జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 4 59

పక్కనే ఉన్న పెద్ద వాళ్ళు ఆమె మాట్లాడిన తీరుకు కన్నీళ్లు కారుస్తూ చేతులు జోడించి మొక్కగా వారిని వారించగా ఒక పెద్దాయన మీకు అందుకొని మేము ఇప్పటివరకు చాలా పెద్ద పెద్ద రాజకీయ నాయకులను, ప్రభుత్వాధికారు లను మరియు మిగితా వారిని చాలా మందిని సత్కరించాము కానీ మొట్ట మొదటిసారిగా ఒక మానవతా దేవతా మూర్తిని సత్కరించబోతున్నందుకు అది చూసి మా జన్మలు ధన్యం అని హృదయ పూర్వకంగా శాలువాలు ఇచ్చి పిల్లలు చేతితో చేసిన కళా ఖండాలను ఇచ్చి తమ కృతజ్ఞతలు తెలిపి కింద కూర్చుని తమ పిల్లల యొక్క ప్రతిభలను వీక్షించవలసినదిగా కోరగా , అంతలోనే వెనుక రెండు మిని బస్సులు మరియు రెండు కార్లు వచ్చి ఆగి అందులోనుంది దిగిన డ్రైవర్ లు వాటి తాళాలు తెచ్చి మహేష్ కు ఇవ్వగా మహేష్ స్టేజి మీదకు వచ్చి ఇందు చేతుల మీదుగా వారికి ఇచ్చి ఈ వాహనాలు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి అని చెప్పగా మళ్ళీ చప్పట్లతో మొత్తం మారుమ్రోగిపోతుంది.

ఇందు నెమ్మదిగా స్టేజి దిగి కింద చైర్ లో కూర్చునేవారకు ఆమె వెనక వచ్చి కూర్చున్నాక పక్కన నిల్చుని చిన్న చిన్న పిల్లలు చేస్తున్న డాన్స్ లు, మరియు నవ్వించే నాటకాలు మరియు mymes అన్ని ఆనందంగా చూస్తూ వెనుక పిల్లల అరుపులు ,కేరింతలతో నవ్వుతూ ఆనందంగా గడుపుతారు.

అందరి ప్రోగ్రామ్స్ అయ్యేతప్పటికి 8:30 అవ్వగా ఒకాయన వచ్చి మేడం మీరు ఇక్కడే భోజనం చేసి మమ్మల్ని ఆనందపరచమని గౌరవంగా కోరగా మహేష్ వంక చూసి అడుగగా తల ఉపగా వారి కోరికను మన్నించగా మైకులో అందరిని భోజనాలు చెయ్యడానికి రమ్మని పిలువగా పిల్లలందరూ గట్టిగా అరుచుకుంటు తినడానికి వెళ్తారు.

1 Comment

Comments are closed.