జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 5 55

త్వరగా స్నానం ముగించుకొని బట్టలు వేసుకొని రాగా అప్పటికే కృష్ణ వచ్చి ఉండటంతో అమ్మ మరియు అంటీ వంటింట్లో టీ పెడుతూ ఉన్నారు. మహేష్ వెళదామ అని కృష్ణ అంటుండగా అంటీ హాల్ లోకి టీ తీసుకు వచ్చి ఇవ్వగా స్నేహితులిద్దరు తాగగా కృష్ణ బయటకు నడుస్తుండగా ఒక్క నిమిషం రా అని వంటింట్లో అమ్మ మరియు అంటీ ఇద్దరు మాట్లాడుతుండగా అమ్మ దగ్గరికి వెళ్లి అమ్మ భుజాలను రెండు చేతులతో పట్టుకొని మేము బయటే tiffen తినేస్తాము అని చెప్పి రెండు చేతులను ఆమె చెంపలపై వేసి దగ్గరగా జరిగి తన తల్లి నుదిటిపై ప్రేమగా ముద్దు పెట్టి త్వరగా వచ్చేస్తాము అంటూ అంటీ వైపు తిరిగి అంటీ అమ్మ జాగ్రత్త ,తినగానే మందులు ఇవ్వండి అని మరి మరి చెప్పి తన తల్లి వైపు తిరిగి ప్రేమగా ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూస్తుండగా కొన్ని నిమిషాల పాటు అలాగే నిలబడిపోతారు.

బయట కృష్ణ బైక్ హార్న్ మోగించగా తేరుకున్న మహేష్ తన తల్లి చెంపలను సున్నితంగా నిమిరి బయటకు వచ్చి బైక్ ఎక్కగా సిటీ బయట బీచ్ వైపు వెళతారు.ముందుగా ATM కు వెళ్లి ఒక లక్ష తీసుకొని, బ్రోకర్ కు ఫోన్ చెయ్యగా మొదటి ఇల్లు అడ్రస్ చెప్పగా 10 నిమిషాల్లో అక్కడికి చేరుకుంటారు.

ఆ ఇంటికి కాంపౌండ్ లేకపోవడంతో బయట నుండే వద్దు అని చెప్పగా రెండు మూడో ఇల్లులు చూడగా మా ఇద్దరిలో ఒక్కరికి నచ్చకపోవడంతో , మీకు ఎలాంటి ఇల్లు కావాలో నాకు అర్థమైంది కొద్దిగా ముందుకు వెళితే కొత్తగా ఒక బిల్డింగ్ కట్టించి ఓనర్స్ కు పని పడటంతో అమెరికాకు వెళ్లిపోయారు మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను కానీ కొద్దిగా అమౌంట్ ఎక్కువ అని చెప్పగా కృష్ణ ముందుకు వచ్చి మాకు నచ్చితే ఎంత అయినా పర్వాలేదు అని ముగ్గురు అక్కడికి చేరుకుంటారు.

వీధి లైట్స్ ఇంకా వెలుగుతూ ఉండగా చుట్టూ చూస్తే వందకు పైగా ప్రభుత్వం కట్టించిన ఇల్లులు వుండి ఒక చిన్న పల్లెలా ఉన్నా కూడా ఆ ఇంటి వీధికి మాత్రమే రోడ్ వెయ్యబడి వీధి లైట్స్ వేశారు అని అడుగగా మీకు చూపించబోయే ఇంటి ఓనర్స్ వుడా ను ఒప్పించి డబ్బులు ఇచ్చి మరి వీధి లైట్స్ వేయించారు అని చెబుతారు.

2 Comments

  1. Story is so fine. Please update and post till the end

Comments are closed.