జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 5 55

అంటీ చిన్నగా దగ్గగా ప్లేట్ వైపు తిరగగా తన తల్లి భోజనం వడ్డిస్తుంది. క్షణాలు గడిచేకొద్దీ తన తల్లి తన పక్కనే ఉన్న కూడా కౌగిలించుకోలేక పోతున్నందుకు తన వల్ల కావడం లేక గుండె కొట్టుకునే వేగం తగ్గుతూ అమాంతం పెరుగుతూ ఎక్కిళ్ళు వచ్చి చైర్ లో కుదురుగా కూర్చోలేకపోతున్న తన కొడుకు పడుతున్న విరహాన్ని గ్రహించిన జానకి తన పక్కనే నిలబడి తన చేతులను తన కొడుకు తలపై వేసి చిన్నగా తట్టి వేళ్ళతో వెంట్రుకల్లో నిమరగా కొద్దిగా నెమ్మదించి మహేష్ తన తల్లి చేతిపై ఒక చేతిని వేసి అదుముకుంటూ తిని కృష్ణ తో సహా సోఫా లో కూర్చుంటాడు.

అంటీ అమ్మ భోజనం చేసి పాత్రలన్నీ శుభ్రం చేసి సర్దుతుండగా ఇంట్లో మీ ఆయన ,అమ్మాయి ఎదురు చూస్తుంటారేమో మీరు వెళ్ళండి నేను సర్దుతాను అని చెప్పగా చిన్నగా నవ్వి సరే అని హాల్ లోకి వచ్చి కృష్ణ వెళదామ అని అనగా కృష్ణ బైక్ తాళాలు తీసుకొనగా మహేష్ వారిని బయట వరకు వెళ్లి తరువాత కలుద్దాం రా మామ అని చెప్పి సాగనంపుతాడు వాళ్ళు రోడ్ మీదకు వెళ్ళగానే గుండె అతి వేగంగా కొట్టుకుంటుండగా పరిగెత్తుకుంటూ వంటింట్లోకి వచ్చి తన తల్లి సామానులు సర్దుతుండగా రెండు చేతులు ఆమె నడుము చుట్టూ వేసి వెనుక నుండి గట్టిగా కౌగిలించుకుంటాడు.

ఆమె వెచ్చని కౌగిలికి ఊపిరి నెమ్మదిగా వదులుతూ మనసు శాంతించి ప్రాణం తిరిగి వచ్చినట్లుగా ఉంది . ఏమయ్యింది కన్నా అని అడుగగా ఇంకా గట్టిగా కౌగిలించుకుంటు అమ్మ నువ్వు ఈ చీరలో చాలా చాలా అందంగా ఉన్నావు అని చెప్పగా , గర్వపడుతూ ఆమె కొడుకు వైపు తిరిగి తన కొడుకు చెంపలపై చేతులు వేసి పైకి జరుగుతూ అతడి నుదుటిపై ప్రేమగా ముద్దు పెడుతూ ఉదయం వెళ్లి ఇప్పుడు వచ్చావు ఎంత కంగారు పడ్డానో తెలుసా ఇంతసేపు ఏమి పని అని అలక ముఖం పెట్టగా,

ఇంకా చాలా పని ఉంది అని గుర్తుకు రాగా సమయం చూడగా 3 గంటలు అవుతుండగా అమ్మ బయటకు వెళ్దామ అని అడుగగా నా మహేష్ ఎక్కడికి రమ్మన్నా సంతోషంగా వస్తాను అని చెప్పగా ఆనందిస్తూ ఆమె నుదుటిపై ముద్దు పెడుతూ ఫోన్ తీసి క్యాబ్ బుక్ చేసి అడ్రస్ చెప్పగా క్యాబ్ వచ్చేలోపు అమ్మ నీ నగలన్ని తియ్యమనగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒక్క తాళి తప్ప నగలన్ని తీసివేయగా అన్ని ఒక బాక్స్ లో పెట్టి బీరువాలో పెట్టి తాళం వేసి తాళం వేరే రూమ్ లో దాచిపెడతాడు.

2 Comments

  1. Story is so fine. Please update and post till the end

Comments are closed.