భ్రాంతి 4 100

ఇక బయల్దేరదాము అనుకుంటుండగా ‘ఒక్క నిమిషం, నా suitcase లోంచి shawl తీసుకుంటాను. పైకి వెళ్ళే కొద్దీ చలి పెరిగిపోతుంది అంటూ సీట్ లోనే వెనక్కు తిరిగి లిడ్ ఓపెన్ చేసి shawl బయటకు లాగుతోంది నీనా. అంత చిన్న స్పేస్ లో ఆమె అలా చేస్తుంటే ఆమె శరీరం అతనికి బాగా దగ్గరగా వచ్చింది. ఆమె ఎడమ చన్ను, చంక కలిసే భాగం సుందర్ ముఖానికి బాగా దగ్గరగా వచ్చింది. క్లయింట్ సిస్టర్ కాకపోయుంటే జస్ట్ ముఖాన్ని అలా పక్కకి జరిపి ఆమె చన్నుల స్పర్శను అనుభవించేసేవాడు సుందర్.

‘bloody thing’ అంటూ shawl ను ఒక్క లాగు లాగింది నీనా. ఈ పెనుగులాటలో ఆమె armpits నుండి ఇందాక తను పీల్చిన మత్తైన వాసన మళ్ళీ వచ్చేసరికి గట్టిగా ఒకసారి ఊపిరి పీల్చాడు. కళ్ళు బైర్లు కమ్మాయి అతనికి ఆ ఘాటు వాసనకి. కానీ ఇలాంటి అందమైన అమ్మాయి నుంచి వచ్చే చెమట వాసన సైతం వదలరు కదా మగాళ్లు. సుందర్ కూడా అదే చేశాడు. ఆమె సర్దుకుని కూర్చునేలోపు మళ్ళీ ఇంకొక్క సారి పీల్చాడు ఆ వాసన. అలా పీల్చిన వాడు పీల్చినట్టే మత్తుగా స్టీరింగ్ వీల్ పైన పడిపోయాడు.

అతను స్టీరింగ్ వీల్ పైన పడడంతో కారు హారన్ గట్టిగా మోగింది. నీనా గబగబా అతన్ని లాగి సీట్ లో కరెక్ట్ గా కూర్చోబెట్టింది. ‘ఉఫ్…’ అని ఒక్కసారిగా గాలి వదిలి కారులోంచి దిగి shawl తో తన వంటిమీద వున్న స్ప్రే ను తుడిచేసుకుంది. చాలా కష్టపడి సుందర్ ను backseat లోకి లాగింది. Suitcase లోంచి కొంచెం మేకప్ సామాన్లు బయటకు తీసి సుందర్ కి నుదుటన గాయం అయినట్టు మేకప్ వేసి కట్టు కట్టింది. అదే చేత్తో తన ముఖానికి వున్న మేకప్ తుడిచేసుకుని ఈ సారి నార్త్ ఇండియన్ లా కనిపించేలా ముఖాన్ని దిద్దుకుంది. రోడ్డు మీద ఏ శబ్దాలూ లేకపోయేసరికి మెల్లిగా అక్కడే వంటి మీద బట్టలు కూడా మార్చుకుంది.

సుందర్ ముఖంపై మరొకసారి స్ప్రే కొట్టి అతను ఇంకొక పది పన్నెండు గంటలపాటు లేవడు అని లెక్క వేసుకొని డ్రైవరు సీట్ లోకి వచ్చి కూర్చింది. అంతా సరిగా వుందో లేదో డబుల్ చెక్ చేసుకొని మిర్రర్ లో తనను తాను చూసుకుంది. ‘వాట్ ద హెల్ యామ్ ఐ డూయింగ్ హియర్’ అనుకుంటూ బయల్దేరింది నీనా అలియాస్ సునయన.

Organized క్రైమ్, unorganized క్రైమ్ అనేవి రైలు పట్టాల్లా వుంటాయి. అవి కలవ్వు, కలవకూడదు. ఫోర్జెరీలు, బ్యాంక్ ఫ్రాడ్ వంటి పనులు చేసేవాళ్ళు వీధి గూండాలతోనూ, బందిపోట్లతోనూ క్లోజ్ గా మూవ్ అవ్వరు. ఎందుకంటే organized క్రైమ్ లో వున్నవాడికి అజ్నాతం అనేది వెలకట్టలేని రక్షణ కవచం. మరి బందిపోట్లు, రౌడీలు? బోర విరుచుకొని తిరక్కపోతే వాళ్ళకి ఎవడూ భయపడడు.

50s, 60s లో సరోద్ కాతియా, బిజ్జూ కాతియా అనే ఇద్దరు సోదరులు ఈ దారికి భిన్నంగా వెళ్దామని ఆలోచించారు. ఉత్తరప్రదేశ్ లోని ఒకానొక పరగణా ఎంచుకొని వీళ్ళ పనులు మొదలెట్టారు. సరోద్ దేశదేశాలు తిరిగి దొంగనోట్లు అచ్చెయ్యడం నేర్చుకొచ్చాడు. ఆ దొంగనోట్లను మార్చే పనిని బిజ్జూ ఎత్తుకున్నాడు. ఇద్దరు సోదరులూ కలిసి ఒక దురాలోచన చేశారు. దొంగ నోట్లను బీహార్, రాజస్థాన్ వంటి దూరదూర ప్రదేశాలకు తీసుకుపోయి వాటితో అక్కడ బందూకులు కొని తెచ్చాడు బిజ్జూ. వాటిని ఉత్తరప్రదేశ్ లోని లోకల్ బందిపోట్లకు అమ్మి బాగా డబ్బులు కూడబెట్టారు.

దాదాపు ఒక దశాబ్దం పాటు నిరాటంకంగా సాగాయి వీళ్ళ ఆటలు. బీహార్లో పేరుమోసిన బందిపోటు ఒకడు వీళ్ళ దొంగనోట్లతో లంచాలు చెల్లించడంతో సెక్యూరిటీ ఆఫీసర్లు వాడి గాంగ్ మొత్తాన్నీ కిరాతకంగా encounter చేసిపారేశారు. చనిపోయిన వాడి బంధువొకడు అసలీ తప్పు ఎలా జరిగింది అనేది కూపీ లాగడం మొదలెట్టాడు. తీగ లాగితే డొంకంతా కదిలి కాతియాల గుట్టు రట్టైంది. బీహార్ వాడు తొందర పడలేదు. ఉత్తరభారతంలోని క్రైమ్ గ్రూపులు అన్నిటికీ (organized, unorganized) వీళ్ళ మోసాన్ని చాటువేశాడు.

నేరప్రపంచం పెద్దలంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. కాతియాలకు చెప్పే బుద్ధి ఎలా వుండాలంటే మళ్ళీ ఎవడూ కూడా తోటి దొంగను మోసం చేయాలన్న ఆలోచన చేయకూడదు అన్నంత బలంగా వుండాలి అని తీర్మానించారు. గొప్ప పధకం వేసి కాతియాల వంశం మొత్తం ఒకచోట పోగయ్యేదాకా వేచి చూశారు. దొంగనోట్లతో పాటు చేసిన, చెయ్యని నేరాలన్నీ వాళ్ళ మీద పోగేసి పదిమంది అప్ప్రూవర్లను సెక్యూరిటీ ఆఫీసర్ల దగ్గరికి పంపారు.

సెక్యూరిటీ ఆఫీసర్లు రెచ్చిపోయి కాతియాల మీద జరిపిన మారణహోమంలో బతికి బట్ట కట్టింది వినయ్ కాతియా ఒక్కడే. ఓ రెండు లక్షలు సొమ్ము పోగేసి చావు తప్పి కన్ను లొట్టబోయి దక్షిణ భారతదేశానికి పారిపోయి వచ్చాడు. ఒకటిరెండు సార్లు వెనక్కు వెళ్దామనుకున్నాడు. కానీ ఉత్తరభారత నేర ప్రపంచం కాతియా అనే పేరు వింటేనే భగ్గుమనడం చూసి ఇక అక్కడ తనకు స్థానం లేదని తెలుసుకున్నాడు. తన surname వదిలేసి ఉత్త వినయ్ గా మిగిలిపోయాడు.

ఉత్తరాది సెక్యూరిటీ ఆఫీసర్లకు, దక్షిణాది సెక్యూరిటీ ఆఫీసర్లకు వున్న భేదం తెలిసొచ్చేసరికి చేతిలోని డబ్బులు కరిగిపోయాయి. ఇక్కడ బీటు కానిస్టేబులు సైతం కింగులా వుండటం చూసి తలపట్టుకున్నాడు. బందూకులు అన్నల దగ్గర తప్ప మామూలు మనుషుల దగ్గర వుండవని తెలుసుకున్నాడు. అదుగో అప్పుడు అతన్ని ఆదుకున్నాడు ధనుంజయ్. మెల్లిగా చెయ్యదగ్గ, చెయ్యకూడని నేరాలు ఏమిటో తెలియచెప్పి ఒక స్థాయికి తీసుకొచ్చాడు.