భ్రాంతి 3 145

క్రితంసారి అతన్ని చూసినప్పుడు మనిషి మంచి దిట్టంగా వున్నాడు. ఇప్పుడు సగమైపోయాడు. సునయన గురించి అడగాలని ఎంత పీకుతున్నా ‘వుంటారా ఊళ్ళో? నాన్న వచ్చాక తనకి తెలిసిన డాక్టర్ ని ఎవర్నైనా రికమెండ్ చేస్తారు’ అన్నాడు. ‘లేదు బాబూ, నన్నెవరూ కాపాడలేరు. ఇది భగవంతుడు నాకు వేసిన శిక్ష’ అన్నాడు ధనుంజయ్.

తప్పుగా అనిపించినా ఆపుకోలేక ‘మీకు నేను గుర్తున్నానో లేదో, నా పేరు కిరీటి. సునయన వచ్చిందా మీ కూడా’ అని అడిగాడు.

‘గుర్తున్నావయ్యా. తను రాలేదు ఈసారి. కానీ ఎప్పుడూ నీ గురించి ఏదో ఒకటి తలుచుకుంటూ వుంటుంది’ అన్నాడు. కిరీటి కొన్ని నెలలుగా తెలియకుండా అనుభవిస్తున్న ఓ బాధని ఆ క్షణంలో మర్చిపోయాడు. సునయన తనని ఇంకా మర్చిపోలేదు!

‘తను మళ్ళీ ఎప్పుడైనా ఇటు….’ అంటుండగానే ధనుంజయ్ తల ఊపి ‘తనకి ఏ మాత్రం సెన్స్ వున్నా ఇంక ఈ ఊరికి రాదు’ అన్నాడు. ఆ మాటకి కిరీటి కళ్ళల్లో కనబడ్డ హారర్ చూశాడేమో మెల్లిగా వాడి భుజంపై చెయ్యి వేసి ‘క్షమించు, తప్పుగా మాట్లాడాను. ఆమెకు ఇక్కడ ఏం పని దొరుకుతుంది? ఆమె ఇక్కడికి రాకపోయినా నువ్వు ఆమెను వేరే చోట కలవొచ్చు. నీ మాటగా ఏమన్నా చెప్పమంటావా?’ అని అడిగాడు.

ఓ పుస్తకానికి సరిపడా మాటలు దాగున్నాయి వాడి మనసులో. ‘నేను కూడా తనని మర్చిపోలేదని చెప్పండి’ అని మటుకు బయటకు అనగలిగాడు కిరీటి. ‘సరే’ అంటూ వెళ్లిపోయాడు ధనుంజయ్.

అలా వెళ్ళిన ధనుంజయ్ సరాసరి బెంగళూరు వరకూ ఆగకుండా ప్రయాణించాడు. అక్కడ అతన్ని పరీక్షించిన డాక్టర్లు మేమేమీ చెయ్యలేమని చేతులెత్తేశారు. బెడ్ రెస్ట్, బలమైన ఆహారం, చాలా అదృష్టం వుంటే తప్ప ఆర్నెల్లకంటే ఎక్కువ బతకడని తేల్చి చెప్పారు. తరచూ స్పృహ కోల్పోతున్నాడు ధనుంజయ్.

ఒక రోజు మెలకువగా వున్నప్పుడు ఒక telegram పంపించాడు. ‘నీ కోసం బెంగళూరు లో ఎదురు చూస్తుంటాను. నన్ను కలిసేవరకూ పనిలో ముందుకు వెళ్ళొద్దు’ ఇది దాని సారాంశం. Telegram అందుకున్న వ్యక్తి ఒక రెండు వారాల్లో ధనుంజయ్ ని కలిశాడు. అతని స్థితిని చూసి షాక్ తిన్నాడా వ్యక్తి. ధనుంజయ్ చెప్పిన విషయం నమ్మశక్యంగా లేదు అతనికి. కానీ కళ్ల ఎదురుగా చావుబతుకుల్లో వున్న ధనుంజయ్ ని చూసిన తర్వాత కొంత convince అయ్యాడు. ఆచితూచి అడుగేస్తానని హామీ ఇచ్చి వెళ్ళాడు.

ఇంకొక వారం రోజుల్లో ధనుంజయ్ ను మరొక వ్యక్తి కలిసింది. ఈ సారి వచ్చింది సునయన. అతడ్ని చూసీ చూడగానే అల్మోస్ట్ మూర్ఛపోయింది. సునయన నోరెత్తకముందే ధనుంజయ్ ఆమెను ఆపేశాడు. ‘మాట్లాడకుండా నేను చెప్పేది పూర్తిగా విను. మొదటి మాట, నీ boyfriend నిన్ను మర్చిపోలేదు అని చెప్పమన్నాడు’ ఈ కాస్త మాటలకే బలంగా ఊపిరి పీలుస్తున్నాడు.

‘He was so kind to me’ కిరీటి చూపిన ఆదరం గుర్తొచ్చి అతని కనుల్లోనుంచి తడి చేరింది. ‘ఆ అబ్బాయి మంచితనం చూసి కొందరమ్మాయిలు ఇప్పటికే అతనికి attract అయిపోయారు. కానీ అతను నిన్ను మాత్రం మర్చిపోలేదు. శ్వాస అందుకోవడానికి ఎగబీలుస్తున్నాడు. ‘ఎంతో లక్ వుంటే కానీ అలాంటి వ్యక్తులు మన జీవితంలోకి రారు. you are lucky.’ సునయన తన మొహాన్ని చేతుల్లో దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తోంది ఈ మాటలకి.

ధనుంజయ్ మళ్ళీ మాట్లాడటానికి శక్తి కూడగట్టుకుంటున్నాడు. అక్కడ అతని భారమైన ఊపిరి, సునయన వెక్కిళ్లు తప్ప మరో శబ్దం లేదు. ‘Look at me. రెండో మాట, వినయ్ దగ్గర నుంచి నువ్వు వెళ్లిపోయే టైమ్ వచ్చింది. వాడినుంచి ఇంక నేను నిన్ను కాపాడలేను. ఇప్పుడు చేస్తున్న జాబ్ ఫినిష్ చెయ్యి. అందినంత తీసుకొని గెట్ ద హెల్ ఎవే ఫ్రమ్ హిమ్. ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచలాపురం జాబ్ లో involve అవ్వొద్దు.’

సునయన నోరు పెగల్చుకొని ‘అసలేమైంది అక్కడ’ అని అడిగింది. ధనుంజయ్ తన కాలిపోయిన చెయ్యి చూపించాడు. ‘మహిమ, దైవ మహిమ. విగ్రహం తాకినందుకు నాకు పడిన శిక్ష’ అంటూ శుష్కించిపోయిన తన బాడీ ని చూపించాడు.

ఇది జరిగిన కొన్ని రోజులకి ధనుంజయ్ ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు. చనిపోయేముందు జరిగిందంతా వివరంగా ఓ ఉత్తరంలో రాసి సునయనకిచ్చాడు. ధనుంజయ్ అంత సీరియస్ వార్నింగ్ ఇచ్చినా కూడా సునయన, కిరీటి మళ్ళీ కలవాల్సిన పరిస్థితులు వచ్చాయి. అది మన కథలో చివరి అంకం. ఈలోపు మనం చెప్పుకోవాల్సినవి చాలా చాలా జరిగాయి.

Back to పెంచలాపురం…….

ధనుంజయ్ కి కట్టు కట్టి పంపించాక కిరీటి తయారయ్యి తన స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. రంగ అప్పుడే వచ్చినట్టున్నాడు గోరు వాడికేదో ఉత్సాహంగా చెప్తున్నాడు. ‘అరేయ్ మామా, రంగ మిస్ అయిండురా రేత్తిరి గలాటా. నువ్వు కూడా సెప్పు’ అంటే ‘ఏం జరిగిందిరా రాత్రి?’ అని ఎదురు ప్రశ్న వేశాడు.

‘ఓర్నీయవ్వ, ఊళ్ళో ప్రతి మడిసి లెగిసి గుడికాడకి లగెత్తుకొచ్చినారు గందా! నువ్వేడుండావు?’

‘రాత్రి పడుకున్నవాడిని ఇప్పుడే ఒక గంట క్రితం లేచానురా. ఏమన్నా విశేషం జరిగిందా.’

గోరు ఒక గొప్ప సీక్రెట్ బయటపెట్టేవాడిలా వాళ్ళని కాసేపు ఊరించాడు. ఇద్దరూ అల్మోస్ట్ మీద పడి కొట్టినంత పని చేసేసరికి ‘సెబుతా, ఆగండ్రా’ అని వాళ్ళు నోరెళ్ళబెట్టే విషయం చెప్పాడు. ‘రేత్తిరి గుళ్ళో దొంగలు పడినారు. ఎంతమందో తెలీదు. సూరీడి ఇగ్రహం ఎత్తుకెళదామని వొచ్చారు లాగుంది. కానీ సామి మహిమ. రగతం కక్కుకు సచ్చారు దొంగనాయాళ్ళు.’

3 Comments

  1. Superb bro story ilane continue chyndi manchi flow lo undhi madhyalo apakandi dayachesi

  2. Ilanti vedavapooku stories ni continue ga post chestaru.

    1. Indhulo vedapuku em undhi Andi.. ante story motham sex untene adhi story na Ila unte story avadha Andi … Dengudu stories kavali ante xossipy site undhi andhulo adhi visit chyndi…. Ayina istam lekapothe silent ga undochu ga endhuku comment petti mari gelukovadam… Sorry emina athiga matldithe ?…

Comments are closed.