జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 5 55

బయట ఉన్న నన్ను లోపలికి పిలిచి మీరు ఏమౌతారు అని అడుగగా స్నేహితురాలు అని చెప్పగా మరి మహేష్ ఎవరు అని అంటుండగా ఆమె ఒక్కగానొక్క కొడుకు వేరే ఊరు వెళ్ళాడు, వస్తు ఉంటాడు అని చెప్పగా , ఎలా జరిగింది అని అడుగగా మొత్తం జరిగిందంతా వివరించగా , అలాంటిదే ఏదో ఉంటుందని అనుకున్నాను అని నిట్టూర్పు వదలగా , డాక్టర్ గారు ఎలా ఉంది , ఏమి పర్వాలేదు కధ అని ఆత్రంగా అడుగగా , నేను మాములు డాక్టర్ నీ కాదు సైకాలజీ డాక్టర్ ని కూడా, ఆమె శరీరానికి తగిలిన దెబ్బ కంటే మనసుకు తగిలిన దెబ్బకు చాలా కృంగిపోతున్నారు.

తన భర్త ఇక రాడు అన్న నిజం ఆమెలో నాటుకుపోయినట్టుంది. ఇప్పుడు ఈమెకు కావాల్సింది మందులు ,ఇంజుక్షన్ లు కాదు తోడుగా వుండి ప్రేమగా చూసుకునేవారు , మేము మా మందులు ఒకరోజు మాత్రమే పనిచేస్తాయి, తన కొడుకుకు చెప్పండి అతడి తోడూ మరియు ప్రేమ మాత్రమే ఈమె త్వరగా కొలుకొనెల చేస్తాయి అని , ఒకటి అడుగుతాను ఆలోచించి చెప్పండి ఈమె భర్త ఇప్పుడే మారిపోయి వెనక్కు తిరిగి వస్తాడని అనుకుంటున్నారా అని అడుగగా ఆలోచించి నేను 3 4 రోజులుగా చూస్తున్న దాన్ని బట్టి అతడిని ఎవరో తీవ్రంగా మార్చివేశారు కావున అది ఇక జరగనే జరుగదు.

నాకు తెలిసి మా స్నేహితురాలికి కూడా అర్థమైంది కాబట్టే తను స్పృహ కోల్పోయింది అని బల్ల గుద్దినట్టు చెప్పగా , అయితే ఈమె త్వరగా అన్ని మరిచిపోయి కొలుకోవాలంటే ఇంటిలో ఈమె భర్తకు సంబందినవన్ని కాల్చిపారేయ్యండి ,అతడికి సంబంధించిన ఏ వస్తువు ఈమెకు కనిపించి గుర్తు చేయరాదు. డాక్టర్ గారు ఇది జరగక ముందు అతడు చాలా మంచివాడు అని చెప్పగా అయితే కొన్ని రోజులు అన్ని తీసుకొని, ఆమెను దూరంగా వేరే ప్రదేశంలో ఉంచండి.

2 Comments

  1. Story is so fine. Please update and post till the end

Comments are closed.