జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 4 59

అక్కడ జరుగుతున్నదంతా చూస్తున్న ఇందుకు ఏమి జరుగుతున్నదో అర్థం కాక మహేష్ వైపు చూడగా తనకు ఏమి తెలియనట్లు ముఖం పెట్టగా , అంతలోనే ఉదయం వచ్చిన పెద్దవాళ్ళు ఆమె దగ్గరికి వచ్చి స్వాగతం పలుకుతూ లోపలికి ఆహ్వానిస్తారు. తన కొడుకు వైపు ఆరాధనగా ఒక సారి చూడగా వెల్లమన్నట్టు ముఖంతో సైగ చెయ్యగా డప్పు చప్పుళ్ళు , అందరి అరుపులు ఇంకా ఎక్కువగా అయ్యి ఆమెను సాదరంగా స్టేజి ముందర వేసిన చైర్ లో కూర్చొనేవారకు దగ్గరుండి అందరూ తీసుకువెళ్లి కూర్చోబెడతారు.

ఆమె కూర్చోగానే మొత్తం నిశ్శబ్దన్గా అయిపోయి మొత్తం అందరూ ఆమె వెనకాలే క్రమశిక్షణతో కూర్చుంటారు. మహేష్ వెళ్లి స్టేజి కి ముందు ఒక పక్కగా నిల్చుంటాడు. వెంటనే ఉదయం వచ్చిన వాళ్లలో ఒక పెద్దాయన స్టేజి మీదకు వచ్చి అందరికి నమస్కరించి తను ఈ మొత్తం ఆశ్రమాన్ని చూసుకునేవాడిని అని చెప్పి కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు పడుతున్న బాధలు ,కష్టాలు చెప్పి ఈ ఫంక్షన్ ఎందుకు పెట్టామో అందరికి మళ్ళీ ఒకసారి వివరించగా తెలుసుకున్న ఇందు చెబుతున్నంత సేపు బాధతో కన్నీళ్లు కారుస్తూ బేబీ ఇది కదా తన పుట్టినరోజుకు కావలసిన అసలైన బహుమతి అని మనసులో అనుకోని తన కొడుకు వైపు ఆరాధనగా చూడగా కన్నీళ్లు తుడుచుకోమని చెప్పి తను కార్చిన కన్నీళ్లను తుడుచుకుంటాడు.

ఇందుకు ఆత్మ సంతృప్తితో హాయిగా అనిపిస్తుండగా కళ్ళు తుడుచుకుని పక్కనే ఆమె పక్కనే కూర్చున్న చిన్న పాపను ఆమె మీద కూర్చోబెట్టుకొనగా అది చూసిన అందరూ సంతోషిస్తూ గట్టిగా చెవులకు చిల్లులు పడేలా చప్పట్లు కొడతారు. ఇందు మేడం గారిని స్టేజి మీదకు రావాల్సిందిగా కోరుతూ పక్కనే ఉన్న పెద్దవాళ్ళు అందరూ ఆమె ధగారికి వచ్చి గౌరవంగా ఆహ్వానించగా ఆమె మీద ఉన్న చిన్న పాపను గుండెలపై ఎత్తుకొని స్టేజి పైకి వెళ్లి చైర్లో కూర్చొంటుంది.

1 Comment

Comments are closed.