భ్రాంతి 4 100

ఫ్రాన్స్-వా డిసౌజా పొద్దున్నే మంచి ఎనెర్జెటిక్ గా వున్నాడు. ‘మీ ప్రయాణం బాగా జరిగిందా మిస్ మాలిని, let’s have some coffee అంటూ మాట కలిపాడు. ‘చిన్న hiccup, బట్ పర్వాలేదు’ అంటూ servants అందించిన వేడి వేడి కాఫీ అందుకుంది.

డిసౌజా చూపులతో తడిమేస్తున్నాడు సునయనని. అదేమీ పట్టనట్టు యాక్ట్ చేస్తోంది. బయట వున్నంత చలి లోపల లేదంటూ కార్డిగన్ తీసేసింది. సునయన అద్భుతమైన అందగత్తె. అవసరాన్ని బట్టి తన అందాన్ని ఎలా elevate చెయ్యాలో, ఎలా తగ్గించి చూపాలో తెలిసిన జాణ. ఆల్రెడీ టైట్ పాంట్ వేసేసరికి తన పిరుదులు, తొడలు, పిక్కలు వీటి షేపులు అన్నీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. ఇక కార్డిగన్ తీయగానే ఆమె ఎద సంపద షర్ట్ లోనుండి పొడుచుకొస్తూ కనిపించేసరికి డిసౌజా ఆమె అందాలపైనుంచి చూపు తిప్పట్లేదు.

పొడి పొడి సంభాషణ తర్వాత అసలు విషయాన్ని కదిపింది. ‘ఈ సారి inspection కోసమా లేక polishing కోసమా సర్’ అంటూ మాటర్ లోకి దిగిపోయింది. ‘Inspection కోసమే మిస్ మాలిని. But తొందరేముంది. మనం తీరిగ్గా లంచ్ చేశాక చూసుకుందాం వర్క్ సంగతి’ అన్నాడు. సునయన గుండెల్లో రాయి పడింది. సుందర్ కు ఇంకొక మూడు నాలుగు గంటల్లో తెలివి వస్తుంది. ఇక్కడికి గానీ వచ్చాడా తన పని ఫినిష్. పనిలో అనుకోని పరిస్థితులు ఎదురైతే ఏం చెయ్యాలో backup ప్లాన్ వేసుకోకపోవడం ఆమె చేసిన రెండో తప్పు.

తలకు దెబ్బ తగిలినట్టు మేకప్ వేసి, బట్టలపై కొంచెం మట్టి పూసి సుందర్ ను నైనా దేవి ఆలయం మెట్ల ముందు బిచ్చగాడిలా సెట్ చేసి వచ్చింది. అంతకంటే అతన్ని ఏం చెయ్యాలో ఆమెకు తోచలేదు. కరుడుగట్టిన దొంగలు, హంతకుల్లా అతడి గొంతు కోసేయ్యడమో, లేక ఏ లోయలోనో తోసేసో రాలేకపోయింది. ఏ హోటల్ రూమ్ లోనో పెట్టేంత సాహసం కూడా చెయ్యలేకపోయింది. మూడోకంటికి తెలియకుండా అతన్ని కొంతసేపు అడ్డు తొలగించుకోవడానికి తను చేసిన పనే కరెక్ట్ అనుకుంది.

ఇప్పుడు డిసౌజా రోజంతా తనను అటకాయించాలని చూస్తున్నాడు. మరీ ఇంత సెక్సీగా డ్రస్ చేసుకుని రాకపోవలిసింది అనుకుంటూ కలవరపడుతోంది. కానీ అతని మాటకి ఎదురు చెపితే ఏం చేస్తాడో తెలీదు. అతని టెంపర్ గురించి చెవులు ఊడిపోయేదాకా చెప్పి పంపించారు వినయ్, మాలిని.

‘Certainly సర్. బట్ పని స్కోప్ ఎంతో తెలిస్తే నా day ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది’ అని చిరునవ్వుతో చెప్పింది. ‘మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు. Accommodation గురించి వర్రీ అవుతుంటే ఐ హావ్ plenty ఆఫ్ రూమ్స్’ అంటూ విల్లాను చూపించాడు. ఆ క్షణమే ఏదో ఒకటి చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోవాల్సింది సునయన. అలా చేయకపోవడం ఆమె చేసిన ఆఖరి తప్పు.

ఈ తప్పులన్నిటికీ తోడు వినయ్, మాలినిలు తెలిసీ తెలియని ఇన్ఫర్మేషన్ తో ఆమెను ఇక్కడికి పంపడంతో ఇబ్బందుల్లో పడింది. వాళ్లలా ఎందుకు చేశారో కూడా మున్ముందు చూద్దాం.

కాసేపు విల్లా అంతా తిప్పి చూపించాడు డిసౌజా. అతడి దగ్గర art, sculpture, ఇతర వస్తురూపంలోనే ఇంత సంపద వుంటే ఇక అసలు ధనం ఎంత వుండివుంటుందో అంచనా కట్టలేకపోయింది సునయన. డిసౌజా ఏదో కాస్త డబ్బున్న వెర్రిబాగులాడు అనుకొని వచ్చింది ఇక్కడికి. కానీ ఇంత సంపద వెనకేశాడంటే అతడెంత ruthless అయి వుండాలో తెలియని చిన్నపిల్లేమీ కాదు. మొదటిసారిగా తానెంత తప్పు చేస్తున్నదో ఆమెకు తెలిసొచ్చింది.

ఫ్రాన్స్-వా డిసౌజా లాంటివాళ్లు తమను మోసం చేసిన వాళ్ళను ఊరికే వదిలే రకాలు కాదు. ఎంత డబ్బు ఖర్చైనా తమను ఇబ్బంది పెట్టిన వాళ్ళ అంతు చూసే రకాలు. ఇది realize అయ్యేసరికి ఆమె ఒళ్ళు జలదరించింది.

‘మీరు ఓకే నా మిస్ మాలినీ’ అని డిసౌజా అంటే ‘రాత్రి ప్రయాణంలో చిన్న hiccup అని చెప్పాను కదా సర్. సరిగా నిద్ర పోలేదు. కొంచెం tired అంతే’ అంటూ కవర్ చేసింది. ‘గార్డెన్ లో ఫ్రెష్ ఎయిర్ బాగుంటుంది. వెళ్దాం రండి’ అంటూ బయటకు తీసుకెళ్ళాడు.

గార్డెన్ లోకి వచ్చాక నిజంగానే కొంచెం మనసు తేలికపడింది సునయనకు. విల్లాను చూస్తే జైల్ లా అనిపిస్తోంది ఆమెకు. ఇప్పుడు ఇక్కడ్నుంచి సేఫ్ గా ఎలా బయటపడాలో అని ఆలోచిస్తోంది. మనసులో ఎంత భయం వున్నా ఛార్మింగ్ గా వుండడానికే ప్రయత్నం చేసింది అతడితో. కొంత సఫలీకృతం అయినట్టుంది, లంచ్ చాలా తొందరగా ముగించారు. సుందర్ అయిపు జాడ లేకపోవడంతో ఇంకొంచెం శాంతించింది సునయన.

కొంతసేపయ్యాక అసలు మాటర్ లోకి వెళ్ళాడు డిసౌజా. ‘రండి, లేటెస్ట్ బ్యాచ్ చూద్దాం’ అంటూ ఆమెను తన ప్రైవేట్ స్టడీ కి తీసుకెళ్ళాడు. రూమ్ లోపలనుండి lock చేసి ఒక చిన్న బాక్స్ ను అక్కడున్న టేబుల్ పైన పెట్టాడు. సునయన తన బాగ్ లోనుండి చిన్న loupe బయటకు తీసింది.