాన్స్-వా’ అంటూ సరిగ్గా ఎలా పలకాలో చెప్పింది. తను పెట్టిన ఈ చిన్న టెస్ట్ కూడా పాస్ అయ్యేసరికి ఎట్టకేలకు సుందర్ ఆమెకు సహాయం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అతని క్లయింట్ ఫ్రాన్స్-వా డిసౌజా ఒక చిత్రమైన మనిషి. మనిషి కోటీశ్వరుడు. కానీ చిన్న చిన్న అవమానాలను కూడా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. అతనికున్న అనేక రూల్స్ లో ఒకటి – తన పేరు ఎవరన్నా తప్పు పలికితే ఇక ఆ మనిషి ముఖం జన్మలో చూడడు.

‘మీరు చాలా లక్కీ. నేను అక్కడికే వెళ్తున్నాను. రండి’ అంటూ ఆమె పెట్టెని వెనుక సీటులో పెట్టడానికి సహాయం చేశాడు. మాటల్లో ‘ఆ వెనుక చూసిన జీప్ మీదేనా’ అని అడిగాడు. ‘యెస్, డెహ్రాడూన్ నుంచి వస్తున్నాను. ఇంటికి ఇంత కొద్ది దూరంలో ట్రాన్నీ పాడైంది. మీరు రాకపోతే ఈ పెట్టె రోడ్డు మీద పడేసి వెళ్ళేదాన్ని’ అంది. Suitcase ఎక్కించి ఇద్దరూ ముందు సీట్లలో కూలబడ్డారు.

ఆమె దగ్గర చెమట, తను కొట్టుకున్న పర్ఫ్యూమ్ కలిసి ఒక విచిత్రమైన వాసన వస్తోంది. చాలా గమ్మత్తుగా వుందీ అనుభవం సుందర్ కి. తన సిస్టర్ కి సహాయం చేశానని తెలిస్తే డిసౌజా వద్ద తొలి ఇంప్రెషన్ మంచిగా పడుతుంది అని లెక్కవేసుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని క్లయింట్ గా వదులుకోకూడదు అని చెప్పి పంపారు అతని బాస్.