మరి నాన్న ఎక్కడ అని అడుగగా ఏంట్రా ఏమి తెలియనట్టు మాట్లాడతున్నావ్ అసలు దీనికి కారణమే మీ నాన్న రా , అయితే 4 రోజులుగా జరుగుతున్నవేమి నీ తెలియదన్నమాట అని చెప్పగా , ఏమి జరిగింది బే ముందు అది చెప్పు అని కోపంగా అడుగగా చుట్టూ ఉన్నవాళ్ళంతా చూడగా ఫ్లైట్ ఎగరబోతోంది అని ఎయిర్ హోస్టెస్ వచ్చి కొద్దిసేపు ఫోన్ ఆపు చెయ్యమని రిక్వెస్ట్ చెయ్యగా ఒక్క నిమిషం రా కృష్ణ తరువాత చేస్తాను అని చెబుతాడు.
ఫ్లైట్ ఆకాశంలోకి ఎగిరిన తరువాత మొబైల్ చేతిలో పెట్టుకొని బాత్రూం కు వెళ్లి కాల్ చేసి మొత్తం మొదట నుండి చెప్పామనగా , నువ్వు వెళ్లిన కొన్ని రోజులకు అనకాపల్లి కి కొంత మంది సాధువులు వారణాసి నుండి వచ్చారని ప్రచారం జరుగగా వెళ్లిన మీ నాన్న తరువాత రోజు నుండి వాళ్ళల్లో కలిసిపోతాను అని చెప్పడంతో ఆ రోజు నుండి ఇద్దరు గొడవలు పడగా రోజు జరిగిందంతా మా అమ్మతో చెప్తూ ఉండటంతో రోజు ఉదయమే మా అమ్మ వెళ్లి ధైర్యం చెప్పి వస్తుండేది.
నిన్న ఉదయం వెళ్లిన మీ నాన్న ఈ రోజు ఉదయం ఫోన్ చేసి నేను సాధువుగా మారిపోయాను అని చెప్పి నాకోసం ఎవ్వరు వేతకొద్దు అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినందువల్ల మీ అమ్మగారు ఏడుస్తూ ఎన్ని సార్లు ప్రయత్నించినా అదే రెస్పొన్సె రావడంతో స్పృహ కోల్పోయి ఉన్నచోటనే పడిపోవడంతో ,కొద్దిసేపటి తరువాత మా అమ్మ రోజు లాగే వెళ్లగా మీ అమ్మ కింద పడి ఉండటం చూసి పక్కనే పది ఉన్న ఫోన్ ద్వారా అంబులెన్స్ కు ఫోన్ చేసి నాకు కూడా కాల్ చెయ్యగా వెంటనే హాస్పిటల్ కు తీసుకొని వెళ్ళాము.
నీకు కాల్ చేస్తే తగలక పోవడంతో పక్క ఊరిలో ఉన్న మీ చిన్న అత్తగారు గుర్తు రావడంతో కాల్ చెయ్యగా 10 గంటలకు పిల్లలతో సరాసరి హాస్పిటల్ కు వచ్చింది.ఇద్దరు చాలా జాగ్రత్తుగా చేసుకోగా కొంతసేపు ఉంచుకొని డిశ్చార్జ్ చెయ్యగా ఇంటికి తీసువచ్చి నీకు కాల్ చేసాను అని చెప్పగా , రేయ్ మామా చాలా చాలా థాంక్స్ రా అని హృదయపూర్వకంగా చెప్పగా ఇవన్నీ ఎందుకులే గాని 6 గంటలకు ఎయిర్పోర్ట్ లో కలుద్దాము నువ్వు జాగ్రత్తగా రారా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు.
👌👌👌👌
Story is so fine. Please update and post till the end