జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 5 55

10 నిమిషాలలో క్యాబ్ ఇంటి ముందుకు వచ్చి హార్న్ మ్రోగించగా ఇద్దరు రెడి గా ఉండటంతో ఇంటిలో నుండి ఏమి తీసుకోక కరెంట్ మెయిన్ స్విచ్ ఆపివేసి రూమ్ లన్నింటికి మరియు బయట తలుపుకు తాళాలు వేసి క్యాబ్ ఎక్కి షాపింగ్ మాల్ కు వెళ్ళమని చెబుతాడు.

15 నిమిషాలలో చేరుకోగా క్యాబ్ కు పే చేసి లోపలికి వెళ్ళి చీరాల సెక్షన్ కు తీసుకొని వెళ్లి అమ్మ ఏమి నన్ను ప్రశ్నించకుండా 20 కి తక్కువ కాకుండా నీకు నచ్చిన మంచి చీరలు సెలెక్ట్ చెయ్యమని చెప్పి , సేల్స్ మహిళ వైపు తిరిగి కాస్ట్ ఎక్కువ ఉన్నవే చూపించండి అని చెప్పి ఇప్పుడే వచ్చేస్తాను చూస్తూ ఉండమని చెప్పి , మెన్స్ wear వైపు వెళతాడు , ఒక అర గంటలో నాకు సరిపోయే జీన్స్ , టీ షర్ట్స్ , షర్ట్స్ మరియు నైట్ షర్ట్స్ సెలెక్ట్ చెయ్యగా కౌంటర్ కు పంపిస్తారు.

పక్కనే కొన్ని జతల టవల్ కూడా వాటితో పాటు పంపిస్తాడు. తన షాపింగ్ అవ్వడంతో టాటా షోరూం కు కాల్ చేసి ***** షాపింగ్ మాల్ దగ్గర డెలివర్ చెయ్యమని చెప్పి తన తల్లి దగ్గరకు వెళతాడు.

అప్పటికే చాలా సెలెక్ట్ చేసి ఉండటంతో మహేష్ కు కూడా కొన్ని బాగా నచ్చడంతో వాటిని కూడా తీసుకొనగా పక్కనే ఒక మంచి చీర కనిపించగా అమ్మ అటువైపు వెళ్లగా ,మహేష్ సేల్స్ మహిళ దగ్గరికి వెళ్లి అన్ని చీరలు బ్లౌస్స్ కావాలి అని చెప్పగా ఆమె ఆ చీరలలోనే piece ఉంటుంది అని చెబుతూ ఎవరికి అని అడుగగా ఆమెకు అని చూపించగా ఆమె అమ్మను లోపలికి తీసుకెళ్లి కొద్దిసేపు తరువాత బయటకు వచ్చి designs చూపించగా నాకేం తెలుసు మీ ఇష్టం అని చెప్పగా నవ్వుకుని రేపు సాయంత్రం వచ్చి తీసుకొని వెళ్ళండి అని చెప్పి చీరలు ఉన్న pieces కట్ చేసుకుంటుంది.

2 Comments

  1. Story is so fine. Please update and post till the end

Comments are closed.