జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 4 60

ఒక 40 నిమిషాలలో ఎయిర్ పోర్ట్ కు చేరుకుని కారును పార్క్ చేసి వేగంగా చెకింగ్ ముగించుకొని లోపలికి వెళతారు. బేబీ ఒకే టికెట్ దొరికింది లేకపోతే నేను కూడా నీతోపాటే వచ్చేదాన్ని అని అతడి చేతిలో చెయ్యి వేసి చెప్పగా అమ్మ నువ్వు జాగ్రత్తగా ఉండు అని ఆమె నుదుటిపై ముద్దుపెడుతుండగా ఫ్లైట్ అనౌన్స్మెంట్ చెయ్యగా ఇందు తన ATM ను తన కొడుకు జేబులో పెడుతూ పిన్ నెంబర్ చెప్పగా , మరి మీకు అని అడుగగా ఇంట్లో కొద్దిగా అమౌంట్ ఉంది ఏదైనా అవసరం వస్తే బ్యాంకుకు వెళ్ళినప్పుడు తీసుకుంటాను అని చెప్పి అమ్మను జాగ్రత్తగా చూసుకో అని చెంపలపై సున్నితంగా స్పృశిస్తూ చెబుతుంది.

వెళ్ళగానే కాల్ చేస్తాను అని జాగ్రత్తగా ఉండమ్మ అని మరి మరి చెబుతూ టన్నెల్ లోకి వెళతాడు. విక్రమ్ గుర్తుకు రాగా సర్ కి కాల్ చేసి నేను అత్యవసరంగా వైజాగ్ వెళ్తున్నాను , తన తల్లి ఇంటి యొక్క అడ్రస్ చెప్పి ఒక్కరే ఉంటారు అందువల్క నైట్ వాచ్ చెయ్యమని కోరగా , నువ్వు ఏమి భయపడవద్దు మహేష్ ఇద్దరు లేడీ constables ను ఆమె దగ్గరే 24 గంటలు ఉండేట్లుగా చేసి నేనే స్వయంగా అప్పుడప్పుడు వెళ్లి చూస్తాను అని ధైర్యం ఇవ్వగా ఇక ఇక్కడి పరిస్థితుల గిరించి భయపడాల్సిన పని లేదని తన ఫ్రెండ్ కృష్ణ కు కాల్ కలుపుతాడు.

ఒక్క రింగుకే అతడు కాల్ లిఫ్ట్ చెయ్యగా ఎలా జరిగింది అని అడుగుతుండగా ఫ్లైట్ లోకి అడుగుపెట్టగా ఎయిర్ హోస్టెస్ దగ్గరుండి టికెట్ చూసి తన సీట్ చూపించగా వెళ్లి కూర్చుంటూ ఆత్రంగా ఎంత సేపటి లోపు వైజాగ్ చేరుకుంటాము అని అడుగగా, హైద్రాబాద్ కు 3:30 కల్లా చేరుకుంటాము మరియు అక్కడనుండి 1:30 గంటల ప్రయాణం , మధ్యలో గ్యాప్ సమయం తీసుకుంటే 4 గంటలలో అంటే సాయంత్రం 6 గంటలకళ్ల వైజాగ్ చేరుకుంటాము అని చెప్పగా , కాల్ on లొనే ఉండటంతో మొత్తం విన్న కృష్ణ 6 హాంతల కల్లా airport కు వచ్చి pick up చేసుకుంటాను అని చెబుతుండగా ఇప్పుడు అమ్మ దగ్గర ఎవరు ఉన్నారు అని అడుగగా , నువ్వేమి భయపడకు ఉదయం నుండి మా అమ్మ గారు పక్కనే ఉంది అంతా చూసుకుంటున్నారు (మేము ఎలా అయితే అంత స్నేహితులమో అప్పటినుండి మా అమ్మలిద్దరు చాలా మంచి స్నేహితులయ్యారు., ప్రతి విషయాన్ని ఫోన్ లో చర్చించుకునేవారు) .

1 Comment

Comments are closed.