జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 5 55

డ్రైవర్ కారు తాళాలు ఇవ్వగా అతడికి 1000 ఇవ్వగా థాంక్స్ సర్ అని చెప్పి డెలివరీ పేపర్లో సంతకం చేయించుకొని వెళ్ళిపోతాడు. అదంతా తన తల్లి ఆశ్చర్యంగా చూస్తుండగా ముందు కారు డోర్ తెరిచి వినయంగా మేడం అని చెయ్యి లోపలికి చూపగా , గుడ్ డ్రైవర్ అని నవ్వుతూ కారు ఎక్కగా చీర కొంగును ఆమె చేతికి ఇచ్చి డోర్ వేస్తాడు.

తన కొడుకు అటువైపు వచ్చి కారు ఎక్కేంతవరకూ జానకి సంతోషంగా నవ్వుతూనే ఉంది. ఎవరిది కన్న కారు అని అడుగగా నా బంగారు అమ్మది అని చెబుతాడు. సమయం చూడగా 5 గంటలు అవుతుండటంతో నగల షో రూమ్ కు కొద్దిగా దూరంగా కారును పార్క్ చేసి కారులో పాటలు పెట్టి అమ్మ వింటూ ఉండు 10 నిమిషాల్లో వచ్చేస్తాను అని చెప్పి కారు డోర్స్ లాక్ చేసి పరిగెత్తుకుంటూ షో రూమ్ కు వెళ్లి 7 వారాల నగలు అంటారు కదా వాటిని అన్నింటినీ చూపించండి అని చెప్పి తను ఉదయం తీసిన ఫోటోలను చూస్తూ ఒక్కొక్కటి బయట పెట్టిస్తూ అన్ని వేరే వేర్ మూడు మూడు జతలను తీయిస్తాడు.

అన్ని తనకు నచ్చినవే కావున అన్నింటినీ బిల్ వేసి ప్యాక్ చెయ్యమనగా 15 నిమిషాలలో ప్యాక్ చెయ్యగా స్వైప్ చేసి బిల్ కట్టేస్తాడు.ఒక పెద్ద బ్యాగ్ లో పెట్టి ఇవ్వగా బయటకు వెళుతుండగా సర్ అని పిలిచి ఒక గిఫ్ట్ బాక్స్ ను చేతికి అందిస్తాడు. త్వరగా కారు దగ్గరికి వచ్చి వెనుక కారులో పెడతాడు. Decorater దగ్గరికి వెళ్లగా చీకటి పడుతుండగా , అతడు రిమోట్ ఇచ్చి రెండు స్విచ్ లు ఎలా పనిచేస్తాయో వివరించగా అమౌంట్ పే చేస్తాడు. అన్నింటినీ జానకి ఆశ్చర్యంగా గమనిస్తూ ఉంది.

కారును గుడి దగ్గర ఆపి ఇద్దరు దిగి లోపలికి వెళ్ళి పూజ చేయించి పంతులును బయటకు పిలుచుకొని వచ్చి పక్కనే పూల హారం మరియు టెంకాయ నిమ్మకాయలు కొని పంతులును ఇవ్వగా మంత్రాలు చదివి పూల హారం కట్టి నిమ్మకాయలు పెట్టమనగా మహేష్ పెట్టగా కుంకుమ పెట్టి పూజ చేసి టెంకాయ కొట్టమనగా కొడతాడు.

2 Comments

  1. Story is so fine. Please update and post till the end

Comments are closed.