జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 5 55

కృష్ణ వచ్చేలోపు స్నానం చేసి వద్దామని లోపలికి వెళ్ళి 15 నిమిషాలలో ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకొని హాల్ లోకి రాగా కృష్ణ గాడు కూడా అప్పుడే లోపలికి రాగా అందరూ కూర్చొని భోజనాలు చెయ్యగా వసుంధర పాత్రలన్నీ శుభ్రం చేస్తుండగా మహేష్ వంటింట్లోకి రావడం చూసిన వసుంధర అతడు అంటీ అని కృతజ్ఞతా భావంతో ఏదో చెప్పబోతుండగా పాత్రలు తోముతూనే మహేష్ నువ్వు ఏమి చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు , నా స్నేహితురాలిని కాపాడుకోవడం నా బాధ్యత కూడా కావున నా కర్తవ్యాన్ని నేను ఇప్పటివరకు పాటించాను , ఇక నుండి మీ అమ్మకు ఇప్పటిదాకా జరిగినవన్ని మరిచిపోయేలా చేసి సంతోషంగా చూసుకోవడం నీ ఒక్కడి వల్ల మాత్రమే అవుతుంది అని చెబుతూ పక్కనే పెట్టిన తన హాండ్ బ్యాగ్ లోనుండి డబ్బును తీసి ఇస్తూ అవసరానికి ఉంటుంది పెట్టుకో అని చేతిలోకి పెడుతుండగా వద్దు అంటీ మీరు చూపిస్తున్న ప్రేమ మాకు చాలు అని అంటుండగా నేను కూడా మీ అమ్మ లాంటి దాన్నే అని సెంటిమెంట్ డైలాగ్స్ ఏడుస్తున్నట్లు నటిస్తూ చెప్పగా ఆమెను భాధపెట్టడం ఇష్టం లేక తీసుకుంటాడు.

9 గంటలకల్లా పని అంతా అయిపోయిన తరువాత ఉదయం వస్తాను happy night అని హాల్ లో సోఫాలో కూర్చున్న జానకితో చెప్పి బయటకు రాగా పిల్లలిద్దరూ మాట్లాడుకొంటుండగా కృష్ణ వెళ్దామ అని చెప్పగా రేయ్ మామ రేపు కలుస్తాను అని అమ్మ జాగ్రత్త అని చెబుతూ ఇద్దరు బైక్ పై ఇంటికి భయలుదేరుతారు.

మహేష్ కాంపౌండ్ గేట్ వేసి కాంపౌండ్ లో చిన లైట్ మాత్రమే వేసి లోపలికి వెళ్ళి సోఫా పక్కనే ఉన్న మెత్తటి చైర్ ను ఎత్తుకొని బయట కాంపౌండ్ మధ్యలో వేసిన గడ్డి లో ఉంచి లోపలకు వెళ్లి అమ్మ బయట వాతావరణం చల్లగా ప్రశాంతంగా ఉంది కొద్దిసేపు బయట కూర్చుందామ అని అడుగగా సరే అని నెమ్మదిగా లేచి కొడుకు భుజం పై సపోర్ట్ కోసం చెయ్యి వెయ్యగా నిదానంగా నడిపించుకుంటు వెళ్లి చైర్లో కూర్చోబెడతాడు, కన్నయ్య మరి నువ్వు ఎక్కడ కూర్చుంటావు అని అనగా తన తల్లి కాళ్ళ ముందు గడ్డిపై కూర్చొని ఆమె తొడలపై తల వాల్చగా , నా మంచి కన్నయ్య అని వొంగి తన కొడుకు తలపై ముద్దుపెడుతుంది.

జానకి తన రెండు చేతులు తన కొడుకు వెంట్రుకలలో దూర్చి ప్రేమగా నిమురుతుండగా , ఆమె తొడలపై తలను అలాగే ఉంచి అమ్మ ఏదైనా మంచి కథ చెప్పమని ప్రేమగా అడుగుతూ తన తల్లి పాదాల దగ్గరనుండి మోకాళ్ళ వరకు సున్నితంగా ఒత్తడం మొదలుపెడతాడు. జానకి చిన్నతనంలో ఏడుస్తూ మారాం చేసిన ప్రతిసారి తన తల్లి ఒడిలో పడుకోబెట్టుకొని చెప్పిన కథలు గుర్తుకురాగా అందులో ఒక తమాషా కథ గుర్తుకు రాగా చెప్పడం మొదలుపెడుతుంది.

2 Comments

  1. Story is so fine. Please update and post till the end

Comments are closed.