జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 4 59

అలాగే ఈ రోజు మనకు సహాయం చేసిన దేవత పుట్టిన రోజు కూడా అని చెప్తూ కేక్ ను తీసుకురాగా , ఈ సాయంత్రం మీ పుట్టినరోజును మా దగ్గర జరుపుకోవాలని కోరగా డప్పు చప్పుళ్ళు మొదలవగా ఆనందంగా కత్తిని చిన్న పాప చేతిలో ఉంచి పాప చేతిని పట్టుకొని కొస్తుండగా అందరూ happy birthday అని గట్టిగా అరుస్తుండగా ఇందు మనసు ఆనందంతో పొంగిపొర్లుతోంది. ఇందు గారిని మాట్లాడవలసిందిగా కోరగా అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దన్గా అయిపోతారు.

మీకు దగ్గరికి వచ్చి అందరికి నమస్కరించి నా జీవితంలో ఇలాంటి ఒక రోజు వస్తుందని అస్సలు అనుకోలేదు. ఇంత మంది ముఖాల్లో సంతోషం చూడటానికే నేను జీవిస్తున్నానని చెబుతుంది. మీరు ఇక నుండి సంతోషంగా జీవించాలని మనసారా కోరుకుని ఆమె మొత్తం ఫీలింగ్స్ ను పంచుకొని ఇప్పటి నుండి మీరు సంతోషంగా జీవించడానికి అవసరమయ్యే మొత్తం మౌలిక సదుపాయాలను అందించడానికి నాకు అవకాశం ఇవ్వవలసిందిగా వారి బాధలను ,కష్టాలను గుర్తు చెయ్యకుండా, సానుభూతి ద్వారా కాకుండా వారిని ప్రాధేయ పడుతుంది.

అంతే అప్పటివరకు క్రమశిక్షణతో వింటున్న పిల్లలందరూ ఇప్పటివరకు చాలా మంది తమకు కొద్ది సహాయం చేసి మా మీద సానుభూతి చూపించి సంతోషించేవారు, తాము కూడా చప్పట్లు కొట్టి అలా అలా ముగించేవారు, కానీ ఇందు గారు మాట్లాడిన పద్ధతికి మనసులు ఉప్పొంగి అందరూ ఏ విధంగా అభినందించాలో కూడా అర్థం అవ్వగా ఎలా పడితే అలా గట్టిగా కేరింతలు పెడుతూ హృదయ పూర్వకంగా చేతులు నొప్పిపుడుతున్న సరే ఇంకా గట్టిగా ఎంతసేపు నుండి కొడుతున్నారో తెలియక ఆనందంగా కొడుతూనే ఉన్నారు.

1 Comment

Comments are closed.