భ్రాంతి 3 145

ప్రెసిడెంటు గారి ఇంటికి చేరుకొనే సరికి మధ్యాహ్నం అయింది. ఆయనిచ్చిన మెత్తని పట్టు బట్టలో విగ్రహాన్ని చుట్టి ఆయన చూపించిన భోషాణంలో విగ్రహాన్ని జాగ్రత్తగా పడుకోబెట్టాడు కిరీటి. ఎప్పుడు నిద్రలేచి బయటకు వచ్చిందో మరి, అంతవరకూ ఉగ్గబట్టుకొని వున్న శైలు వాడు బయటికి రాగానే తన అత్తా, మామల ముందే వాడిని గట్టిగా చుట్టేసింది. ‘ఈడి బాబు కంటే ఈడే నయం అమ్మీ’ అంటూ కళ్ళు ఒత్తుకున్నారు పెద్దాయన కూడా.

పూజారి గారు పంచాంగం చూసి ‘ఇంకో పదహారు రోజుల్లో రథసప్తమి. లోటుపాట్లు లేకుండా ఊరేగింపు చేద్దాము. నాయనా, ఈసారి కూడా పుణ్యం కట్టుకో. వచ్చే సంవత్సరం వరకూ అందరూ కుదుటపడొచ్చు’ అని కిరీటిని ఒప్పించారు.

తరువాతి రోజుల్లో ఊరి జనాలు కాస్త సర్దుకున్నారు. కానీ జరిగిన దాని ప్రభావం వెంటనే సద్దుమణగలేదు. ఊళ్ళో కొత్త ముఖాలు కనిపిస్తే కాస్తంత అనుమానంగా చూస్తున్నారు. ప్రెసిడెంటు గారిల్లు కోటలా మారింది. ఊళ్ళోని ముసలీ ముతకా వాళ్ళ చిన్నప్పుడు విగ్రహం గురించి విన్న కథలన్నీ తవ్విపోసుకుంటున్నారు. చాలా పల్లెటూళ్ళలగానే ఏమన్నా జరిగితే సమస్య పరిష్కారం కోసం తమ బలాన్ని నమ్ముకున్నారే గానీ సెక్యూరిటీ ఆఫీసర్ల కోసం పరిగెత్తలేదు.

రమణాచారి ఊరి నుండి వచ్చాక పెదబాబు, ఆయన, పూజారి గారు కూర్చుని ఏం చెయ్యాలో ఆలోచించటం మొదలెట్టారు. పూజారి గారు చెప్పినట్టు పెంచలయ్య వారసులు ఊరేగింపులో పాల్గొని దశాబ్దాలు గడిచిపోయాయి. ఇప్పుడసలు వాళ్ళ వంశస్థులు ఎక్కడున్నారో ఏమిటో ఎవరికీ తెలియదు. వారిని వెదకటానికి గట్టి ప్రయత్నం చేయాలని నిశ్చయం జరిగింది. నిజానికి వాళ్ళు పెంచలాపురంలోనే వుండాలి. కానీ కాలక్రమంలో పక్క ఊళ్ళకి ఏమన్నా చేరారా అనేది కనుగొనే ప్రయత్నం మొదలైంది. విగ్రహం సంగతి ఏం చెయ్యాలో పాలుపోలేదు వాళ్ళకి. ఇది ఒకటి రెండు రోజుల్లో తేలే వ్యవహారంలా అనిపించలేదు.

ఈ సందడి ప్రభావం కిరీటి నిక్కీలను బాగా ఇబ్బంది పెట్టింది. వాళ్ళిద్దరూ ఒంటరిగా కలుసుకోవడానికి అవకాశాలు మృగ్యం అయ్యాయి. ఎప్పుడన్నా కలుసుకుంటే శైలు ఇంట్లో కలవడమే. కానీ ఇల్లంతా పాలెగాళ్లతో నిండిపోవడంతో అక్కడ కూడా ఏకాంతం అనేది అరుదుగా దొరుకుతోంది. చదువు మళ్ళీ మొదలెట్టచ్చు అన్న ఆశ, కిరీటిని వదిలి వెళ్లిపోవాలి అన్న దుఃఖం, ఈ ద్వైదీభావంలో పడి కొట్టుమిట్టాడుతోంది నిక్కి.

శైలు పరిస్థితి ఇంకా దారుణం. ఆనాటి తుఫాను వంటి కలయిక తర్వాత కిరీటి తన ముందుంటే వాడ్ని కౌగిలిలో బంధించకుండా వుండలేకపోతోంది. కానీ తన స్నేహితురాలి బాధ చూసి తనను తాను అదుపులో వుంచుకుంటోంది.

మన మిత్రుల జీవితంలో ఇంకొక పెద్ద మార్పు కూడా సంభవించింది. సంక్రాంతి పండగ తర్వాత రోజునుండీ కొన్నాళ్ళ పాటు కిట్టి కనబడలేదు వాళ్ళకి. కాలేజీకి కూడా రావడం మానేశాడు. కొన్ని రోజులయ్యాక ముగ్గురు స్నేహితులూ కలిసి వాడి ఇంటికి వెళ్లారు. కిట్టి ఇంట్లో వాతావరణం గంభీరంగా వుంది. కిట్టి తల్లి ఎంతో బాధలో వున్నట్టు కనిపించింది. వాడి తండ్రి ఊళ్ళో లేరు. కిట్టి గురించి అడిగితే వాడి తల్లి బావురుమని ఏడ్చి వాడు రాసిన ఉత్తరం చేతిలో పెట్టింది. ఇంట్లోనుంచి వెళ్లిపోతున్నానని, తన కోసం ఎవరూ వెతకొద్దని రాశాడు కిట్టి. దాన్ని చదివిన మిత్రులు నిర్ఘాంతపోయారు.

‘ఎక్కడికి పొయ్యాడో ఏమో తెల్వదు బిడ్డ. నా పెనిమిటి వారం బట్టి కాలికి బలపం కట్టుకు తిరుగుతాండు. చుట్టపక్కాలు బుగ్గలు నొక్కుకోడం జూసి సావాలనిపిస్తాంది’ అంటూ భోరుమన్నది కిట్టి తల్లి. ముగ్గురు మిత్రులూ షాక్ లో బయటికి వచ్చారు. ‘వీడు ఇలాంటి పని చేశాడేమిటి రా’ అని తమలో తాము డిస్కస్ చేసుకుంటున్నారు. గోరు వున్నట్టుండి కిరీటి తో ‘రేయ్, మనోడు ఆ నాటకాల కంపెనీ వోళ్లతో గానీ చెక్కేసాడంటావా’ అన్నాడు. రంగ అర్ధం కానట్టు చూస్తే సంతలో వీళ్ళు చూసింది చెప్పారు. ‘మరి ఆలోచిస్తాకి ఏముందిరా ఇందులో. పాండి, ఆళ్ళకి సెబితే కనీసం ఏడ ఎతుకులాడాల్నో తెలిసిద్ది ఆడి అయ్యకి’ అంటూ మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాడు.

జరిగింది కిట్టి తల్లికి చెప్పి ‘క్షమించండి అమ్మా, మాకు వాడు ఇంత పని చేస్తాడని అనిపించలేదు. ఏదో సరదా పడుతున్నాడు అనుకున్నామే కానీ ఇలా ఇల్లు వదిలి వెళ్లిపోయేంత రంధిలో వున్నాడని అసలు తెలీదు’ అన్నాడు కిరీటి. ‘బాబ్బాబు.. కనీసం ఏడ వెతకాల్నో ఓ దిశ చూపించినారు. దిక్కు, దివాణం లేక తిరుగుతుండే మా వోళ్ళు’ అంటూ హడావుడిగా ఈ విషయం తన వాళ్ళతో చెప్పటానికి వెళ్లింది ఆమె.

రథసప్తమి వచ్చింది. ఊరంతా మళ్ళీ టెన్స్ గా వుంది. కిరీటిని మళ్ళీ రంగంలోకి దించారు. రమణాచారి, శైలు పెద్దాయన్ని వేరేవిధంగా ఒప్పించడానికి విడివిడిగానూ, కలిసి చాలా ప్రయత్నం చేశారు. ఇద్దరి argument ఒక్కటే. మూఢనమ్మకాలతో ఇలా ప్రవర్తిస్తే పోనుపోనూ విగ్రహం విషయంలో ఊళ్ళో చాలా ఇబ్బందులు ఎదురౌతాయని. వాడి బదులు తాము విగ్రహాన్ని తీసుకొస్తామనగానే ప్రెసిడెంటు గారు కయ్యిన లేచారు.

‘ఆడంటే నాకు ప్రేమ లేక కాదు. లచ్చ రూపాయలిచ్చినా మేము ఇగ్రహాన్ని ముట్టుకునేది లేదని ఊళ్ళో జనాలందరూ సెప్పారు నాకు. దొంగోడు అరిసిన అరుపులు మడిసి అనేవోడు ఎవడూ అంత తేలిగ్గా మర్శిపోడు. పూజారి పెళ్ళాం ఆయనకి తెలవకుండా నా కాడికొచ్చి కాళ్లా యేళ్ళా పడి ఆయనగోర్ని ఒదిలెయ్యమని బామాలింది. అది జూసి నా ఇంటి ఆడది ఏమందో మీకు జెప్పక్కర్లేదు అనుకుంటా. మనోడు ఈ ఒక్కసారికి ఈ పని సేత్తే వచ్చే యేటికి ఏటి సెయ్యాలో ఆలోచియ్యడానికి నాకు వీలు కుదురుద్ది. ఐనా కాదు కూడదంటే ఆచారీ నీ మాట నే కాదన్ను’ అనేసరికి రమణాచారి కొంత అయిష్టంగానే మెత్తబడ్డారు.

3 Comments

  1. Superb bro story ilane continue chyndi manchi flow lo undhi madhyalo apakandi dayachesi

  2. Ilanti vedavapooku stories ni continue ga post chestaru.

    1. Indhulo vedapuku em undhi Andi.. ante story motham sex untene adhi story na Ila unte story avadha Andi … Dengudu stories kavali ante xossipy site undhi andhulo adhi visit chyndi…. Ayina istam lekapothe silent ga undochu ga endhuku comment petti mari gelukovadam… Sorry emina athiga matldithe ?…

Comments are closed.