భ్రాంతి 3 144

వీళ్ళ గ్రూప్ లో రంగా, కిరీటి మంచి స్టూడెంట్లు. కొన్ని సుబ్జెక్టుల్లో కిరీటి ముందుంటే కొన్నిట్లో రంగ ముందుంటాడు. మొత్తానికి నలుగురూ ఎలాగో ఒకలా బండి నడుపుతున్నారు. రంగ తండ్రికి దగ్గర్లోని పట్నంలో సినిమా హాల్ వుంది. ఆర్ధికంగా మెరుగైన స్థితిలో వున్నవాళ్లు. ఇక కిట్టి కుటుంబం కూడా ఊళ్ళోని సంపన్న వైశ్య కుటుంబాల్లో ఒకటి.

‘కిట్టి గాడు ఈ మధ్యన ఎందుకు అలా వుంటున్నాడో ఏమన్నా తెలిసిందారా?’ అని అడిగాడు కిరీటి. గత కొన్ని నెలలుగా కిట్టి చదువు మీద శ్రద్ధ పెట్టడం తగ్గిస్తూ వస్తున్నాడు. మిగతా ముగ్గురు మిత్రులు ఎంత ప్రయత్నం చేసినా విషయం ఏమిటనేది తెలుసుకోలేకపోతున్నారు.

‘ఏమోరా, ఆడ్ని ఇంక తన్ని తగలేత్తే గాని నోరిప్పేట్టు లేడు’ అన్నాడు గోరు. కొంచెం సేపు తిరిగిన తర్వాత ‘రంగ రాడురా ఇయ్యాల. పండగ కదా, హాల్లో టికెట్లు తెంపటాకి ఇంకో సెయ్యి కావాలని ఆళ్ళయ్య ఆడ్ని తన కూడా తోలుకుపోయిండు’ అన్నాడు.

‘కిట్టిని ఇందాక స్టేజ్ దగ్గర చూశాను. అక్కడికి పోదాం’ అని కొంచెం వడివడిగా ముందుకు వెళ్ళి ఇద్దరమ్మాయిలకీ అక్కడికి వెళ్దామని చెప్పాడు కిరీటి. వీళ్ళందరూ అక్కడికి చేరుకొనేసరికి హరిశ్చంద్రుడి నాటకం మొదలైంది. ‘అరేయ్, ఆ భటుడి యేసం గట్టినోడు ఎవడ్రా, మన తాలూకా లానే వున్నాడు’ అని గోరు అంటే పరకాయించి చూస్తే అది కిట్టి అని తెలిసింది స్నేహితులిద్దరికీ. డైలాగులు లేవు కానీ స్టేజ్ మీద నుంచుని ఆనందపడిపోతున్నాడు కిట్టి.

‘ఈడు కితం సారి సంత జరిగిన కాడినుంచి రాములు బాబాయి అని భజన సేత్తంటే ఏటో అనుకున్నారా. నాటకాల పిచ్చి గానీ ఏమన్నా ఎక్కిందా ఏటి మనోడికి’ అని గోరు అంటే కిరీటికి ఎందుకో అది నిజమే అనిపించింది. ‘నీకు గుర్తుందారా, లాస్ట్ టైమ్ రికార్డ్ రాయమంటే వాడు మీ దగ్గర లేకుండా వచ్చేశాడు? ఆ రోజు వాడ్ని ఇక్కడే ఆయనతో చూశాను’ అన్నాడు. ‘ఆడికి కొంచెం గట్టిగా సెప్పరా బాబూ. పరీచ్చలు దగ్గరకొస్తాండాయి. నాటకాలు అయ్యి అయిపోయినంక ఆడుకోవచ్చు. ఐనా ఆళ్ళ బాబుకి తెలిత్తే ఈడి తల గొట్టి మొలేస్తాడు’ అన్నాడు గోరు. రంగ వచ్చాక ముగ్గురూ కలిసి వాడిని అడుగుదామని డిసైడ్ అయ్యారు. ఏ మాటకామాటే చెప్పుకోవాలి. రాములు మంచి నటకుడు. హరిశ్చంద్రుడిగా ఆయన, లోహితాస్యుడి వేషం వేసిన పిల్లవాడు అద్భుతంగా చేశారు.

కారుచీకట్లు కమ్ముకోకముందే ఇంటికి చేరుకోవాలి అని కిరీటి, శైలు తమ ఫ్రెండ్స్ కి వీడ్కోలు పలికి బయల్దేరారు. కిరీటి బండి నడుపుతుంటే శైలు వాడి వెనుక కూర్చుని వుంది. ఎప్పటిలా కాకుండా శైలు మౌనంగా వుంది. కాసేపాగాక ‘శైలూ, అంతా ఓకేనా? మిమ్మల్ని..నిన్ను ఎప్పుడూ ఇలా సైలెంట్ గా చూడలేదు’ అన్నాడు. జవాబుగా వాడి నడుము చుట్టూతా తన చేతులు ఇంకా గట్టిగా బిగించి తల వాడి వీపు మీద వాల్చి పడుకుంది.

ఆమెను ఇంటి దగ్గర దిగబెట్టి మొత్తానికి తన ఇంటికి చేరుకున్నాడు కిరీటి. వాడికి ఏమీ ఆలోచించే ఓపిక కూడా లేదు. మంచం మీద పడి నిద్రలోకి వెళ్లిపోయాడు. ఓ రాత్రి వేళ ఊళ్ళోనుంచి పెద్ద పెద్ద అరుపులు కేకలు వినవచ్చాయి. అదీ ఇదీ అని చెప్పలేని అలసటలో వున్నాడు కిరీటి. వాడికి కనీసం మెలకువ కూడా రాలేదు ఆ అరుపులకి.

సూర్యుడు పూర్తిగా ఉదయించకముందే ఎవరో ఇంటి తలుపులు తడుతుంటే మేల్కొన్నాడు కిరీటి. ఇంకా తెరిపులు పడని కళ్ళతోనే లేచి వెళ్ళి ‘ఎవరూ’ అని అడిగాడు. ఎదురుగా ఎవరో తెలియని వ్యక్తి. చేతికి కట్టు కట్టుకొని వున్నాడు. మనిషి బాగా శుష్కించి పోయి వున్నాడు. ఒకప్పుడు బాగా పుష్టిగా వుండేవాడేమో అతను వేసుకున్న బట్టలు ఒంటి మీద లూజుగా వేళ్లాడుతున్నాయి. ‘డాక్టర్ గారున్నారా?’ అని అడిగాడు. చేతి గాయం విపరీతంగా బాధ పెడుతోందేమో ఉండుండి అతని ముఖ కవళికల్లో లో బాధ తాలూకా గుర్తులు ప్రతిఫలిస్తున్నాయి.

‘ఊళ్ళో లేరు నాన్న. మీ చేతికేమైంది’ అని అడిగాడు కిరీటి. ఒక్క చెయ్యే కాదు మనిషి శరీరం మొత్తం తేడాగా వున్నట్లు వున్నాడు ఆ వ్యక్తి.

‘రాత్రి సంతలో మా షాపులో సామాన్లు సర్దుతూ పొరపాట్న కరంట్ వైర్ పట్టుకున్నాను. బాగా కాలిపోయింది’ అన్నాడతను.

‘అరెరే, లోపలికి రండి. Dettol తో కడిగి గాజ్ క్లాత్ తో కట్టు కడతాను. ఆ మాత్రం చేయగలను నేను’ అంటూ అతన్ని లోపలికి తీసుకెళ్ళాడు. అతను కట్టుకున్న కట్టు తీసి చూస్తే చెయ్యి భయంకరంగా కమిలిపోయి వుంది. ‘అయ్యో, ఇంతలా ఎలా జరిగిందండీ? రాత్రికే రావాల్సింది మీరు’ అంటూ చేతనైనంత మేర క్లీన్ చేసి వాళ్ళ నాన్న చెప్పిన ointment ఏదో గుర్తు తెచ్చుకొని రాసి కట్టు కట్టాడు. ‘చాలా థాంక్స్ బాబు, డబ్బులు’ అంటూ జేబులో చెయ్యి పెట్టబోతుంటే ఆపి ‘మీరు పట్నంలో హాస్పిటల్ కి వెళ్ళాక ఎలాగూ అవసరం అవుతాయి, వుంచండి’ అంటూ ఆపేశాడు.

ఆ వ్యక్తి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ‘థాంక్స్ బాబూ, వస్తాను’ అంటూ లేచాడు. ‘ఇప్పుడే లేచాను నేను. మీరు కొంచెం సేపు కూర్చుంటే టీ తాగి ఏమన్నా తిని వెల్దురు’ అన్నాడు కిరీటి. ‘బాబూ నువ్వు ఆ మాట అన్నావు చాలు’ అని వెళ్తుంటే అతని నడక తీరు చూసి ఎవరో గుర్తు పట్టాడు కిరీటి సడన్ గా. ‘మీరు ధనుంజయ్ కదూ’ అన్నాడు అదురుతున్న గుండెతో. ఆ వ్యక్తి ఆగి ‘ఆ ధనుంజయ్ చచ్చిపోయాడు, ఇప్పుడు మిగిలింది ఇదిగో ఇది’ అంటూ తన బాడీ వైపు చూపించాడు.

3 Comments

  1. Superb bro story ilane continue chyndi manchi flow lo undhi madhyalo apakandi dayachesi

  2. Ilanti vedavapooku stories ni continue ga post chestaru.

    1. Indhulo vedapuku em undhi Andi.. ante story motham sex untene adhi story na Ila unte story avadha Andi … Dengudu stories kavali ante xossipy site undhi andhulo adhi visit chyndi…. Ayina istam lekapothe silent ga undochu ga endhuku comment petti mari gelukovadam… Sorry emina athiga matldithe ?…

Comments are closed.