జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 5 55

ఇందులో మహేష్ తప్పు ఏముంది భార్గవి అతనికి ఇదంతా ఏమి తెలియదు అని వెనకేసుకొని రాగా మీరు చిన్నప్పటి నుండి అంతే అని చెబుతుండగా కృష్ణ తల్లి భార్గవి తో డాక్టర్ ఇక ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చు అని చెప్పారని చెప్పగా కృష్ణ వెళ్లి ట్యాక్సీ తీసుకొని రాగా కృష్ణ బైక్ లో ఇంటికి చేరతారు. ఇంటికి చేరిన వెంటనే ఇద్దరు మహేష్ తల్లిని నెమ్మదిగా బాత్రూం లోకి తీసుకొని వెళ్లి స్నానం చేయించగా కొద్దిగా రిలీఫ్ తినిపించగా బట్టలు వేసుకొని బెడ్ పై వెనక్కు వాలి కూర్చోగా భార్గవి పిల్లలు ఆమె చుట్టూ కూర్చొని పాలకరించసాగారు.

భార్గవి వంటింట్లోకి వెళ్లి భోజనం తయారు చెయ్యగా వొంటి గంటకు అందరూ భోజనం చెయ్యగా డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకొని మత్తుగా ఉండటం వల్ల పడుకొంటు ఉండగా నేను చెప్పిన దాని గురించి ఆలోచించి మహేష్ వచ్చేలోపు సరైన నిర్ణయం తీసుకో అని చెప్పి భార్గవి ఉంది కదా నేను ఒకసారి ఇంటికి వెళ్లి వస్తాను అని చెప్పి తల్లి కొడుకులు ఇద్దరు భార్గవికి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి భయలుదేరుతారు. సాయంత్రం 6 గంటల కల్లా కృష్ణ ఎయిర్పోర్ట్ కు చేరుకోగా కొద్దిగా ఆలస్యంగా 6:30 కు ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది.

5 నిమిషాలలో మహేష్ అందర్నీ తోసుకుంటూ బయటకు రాగా రోలింగ్ దగ్గర చూడగా బ్యాగ్ రాగా మహేష్ తీసుకోగా అతడి చేతిలోనుండి కృష్ణ అందుకొని త్వరగా బయటకు రాగా కృష్ణ బ్యాగ్ ట్యాంక్ పైన ఉంచి బైక్ స్టార్ట్ చెయ్యగా మహేష్ వెనక కూర్చుంటూ త్వరగా వెళ్ళరా అని అంటాడు.

బైకును రోడ్ మీద పోనిస్తూ అరే మామ అని డాక్టర్ చెప్పినదంతా మొత్తం చెప్పి మీ నాన్నంటే నీకు చాలా ఇష్టమని నాకు కూడా తెలుసు కానీ ఇప్పుడున్న పరిస్థితి వేరు డాక్టర్ చెప్పినట్టు మీ అమ్మగారితో నాన్న గురించి అస్సలు మాట్లాడవద్దు అని చెప్పి అసలు విషయం చెప్పడం మరిచిపోయాను ఆరే ఏందిరా మామ నీ పేరు చెబితే చాలు మీ చిన్నత్తా చాలా కోపంగా మాట్లాడుతోంది.

2 Comments

  1. Story is so fine. Please update and post till the end

Comments are closed.