జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 4 60

ఆమె దగ్గరికి వెళ్లి అమాంతం ఆమె తొడల చుట్టూ చేతులు వేసి గాలిలోకి ఎత్తి తిప్పగా సంతోషంగా నవ్వుతుండగా కిందకు దించి ఆమె నుదుటిపై ప్రేమగా ముద్దుపెట్టి ఈ చీరలో చాలా అందంగా ఉన్నావమ్మా అని తీక్షణంగా ఆమెనే చూస్తూ చెప్పగా అతడి కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ కళ్ల తోనే థాంక్స్ చెబుతుంది. బేబీ ఇక వెళదామ అన్న మాటకు స్పృహ లోకి వచ్చిన మహేష్ చిన్నగా నవ్వి ఆమె చేతిలో చెయ్యి వేసి ఇంటికి తాళం వేసి కారులో గుడికి వెళతారు.

గుడిలో తన తల్లి పేరు మీద పూజ జరిపించి ఇద్దరు కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుంటారు. వాచ్ లో సమయం చేసుకోగా 6 గంటలు అవుతుండటంతో అమ్మ ఆలస్యం అవుతుంది ఇక వెళ్దామ అని పైకి లేచి తన తల్లికి చెయ్యి అందించగా ఆమె చేతితో పట్టుకొని లేచి మరొకసారి మొక్కి ఇద్దరు బయటకు వస్తారు. కారును ఇంటివైపుకు కాకుండా మరొక దిశలో పినివ్వగా బేబీ ఇటువైపు అని చెయ్యి చూపిస్తూ చెప్తుండగా ఆ చేతిపై ముద్దు పెట్టి ఆ చేతిని తన గుండెలపై పెట్టుకొని కొద్దిగా ఇటువైపు కాస్త పని ఉందమ్మ అని చెబుతాడు.

ఆమెకు తన కొడుకు గుండె ప్రశాంతంగా కొట్టుకోవడం తెలుస్తుండగా సంతోషంగా ఫీల్ అవుతూ అతడు ఎక్కడికి తీసుకు వెళ్లినా ఆనందంగా వెళ్తాను అని అనుకొని అతడి నవ్వునే చూస్తూ ఉండిపోతుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో ఆశ్రమానికి చేరుకునే సరికి కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఆశ్రమం గేట్ దగ్గరకు రాగానే బయట పూలతో welcome అని వ్రాయబడిన బోర్డ్ వుండి ప్రశాంతంగా ఉంది. కారు లోపలికి వెళ్ళగానే ఒక్కసారిగా గట్టిగా డప్పు చప్పుళ్ళు మరియు అరుపులతో అందరూ గట్టిగా సంతోషంగా మాస్ ఫంక్షన్ అంటే ఎలా ఉంటుందో అలా ఆశ్రమం మొత్తం కేరింతలతో పిిల్లలు, పెద్దలు కేకలు పెడుతూ స్వాగతం పలుకుతున్నారు. కారు దిగగానే చిన్న చిన్న పిల్లలు కారు దగ్గరకు వచ్చి గుంపుగా చేరి పూలు ఇస్తూ happy birthday మేడం అని శుభాకాంక్షలు తెలుపుతున్నారు .

1 Comment

Comments are closed.