భ్రాంతి 3 145

ఎప్పటిలాగానే విగ్రహం తాకితే కిరీటికేమీ కాలేదు. ప్రెసిడెంటు గారింట్లో పోగైన జనాలు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఊరేగింపు బ్రహ్మాండంగా జరిగింది. చుట్టుపక్కల ఊళ్లలోని తమ బంధువులను పిలిచారట్టుంది పెంచలాపురం వాసులు; విగ్రహాన్ని చూడడానికి జనాలు తండోపతండాలుగా వచ్చారు.

ఆ రాత్రి పెద్ద గుంపు గుడి దగ్గర కాపలా కాసింది. చీమ చిటుక్కుమన్నా పోటుగాళ్ళు పరుగులెత్తారు. మర్నాటి వుదయం యధావిధిగా పూజలు చేసి కిరీటి చేతుల మీదుగా విగ్రహాన్ని జాగ్రత్త చేయించారు. అక్కడితో మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకూ గొడవ లేదనుకున్నారు. కానీ విగ్రహం మీద ఎవరిదో కన్ను వుందన్న సంగతి మటుకు మర్చిపోలేదు ప్రెసిడెంటు గారు. ఆయన ఇంటిలోకి ప్రవేశం బంద్ అయ్యింది ఊరి జనాలకి. ఎప్పుడూ తన ఇంటి అరుగుల మీదనుంచే పంచాయితీ నడిపిన పెదబాబు గారు ఇప్పుడు గ్రామ పంచాయితీ కార్యాలయానికి వెళ్తున్నారు రోజూ.

ఫిబ్రవరి వెళ్ళి మార్చి నెల వచ్చింది. నిక్కీ మొదటి సంవత్సరం పిల్లలకి పరీక్షలు మొదలయ్యే ముందు వారం రోజులు revision క్లాసులు చెప్పి వాళ్ళ మానాన వాళ్ళని వదిలేసింది ఇక. పరీక్షలు మొదలయ్యే రోజు వరకూ ఎదురు చూశారు మిత్రులు కిట్టి వస్తాడేమో అని. కానీ వాడి ఐపూ జాడా కానరాలేదు.

పరీక్షలు పూర్తవగానే పంజరంలో పక్షులు బయటకు ఎగిరినట్టు సంబరాలు చేసుకున్నారు ముగ్గురు మిత్రులూ. పట్నానికి పోయి పొద్దుటినుంచి సాయంత్రమ్ వరకూ రంగా వాళ్ళ హాల్లో సినిమాలు చూశారు. ఊరు ఊరంతా దున్నేశారు. వాళ్ళ ఆనందంలో చిన్న లోటు కిట్టి అక్కడ లేకపోవడం.

పరీక్షల ఫలితాలు చూసిన ప్రిన్సిపాల్ గారు, కాలేజీ స్టాఫ్ చాలా ఆనందించారు. మన మిత్రుల విషయానికి వస్తే కిరీటి, రంగ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు. గోరు సెకండ్ క్లాస్ లో గట్టెక్కాడు. ప్రిన్సిపాల్ గారు నిక్కీని, శైలుని తన ఆఫీసు కి పిలిపించుకొని మాట్లాడారు. ‘అమ్మా నిక్కుమాంబా, ముందుగా మా స్టాఫ్ తరఫున ఇదుగో చిరు కానుక అంటూ ఆమెకు డబ్బులు అందజేశారు. నిక్కీ కన్నీళ్లతో వారికి నమస్కరించి ‘చాలా థాంక్స్ సర్. మీ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను’ అంది.

‘నీకేమీ ఊరకనే ఇవ్వలేదు కదమ్మా డబ్బులు. మా స్వార్ధం కొద్దీ నిన్ను వాడుకున్నాము. మీ స్నేహితుడు కిరీటి చెప్పినదాన్ని బట్టి మా పిల్లలకి సహాయపడగలరు అని నమ్మి నిన్ను, శైలుని కలిశాను. నా అంచనా తప్పు కాలేదు. You deserve this reward’ అన్నారు. నిక్కీ, శైలు సంతోషంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.

‘ప్రతి సంవత్సరం ఫలితాల విడుదల తర్వాత కాలేజీ స్టాఫ్ అంతా రాజా వారి ఎస్టేట్ కి వెళ్తాము. మీరు నా కూడా రండి. శైలుని hire చేసుకుంటున్న విషయం కూడా వారికి చెప్పాలి. నేను వారికి నీ గురించి చెప్పడమే అక్కడ చెయ్యగలిగిన సాయం. మొదటే చెప్పినట్లు తరువాత భారం దేవుడిదే’ అంటే నిక్కీ కడుపులో ఏదో తెలియని భయం ఉండ చుట్టేస్తోంది.

లేచి వెళ్లిపోతూ గుమ్మం దాకా వెళ్ళిన శైలు ‘మాతో తోడుగా ఎవరైనా రావొచ్చునా సార్’ అని అడిగింది. ఎందుకన్నట్లు ప్రిన్సిపాల్ గారు చూస్తే ‘ఇద్దరం ఆడపిల్లలం. మా వాళ్ళు మమ్మల్ని ఒంటరిగా పంపకపోవచ్చును. పెంచలాపురంలో ఈ మధ్య జరిగిన గొడవలు వినే వుంటారు’ అంది. ‘ఓహ్, అవును కదూ. సరేనమ్మా, నేను రాజా వారి ఎస్టేట్ మేనేజర్ కి చెబుతాను ఇంకొక గది ఏర్పాటు చూడమని’ అన్నారు.

‘ఏంటే నీ ప్లాన్’ అని నిక్కీ అడిగితే ‘అక్కడికి నీకు తెలీనట్టు యాక్ట్ చేయకు. ముందుగానే అనుకున్నాం కదా. ఆచారి గారిని ఎలా ఒప్పించాలో అది ఆలోచించు’ అని తన చేతి మీద కొట్టింది శైలు ముసిముసి నవ్వులు నవ్వుతూ. మీకర్ధమయ్యే వుంటుంది వీళ్ళిద్దరి టార్గెట్ ఎవరో. కిరీటి గురించి మాట్లాడేటప్పుడు శైలు కళ్ళల్లోని మెరుపుని మిస్ కాలేదు నిక్కి.

రమణాచారి, ప్రెసిడెంటు గారు కలిసి కూర్చున్నప్పుడు శైలు, నిక్కి తమకు కిరీటి తోడు కావాలని కాస్త దీనంగా ముఖం పెట్టి అడగ్గానే ఇద్దరూ ఒప్పేసుకున్నారు. ‘ఆడకూతుళ్ళకి తోడు ఎల్లనంటే ఆడ్ని ఇయ్యాలే ఊర్నించి తరిమేత్తా’ అన్నారు పెద్దాయన. ‘మరి వచ్చే సంవత్సరం పండక్కి అవసరం లేదా మా వాడు’ అని రమణాచారి నవ్వుతూ అడిగితే ‘ఇదోటి దొరికింది అయ్యా బాబులకి నా తల మీద కత్తి ఏలాడగట్టటాకి’ అంటూ విసుక్కున్నారు పెద్దాయన.

ఇద్దరమ్మాయిలూ హుషారుగా కిరీటికి తమతో రావాలి అన్న విషయం చెబితే గోరు నేను కూడా రావొచ్చా అని అడిగాడు ఆశగా. ‘మా ఇద్దరికీ ఉద్యోగాలు వేయించింది ఎవరు నువ్వా, వాడా?’ అని అమ్మాయిలు వాడి మీద ఫైర్ అయ్యారు. ఒక్క నిక్కీ ఐతే పోట్లాడేవాడేమో కానీ శైలు కూడా వుండేసరికి మిన్నకుండిపోయాడు గోరు.

3 Comments

  1. Superb bro story ilane continue chyndi manchi flow lo undhi madhyalo apakandi dayachesi

  2. Ilanti vedavapooku stories ni continue ga post chestaru.

    1. Indhulo vedapuku em undhi Andi.. ante story motham sex untene adhi story na Ila unte story avadha Andi … Dengudu stories kavali ante xossipy site undhi andhulo adhi visit chyndi…. Ayina istam lekapothe silent ga undochu ga endhuku comment petti mari gelukovadam… Sorry emina athiga matldithe ?…

Comments are closed.